విస్తరిస్తున్న సంఘ కార్యం


రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 8,9,10 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగాయి. ఈ సందర్భంగా సమర్పించిన నివేదికలో ముఖ్యఅంశాలు -

ఉగాది


చైత్రమాస జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని,

శుక్ర పక్షే సమగ్రంతు తదా సుర్యోదయే సతి.


చైత్రశుద్ద పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు. 'ఉగ' అనగా నక్షత్ర గమనము, నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినము. భవిష్యపురాణంలో యుగాదుల గురించి వివరణ ఉంది. కృతయుగం వైశాఖ తృతీయనాట, త్రేతాయుగం కార్తీక నవమి నాడు, ద్వాపర ఆశ్వీయుజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు ప్రారంభం అయినట్లు శాస్త్రోక్తం.

ప్రఖర దేశభక్తి (స్ఫూర్తి)


'వందేమాతరం' అని నినాదం చేసినందుకు కేశవ్‌తోపాటు అనేకమంది పిల్లల్ని బ్రిటిష్‌ హెడ్‌మాస్టర్‌ పాఠశాల నుంచి బహిష్కరించాడు. నెలరోజులు గడిచేసరికి మిగిలిన పిల్లలు క్షమాపణలు చెప్పి తిరిగి పాఠశాలలో చేరారు. కానీ కేశవ్‌ మాత్రం క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోలేదు. 'ఎందుకు క్షమాపణలు కోరాలి? నేనేమి తప్పు చేశాను?' అని ప్రశ్నించాడు. 'వందేమాతరం అనడం, ఇతరులతో అనిపించడం తప్పుకాదా' అంటూ ఒక పెద్దమనిషి కేశవ్‌కు నచ్చచెప్పాలని చూశాడు. 

స్వాతంత్య్రాన్ని రక్షించుకోవాలి (హితవచనం)


భారతదేశం స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి కారణం స్వదేశస్థులు చేసిన ద్రోహమే అని చెప్పాలి. సింధుప్రాంతపు రాజా దాహీర్‌ను మహమ్మద్‌బిన్‌ ఖాసిం ఓడించాడు. ఈ ఓటమికి ఏకైక కారణం సింధు సేనాపతులు ఖాసిం మనుషుల దగ్గర లంచాలు తీసుకొని తమ రాజు తరఫున పోరాడక పోవటమే. 

అమరవాణి


మహాజనస్య సంసర్గః

కస్యనోన్నతి కారకః

పద్మపత్ర స్థితం తోయమ్‌

దత్తేముక్త ఫల శ్రియమ్‌||

ప్రముఖులు మాటజమ్మూకాశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉన్నంతకాలం ప్రత్యేక హోదా ఉండాల్సిందే. 356వ అధికరణ, 35ఎ తొలగించడానికి వీలులేదు. అవి లేకపోతే విలీనానికి అర్థం ఉండదు.       

- ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత

'హిందూ తీవ్రవాదం' బూటకమని తేల్చిన కోర్టుస్వామి అసీమానందని నిర్దోషిగా ప్రకటించిన ప్రత్యేక న్యాయస్థానం

ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని తక్కువ చేయడం కోసం, స్వార్ధ ప్రయోజనాలను సాధించడం కోసం కొన్ని అంతర్జాతీయ శక్తులు 'హిందూ తీవ్రవాద' భూతాన్ని సృష్టించాలనుకున్నాయి. ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి ఎలాగైతే పాకిస్తాన్‌ కేంద్రమో అలాగే భారత్‌ 'హిందూ తీవ్రవాదానికి' పుట్టినిల్లని చూపాలని ప్రయత్నించాయి. 

కుటుంబ వ్యవస్థ మానవాళికి భారతదేశం అందించిన ఒక విలక్షణమైన కానుక


తీర్మానం-1
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌, అఖిల భారతీయ ప్రతినిధి సభ, 2019, గ్వాలియర్‌లో ఆమోదించిన తీర్మానాల పూర్తి పాఠం.
కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్య మంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది.

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి


భారతీయ ఆర్థిక వ్యవస్థ గ్రామం ఆధారంగా నిర్మితమైంది.  రాజులు పరిపాలించినప్పుడు కూడా పంచాయితీ పౌరసభలు, వర్తకసంగాలు, వృత్తికుటుంబాలు పూర్తి స్వతంత్రంగా పనిచేసేవి. విదేశీదాడుల్లో కూడా పంచాయితీ వ్యవస్థ పదిలంగా ఉండేది. ఈ రహస్యాన్ని గ్రహించిన ఆంగ్లేయులు ప్రణాళిక ప్రకారం గ్రామాలపై పడ్డారు. గ్రామాలు న్యాయం చెప్పకుండా, పన్నులు వసూలు చేయకుండా,వనరులు వాడుకోకుండా కట్టడిచేశారు. కులవృత్తులతోకూడిన చేనేత, వడ్రంగి వంటివారిని నిరుద్యోగులను చేశారు. గ్రామీణ పరిశ్రమలను, వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని గాంధీజీ అనేవారు.  

పరిసరాల పరిరక్షణపై దృష్టి


పర్యావరణ పరిరక్షణ గురించి పని చేయబోతున్నదని ఈసారి పర్యావరణం, పరిసరాలను కాపాడుకుంటూ, వాటిని పరిరక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని సర్‌ కార్యవాహ సురేశ్‌ జీ జోషి ప్రకటించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రకటనలుఆజాద్‌ హింద్‌ ప్రభుత్వపు 75వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలి

ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళక్రితం నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ సర్కార్‌ ఏర్పడింది (21 అక్టోబర్‌, 1943). భారత్‌ స్వాతంత్య్రం పొందడంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనది.

నారీలోకానికి ఆదర్శం సీత


శ్రీమద్రామాయణాన్ని వ్రాస్తూ వాల్మీకి మహర్షి 'రామకథ, రావణవధ; మహత్తరమయిన సీతకథ వ్రాస్తున్నాను అన్నాడు. అంటే జాతికి అదర్శంగా శ్రీరాముడు, సతీత్వానికి ప్రతీకగా సీత. దుర్మార్గులకు జరిగే ప్రాయశ్చితంగా ఆయన రాముని కథ  చూపించారు.

పుచ్చ కాయ (గృహవైద్యం)


 పుచ్చకాయ గురించి తెలియనవారు ఉండరు అవునా.. మన అమ్మమలు, నాయనమ్మ తినమని చెపుతుంటారు.
కానీ ఇందులో ఎన్ని ఔషద గుణాలు దాగివున్నాయో తెలుసా. ముఖ్యంగా ఎండా కాలంలో ఇది చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఎండ వేడికి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల వడదెబ్బకు గురవుతాము. వడదెబ్బ కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి కూడా దారితీయవచ్చును. అలాంటి సమస్య ఎదురవకుండా వడదెబ్బను నివారించడానికి పుచ్చకాయ బాగా ఉపయోగ పడుతుంది.

దేవాలయాలను నేలకూల్చి, విగ్రహాలు దొంగలించిన చర్చి పాస్టర్లు


ఓ చర్చి నిర్వహిస్తున్న పాస్టర్లు సమీపంలో ఉన్న దేవాలయాలను కూల్చివేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం సూర్యారావుపేట గ్రామంలో చోటుచేసుకుంది.

చర్చి జరిపిన సాంస్కృతిక దాడికి వాటికన్‌ పోప్‌ క్షమాపణ చెప్పాల్సిందే


సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం చర్చి అధికారులు మెక్సికోలోని వివిధ తెగలకు చెందిన ప్రజలపై సాగించిన దురాగతాల తాలూకు సెగలు ఇప్పటినీ వాటికన్‌ పాప్‌ ని వెంటాడుతున్నాయి. స్పెయిన్‌ దేశంతో కలిసి రోమన్‌ క్యాథలిక్‌ చర్చి జరిపిన దురాగతాలకు ఇరువురూ క్షమాపణ చెప్పాల్సిందే అని తాజాగా మెక్సికో ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. స్పెయిన్‌ రాజు 6వ ఫెలిప్‌ మరియు వాటికన్‌ అధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌లకు లేఖ రాసింది.

భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్‌ కుట్ర


ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్‌లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. వెంటనే వీరంతా ఆ వర్గంపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగి పోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. ప్రభుత్వం ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలుసుకుని, ప్రజలకు చెప్పేలోగానే వీళ్ళు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు. అయితే వీరు ఇలా వ్యవహరించడం పాకిస్తాన్‌ పన్నిన కుట్రలో ఇది భాగమని అంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.

ఇంట్లోనే వ్యవసాయంవ్యవసాయానికి మన దేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతును అన్నదాతగా భావించి గౌరవించే సంస్కతి మనది. అయితే నగరీకరణ పేరుతో అన్నదాతను మనం మర్చిపోతున్నాం. బయట వస్తువులను డబ్బు పెట్టి కొనడం అలవా టయిపోయి ఆ సామాగ్రి  వెనుక ఉన్న శ్రమని మనం మరచిపోతున్నాం. అది విలువ కట్టలేము. మరి నగర వాసులకు వ్యవసాయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా? అందుకే ఇప్పుడు హైడ్రోఫోనిక్స్‌ విధానం వచ్చింది. అంటే ఇంట్లోనే కిటికీల దగ్గర వరండాలో మనం మొక్కల్ని, కూరగాయలని మనం పనికిరావు అనుకునే వస్తువులను ఉపయోగించి పెంచుకోవడం అన్నమాట.

మహా శివరాత్రి


మహా శివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశి రోజున వస్తుంది. శివుడు ఈ రోజు లింగాకారంలో ఆవిర్భవించాడని ''శివపురాణం'' తెలియజేస్తోంది. ఈ పర్వదినం ప్రధానంగా శివుడికి ''బిల్వ పత్రాలు'' సమర్పించి, రాత్రి అంతా జాగరణ చేసి అభిషేకములు, అర్చనలూ జరుపుతారు. 

దేశభక్తి (స్ఫూర్తి)


1924లో బ్రిటన్‌ యువరాజు వేల్స్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.

మూఢ విశ్వాసాలను తొలగించాలి (హితవచనం)


మూఢ విశ్వాసాలు సహజంగానే తప్పక మారిపోతాయి. బలవంతంగా వాటిని తొలగించనక్కరలేదు. అసలు పురాతన హిందూ ధర్మపు తత్వ జ్ఞానం నేటి విజ్ఞానంతో ఎలా సమన్వయమవుతుందో వివరించి చెప్పాలి. ఈ పని ధర్మగురువులు చేయాలి.

ప్రముఖులు మాట


భారత వాయుసేన మెరుపు దాడులు జరిపి బాలాకోట్‌ ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేయడం పుల్వమా అమర జవాన్లకు నివాళే. భారత్‌ శక్తి సంపన్నం కావాలని వీర సావర్కర్‌ ఆకాంక్షిం చారు. శక్తివంతులం కాకుంటే మనమాట ఎవరు వినరు.             
- డా. మోహన్‌ భాగవత్‌,  ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌