Nov -2016 | Volume 8 | Issue 5సామాజిక సమస్యల పరిష్కార దిశలో వేగంగా అడుగులేస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌.

కేరళలో అడ్డులేని కమ్యూనిస్టుల హింస - ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-1

నేటి ప్రపంచ సంక్షోభానికి ఏకాత్మ మానవతా వాదమే పరిష్కారం- ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-2

మానవత్వంలో దైవత్వాన్ని దర్శించడమే హిందుత్వ మూల సిద్ధాంతం

శాంతి కోసం అవసరమైతే కఠినంగా వ్యవహరించాలి

ఇటువంటి దసరా అన్ని ఊర్లలో జరిగితే ప్రజలు సామరస్యంగా జీవిస్తారు

ప్రజలు-ప్రభుత్వం సమన్వయంతోనే సమస్యలకు పరిష్కారం

'సెక్యులర్‌' పదం హిందువులను అవమానపరుస్తూ, ముస్లింలకు హాని కలిగిస్తున్నది

కాశ్మీర శైవతత్త్వ ప్రతిపాదకులు ఆచార్య ''అభినవగుప్త'' శివైక్య సహస్రాబ్ది సంవత్సరం

మావి మాకే.. మీ వన్నీకూడా మాకే..!

దుష్ప్రచారం మిధ్య! సరస్వతి సత్యం

భారత్‌తో సంబంధాలు చాలా విలువైనవి

దీపావళి వేడుకలు

ప్రజాదరణ పదిలం

గృహ వైద్యం

చిన్న రాజకీయపార్టీ ఏమి ఆలోచించగలదు

ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయాలి

అమరవాణి

దేశంలో నీతి మరియు సంపత్తిల వికాసం చెందాలి

ఉచిత పబ్లిసిటి

నైతిక బోధనా అనివార్యం

సామాజిక సమస్యల పరిష్కార దిశలో వేగంగా అడుగులేస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌.


రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘంలో ప్రతి సంవత్సరం అఖిల భారతీయ స్థాయిలో మూడు సమావేశాలు నిర్వహించబడుతాయి. అందులో 1) ప్రతి సంవత్సరం మార్చి మాసంలో అఖిల భారత ప్రతినిధి సభ, (సర్వసభ్య సమావేశం) 2) జూలై మాసంలో కార్యనిర్వాహక సమావేశం (ఆ సమావేశంలో ప్రాంత ప్రచారక్‌ ఆపై బాధ్యత ఉన్న వాళ్ళు మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు) 3) అక్టోబర్‌ మాసంలో అఖిల భారత కార్యకారిణి సమావేశం (ఈ సమావేశంలో ప్రాంత సంఘ చాలక్‌, ప్రాంత కార్యవాహ, ప్రాంత ప్రచారక్‌ ఆపై కార్యకర్తలు వారితోపాటు దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ క్షేత్రాలలోని సంఘటనా కార్యదర్శులు మరియు ఎంపిక చేసిన కొద్దిమంది.) ఈ విధంగా వివిధ స్థాయి కార్యకర్తలు పై సమావేశాలలో పాల్గొంటారు.

ఈ సంవత్సరం అక్టోబర్‌ మాసంలో జరిగిన అఖిలభారత కార్యకారిణి సమావేశాలు భాగ్యనగరం లోని అన్నోజిగూడలో ఉన్న శ్రీవిద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో అక్టోబర్‌ 23,24,25తేదీలలో నిర్వహించబడ్డాయి. పూజనీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ మోహన్‌ భాగవత్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. శ్రీ భయ్యాజీ జోషి (సర్‌ కార్యవాహ) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో సంఘ పని విస్తరణ విషయంలో, సామాజిక సమస్యలు పరిష్కారం కోసం చేయవలసిన పనుల విషయంలో విసృత్తంగా చర్చించబడ్డాయి. ఈ సందర్భంలో వచ్చిన నివేదికలో సంఘం ఈ రోజున 44 వేల గ్రామాలలో 70 వేలకు పైగా శాఖలు, సాప్తాహికలు, సంఘ మండలులు నడుస్త్తున్నాయని ఆ నివేదిక ద్వారా తెలిసింది. 2017 మార్చిలో జరిగే ప్రతినిధి సభ వరకు 75 వేల శాఖలుగా విస్తరించాలని నిర్ణయించబడ్డాయి. సామాజిక సమరసత, ఐక్యత ఈ రెండు ఏ కాలంలోనైనా సమాజాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఈ దిశలో వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సర్‌ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి పిలుపునిచ్చారు. సమాజంలోని కుల వివక్షతను రూపుమాపాలని అట్లాగే సమాజంలో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా వారు స్వేచ్ఛగా జీవించే వాతావరణం నిర్మాణం చేయవల్సిన బాధ్యత ఉందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అందులో ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక మొదలైన రాష్ట్రాలలో ఇస్లాం జీహాది శక్తులు హిందుత్వ సంస్థల కార్యకర్తలపై చేస్తున్న దాడులు హత్యాకాండలను నివారించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని తీవ్రంగా గర్హించారు. శాంతిభద్రతలను కాపాడడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న తీరు శోచనీయమైన విషయం. ప్రభుత్వాలు కఠినంగా ఈ దాడులను అరికట్టి శాంతిభద్రతలను కాపాడాలని పిలుపు నిచ్చారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోది పిలుపు మేరకు దేశంలో స్వచ్ఛ భారత్‌ ఉద్యమంలో క్రియశీలంగా ప్రజలు భాగస్వాములవుతున్నారు. అట్లాగే ఆరోగ్యవంతమైన భారత్‌ నిర్మించడానికి కూడా దేశప్రజలందరూ ముందుకు రావాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అక్టోబర్‌ 23,24,25 తేదీలలో పత్రికా విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించ బడ్డాయి. 23వ తేదీన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మా|| శ్రీ భాగయ్యగారు (సహ సర్‌ కార్యవాహ) పత్రికా విలేకరులను ఉద్దేశించి ప్రసంగించారు. 23 నుంచి ప్రారంభమయ్యే కార్యకారిణి సమావేశాలలో 2 తీర్మానాలు చేయ బోతున్నట్లుగా తెలియజేశారు. అందులో 1) కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై సీపీఎం కార్యకర్తలు చేస్తున్న అమానుష దాడులను తీవ్రంగా ఖండిస్తూ 2) ఈ రోజు సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యలకు పరిష్కారం చూపించగలిగే దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మతా మానవ దర్శనం ఈ రెండు అంశాలపై తీర్మానం చేస్తారు. 24వ తేదీ నాడు పత్రికా విలేకరుల సమావేశంలో అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ శ్రీ మన్మోహన్‌ వైద్య మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1992 సంవత్సరంలో నిర్వహించిన పృథ్వీ సదస్సులో 172 దేశాల ప్రతినిధులు పాల్గొని పపంచ శాంతి సమీకృత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా ప్రకటించారు. అట్లాగే 2015వ సంవత్సరంలో పారిస్‌లో జరిగిన పృథ్వీ సదస్సులో భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించాయి. కానీ ఆచరణలో ఆ దేశాలు ఈ లక్ష్యాలకు దూరంగా ప్రయాణం చేస్తున్నాయి. దాని కారణంగా ప్రపంచంలో అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని అఖిల భారత కార్యకారిణి మండలి అభిప్రాయపడినట్లుగా వివరించారు. సమాజంలో ప్రకృతి, కుటుంబం, సమాజం వీటిమధ్య సమతుల్యతను కాపాడబడి నప్పుడే ఎలాంటి సంఘర్షణలు లేని శాంతియుత జీవనం ప్రపంచంలో కొనసాగేందుకు దారులు ఏర్పడతాయి. ఈ విషయాలనే దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఏకత్మతా మానవ దర్శనంలో వివరించారు. ఈనాటి పరిస్థితులకు ఆ ఆలోచనలే ప్రత్యామ్నాయం. శ్రీ నందకుమార్‌ (అఖిల భారత సహ ప్రచార ప్రముఖ్‌) మాట్లాడుతూ కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై సీపీఎం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని అఖిల భారతీయ కార్యకారిణి మండలి ఆగ్రహం వ్యక్తం చేసిందని; అక్కడ రోజురోజుకి ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆదరణ పెరుగుతుండగా, దాన్ని తుడిచివేయాలని ీపీఎం కంకణం కట్టుకుందని దుయ్యబట్టింది. 28 ఏప్రీల్‌1969న వడిక్కల రామకృష్ణన్‌ అనే 19 ఏళ్ల స్వయంసేవక్‌ను పట్టపగలు అతి దారుణంగా రోడ్డుపై హత్య చేశారని, అందులో ప్రథమ నిందితుడు నేటి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ అని ఆరోపించింది. కేరళలోని ఒక్క కన్నూరు జిల్లాలోనే 82 మందిని హత్య చేశారంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని బైఠక్‌లో సభ్యులు భావించారు. ఐదు నెలల కాలంలో ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను సీపీఎం పొట్టన పెట్టుకుం దన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని సభ్యులు పిలుపునిచ్చారు. 25వ తేదీన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో శ్రీ భయ్యాజీ జోషి (సర్‌ కార్యవాహ) పత్రికా విలేకరుల సమావేశంలో మూడు రోజులు చర్చించిన విషయాలను సంక్షిప్తంగా వివరించారు. దాంతోపాటు విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానం సంక్షిప్తంగా... కళాకారులకు వివక్ష, సరిహద్దులు ఉండవన్నారు. పాకిస్తాన్‌ కళాకారులు ఇక్కడికి రాబోమంటే నష్టమేమి లేదు వారి పైనే ఆధారపడే పద్ధతికి స్వస్తి చెప్పాలన్నారు. మన దేశంలో కళాకారులకు కొరత లేదన్నారు. ప్రతి ప్రాణిలో ఈశ్వరుడు ఉన్నాడని మనం చెప్తాము. మన సాటి మనిషిలో కూడా ఈశ్వరుడు ఉంటాడు అంటూ సాయిబాబాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. సాయిబాబా మందిరం కట్టాలా? వద్దా? అనేది ఆయన భక్తుల ఇష్టమన్నారు.

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో హిందూ సమాజంపై జీహాదీ మూకలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. స్వచ్ఛ భారత్‌ను సమాజం తమ బాధ్యతగా భావించాలి. యూపీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కల్పించుకోదు. పోరాడాల్సింది, గెలవాల్సింది భాజపానే.

రామమందిర నిర్మాణ ఉద్యమం 1984 నుంచి కొనసాగుతోంది. అక్కడ మందిర నిర్మాణం జరగాలని హిందూ సమాజం ఆకాంక్ష. న్యాయపరమైన సమస్యలతో ఆలస్యమవుతోంది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. లక్నో కోర్టు నిర్ణయంతో అక్కడ రామమందిరం మినహా ఏ నిర్మాణం జరిగే అవకాశం లేదు.

మోది సర్కారు పనితీరుపై సమయా సమయాలలో మా అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్య పాలనలో ప్రభుత్వాల పనితీరును వివిధ సంస్థలు విశ్లేషణ చేస్తూ ఉంటాయి. సలహాలు కూడా ఇస్తూ ఉంటాయి. కాని వాటితో పెద్దగా లాభం ఉండదు. ప్రభుత్వమే తనంతట తానుగా సమీక్ష చేసుకుని పాలనను సక్రమంగా నడిపించేందుకు ప్రయత్నించాలి.

పాకిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదంపై స్పందించటం మన పని కాదు. అక్కడి ప్రజలు, ప్రభుత్వం స్పందించాలి. తీవ్రవాద శిక్షణా కేంద్రాలు పాక్‌లో ఉన్నాయని ప్రపంచం భావిస్తే ఆ మేరకు పాక్‌ ప్రభుత్వం ఆ శిబిరాలపై చర్యలు తీసుకునే విధంగా పాకిస్తాన్‌ మీద ఒత్తిడి తీసుకుని రావాలి.

గోరక్షకులకు ప్రభుత్వం భద్రత కల్పించాలి. దేశవాళి గో సంతతిని పెంచాలి. జన్యుమార్పిడి విత్తనాలతో ఉత్పత్తి పెంచడం వల్ల భూసారం దెబ్బతినకుండా చూడాలి. చైనా, విదేశీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం మనదగ్గర ఉంటే మన వస్తువులనే వాడాలి. మొత్తం మీద అఖిల భారత కార్యకారిణి సమావేశాలు ప్రధానంగా సామాజిక విషయాలపైన దృష్టి సారించినట్లుగా కనబడుతోంది.

మనం యుద్ధంలోనే ఉన్నం అప్రమత్తత అవసరం


పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా జియ హుల్‌ హాక్‌ ఉన్న కాలం నుండి కాశ్మీర్‌ను కబళించడానికి పాకిస్తాన్‌ భారత్‌పై ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభించింది. నిరంతరం గాయపరచడం అనేది ఆ యుద్ధం లక్ష్యం. అది అప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌ అనుసరిస్తున్న ఆ యుద్ధ వ్యూహాన్ని ప్రారంభంలోనే భారత్‌ కట్టడి చేయవలిసి ఉండేది కానీ అలా చేయలేదు. దాని కారణంగా పాకిస్తాన్‌ పెట్రేగిపో తూ వచ్చింది. దాడుల నుంచి కాపాడుకోవటం లేక కాచుకోవటం అనే విధానం భారత్‌కు తీరని నష్టం కలిగించింది. దాని పరాకాష్టే మొన్నీ మధ్యన జరిగిన ఉరి సంఘటన.

 నిద్రలో ఉన్న 18మంది సైనికులను అతిదారుణంగా పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చంపేశారు. దానిపై దేశమంతా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దానికి ప్రతీకార చర్య జరగాలని ప్రజలనుంచి చాలా తీవ్రమైన స్పందన వచ్చింది. ఇటువంటి స్పందన భారతదేశంలో ఒక అరుదైన సంఘటన. ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ ప్రారంభించింది. పాకిస్తాన్‌లో జరగబోయే సార్క్‌ సమావేశాలలో భారత్‌ పాల్గొన దని తెగేసి చెప్పింది. దీనికి మద్ధతుగా ఆఫ్ఘనిస్తాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ కూడా మేము పాల్గొనమని తెగేసి చెప్పారు. దాని కారణంగా సార్క్‌ సమావేశాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సింధు జలాల విషయంలో, పాకిస్తాన్‌కు భారత్‌ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు కూడా రద్దు చేయడానికి చర్చలు ప్రారంభించింది. ప్రత్యక్ష యుద్ధం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. కానీ ఒక తీవ్రమైన హెచ్చరిక చేయాలనే విషయంలో బేధాభిప్రాయాలు లేవు. పరిమిత దాడులతో పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని నిర్ణయిం చుకుంది. ఆ నిర్ణయ పర్యవసనమే సర్జికల్‌ స్ట్రైక్స్‌. బుధవారం అర్థరాత్రి నియంత్రణ రేఖ దాటివెళ్ళి పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా భారత్‌ మెరుపుదాడి చేసింది. ఆ దాడిలో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. నలభై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 200 మంది ఉగ్రవాదులు చెల్లాచెదు రై పారిపోయారు. ఈ దాడిలో కొద్దిమంది పాకిస్తాన్‌ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం. ఈ నిర్ణీత లక్ష్యా న్ని నాలుగు, నాలుగున్నర గంటల్లోనే పూర్తిచేయటం విశేషం.

ప్రపంచంలో చైనా నుంచీ మొదలుకొని అనేక దేశాలు భారత్‌ చర్యను సమర్థించాయి. పాకిస్తాన్‌కు ఆర్థికంగా, ఆయుధ పరంగా అన్ని రకాల అండదండలు అందించే అమెరికా కూడా భారత్‌ చర్యను సమర్థిస్తూ దాడికి పాకిస్తానే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. ఈ పరిమిత దాడులతో సమస్య సమసిపోదు పైగా ఇంకా ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రత్యక్ష యుద్ధం చేయకపో యినా మనం యుద్ధంలోనే ఉన్నాం అన్న విషయాన్ని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు గుర్తించి వ్యవహరిస్తే పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవచ్చు.

జ్ఞానజ్యోతుల మనోరవళి దీపావళి

చెడుపై మంచి విజయమే దీపావళి...ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు. ఓ ధీర వనిత విజయ గాథ. వరగర్వంతో పరాయి స్త్రీలను చెరబట్టి... చివరికి మరో స్త్రీ చేతిలోనే మత్యువుకు చేరువైన రాక్షసుడి గాథ. విష్ణుమూర్తి, భూదేవిలకు జన్మించి అదే భూదేవి అంశగా పుట్టిన సత్యభామ చేతిలో అంతమొందిన నరకాసురుడి కథ. పదునాలుగు వేల మంది అబలలకు విముక్తి కల్పించి ఆడది అబల కాదు సబల అని నిరూపించిన సత్యభామదేవి మహిళలకు ఆదర్శం. అందుకు ఆమె వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోడమనేది ఎంతో అవసరం.

నరకాసుర సంహారం జరిగిందిలా.. 

కనిపించిన ప్రతి మహిళను చెరబట్టడం అతనినైజం. విష్ణుమూర్తి, భూదేవిల కుమారుడైన నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణం పొందేలా వరం పొందుతాడు. ఆ వర గర్వంతో విర్రవీగు తాడు, తనకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో లోకాలన్నింటినీ ఆక్రమించుకుంటాడు. ఆ సందర్భం లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకోసం శ్రీకష్ణ పరమాత్మ డు సత్యభామా సమేతుడై నరకాసురుని మీదకు యుద్ధానికి దండెత్తుతాడు. మొదట మురరాక్షసుని, తదుపరి అతని కుమారులను సత్యభామా కష్ణులు అంతమొందిస్తారు. ఇది తెలిసి ఆగ్రహాన్ని పట్టలేని నరకాసురుడు స్వయంగా తన బలగాలతో రంగంలో కి దిగుతాడు. శ్రీ కృష్ణుడు నరకాసురుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. నరకాసురుని వరం గురించి తెలిసిన నల్లనయ్య అతడి బాణానికి మూర్ఛపోతాడు. అది చూసిన సత్యభామ తన సుకుమారాన్ని వదిలి రౌద్రాన్ని తనయందు ఆవహిం చుకుంటుంది. కన్నుల నిండ నిప్పుకణికలు ఉన్నాయా అనేంతలా ఆగ్రహాన్ని వెలువరిస్తుంది.. ఆ మహావిష్ణువునే తన రథసారథి గా చేసుకుని నరకాసు ర వధకు బయలుదేరుతుంది.నరకాసురునితో భూమి, ఆకాశాలు కంపిస్తున్నాయా అనేంతలా పోరాడుతుం ది. ఇలా తీవ్ర పోరాటం అనంతరం బహుళ చతుర్థశి నాడు సత్యభామా కృష్ణులు కామరూపాధిప తిని నామరూపాలు లేకుండా అంతమొందించారు.

శక్తికి మారుపేరే మగువ 

దాంపత్యంలోని అన్యోన్యత, సఖ్యత, ఆత్యీయత ఎంతటివో, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయగలిగే ప్రేమ ఎంతటిదో ఈ కథద్వారా మనం తెలుసుకో వచ్చు. ఎప్పడూ చెల్లికత్తెలతో అంతపురంలో సుకుమారంగా ఉండే సత్యభామ యుద్ధభూమిలో విరోచిత పోరాటం చేయడమనేది ఎవరికైనా ఆశ్యర్యాన్ని కలిగించే విషయమే. రాజభోగాలను అనుభవిస్తూ, సేవికల సపర్యలు అందుకుంటూ, వెన్నదొంగతో వెటకారం చేస్తూ సుఖంగా జీవించే ఆ అబల ఆయుధం పట్టిందంటే ఎంతటి కష్టం తనకు వచ్చి ఉండాలి. క్షత్రియురాలిగా రాజ్యానికి కష్టం వచ్చినప్పడు రాటుదేలిన తాను, భర్తకు బలం చేకూర్చడానికి చేదోడుగా మారింది. అలిసి తనకు బాసటగా నిలిచిన శ్రీకష్ణుని సాయంతో వీరఖడ్గ రూపిణియై తన బిడ్డయైన నరకాసురుని వధించింది. ఒక తల్లి తన బిడ్డను వధిస్తుందా? కానీ ఆమె ధరణీ దేవి. ఒక బిడ్డవల్ల తన ఇతర బిడ్డలకు కష్టం వస్తుందంటే ఏతల్లి సహించ గలదు. అందుకే లోకహితం కోసం ఆ ధరణిధరుని మాట జవదా టక, సర్వలోకాలను రక్షించేందుకు తన బాధ్యతగా నరకాసురుని సత్యభామ సంహరిం చింది. దీని ద్వరా ఒక స్త్రీ తన బాధ్యతలను ఎప్పటికి మరువదని, ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక ఆలిగా తన బాధ్యతల ను సర్వత్రా ఆచరిస్తుందనే విషయం తెలుస్తుంది. అత్యాచారాలను, దురాచారాలను, అణచివేతలను ఎదుర్కొనడంలో సత్యభామ చూపిన తెగువ ఎంతో గర్వకారణం.

ధీర వనిత స్పూర్తితో

సత్యభామను నేటి యువతులు, మహిళలు సూార్తిేగా తీసుకోవాలి. తమలోని పోరాట పటిమను వెలికి తీయాలి. వీధికి ఒక నరకాసురుడు తయారువు తున్న ఈ తరుణంలో ఆయుధం చేతబట్టగలిగే మానసిక స్థితికి చేరుకోవాలి. సత్యభామలాగా సౌమ్యాన్ని ప్రదర్శిస్తునే అవసరానికి అనుగుణంగా రౌద్రాన్ని వ్యక్త పరచాలి.. ఆత్మరక్షణ విద్యలను అవపోసన పట్టాలి. క్షత్రియ ధర్మాన్ని కూడా అవలంబించాలి. క్షత్రియ ధర్మమనేది కేవలం స్వరక్షకే కాకుండా లోకహితం కోసం కూడా చేపట్టే తెగువ నేటి స్త్రీలలో పెంపొందాలి. ఒక తల్లిగా తన బిడ్డ చెడ్డవాడైతే, సమాజానికి చేటు చేసే వాడైతే, స్త్రీలకు కంటకంగా మారితే వాడిని అవసరమైతే మందలించాలి.. అంతకు వినకుంటే అంతు చూసేంత కాఠిన్యం మదిలో పెంపొందాలి. సత్యభామ నరకాసుర వధలో అదే కాఠిన్యాన్ని ప్రదర్శించిం ది. ఒక భర్తకు భార్య, భార్యకు భర్త తోడు ఎంత అవసరమో అనే విషయం, తన భర్త పట్ల సత్యభామ ప్రదర్శించిన ప్రేమ, అనురాగం, వాత్య ల్యం, ఎనలేని నమ్మకాలు ఇవన్నీ దంపతుల మధ్యు ఉండవలసిన దాంపత్య బంధాన్ని నరకాసుర వధ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే తాను స్త్రీ అయినప్పటీకి సత్యభామ తనను తాను ఎప్పడు సబలగానే భావించింది. అదే విధంగా నేడు సమాజంలో పెరు గుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, అణచివే తలకు వ్యతిరేకంగా ప్రతి మహిళ ఒక సత్యభామ రూపంగా మారాలి. కదన రంగంలోకి దిగి సమాజ హితం కోసం పోరాడాలి. కామరూపులను, దేశ ద్రోహులను వెంటాడి, వేటాడే ధీశాలురుగా వారు మారాలి. సౌమ్యతే కాదు సందర్భాన్ని బట్టి సాయుధులుగా మారి ధర్మ, దేశ రక్షణలకు ముందుకు రావాలి. ఇది జరిగనప్పుడే సమాజంలో స్త్రీలకు సమానత్వం వస్తుంది. నారిని దేవతగా పూజించే ఈ పుణ్యభూ మిలో స్త్రీ తిరిగి తన శక్తి స్వరూపాన్ని పొందగలు గుతుంది. ముష్కర మూకల అంతు చూడగలుగుతుంది. మానవత్వాన్ని మరచి మహిళలను ఆట వస్తువులుగా మార్చిన దుష్ట శక్తులకు సింహస్వప్నం గా మారుతుంది. దేశ, ధర్మ, సమాజ హితానికి మహిళ ఒక మహోన్నత ఆయుధం కావడానికి సత్యభామను స్ఫూర్తిగా తీసుకుంటుందని, భారతావనిని విశ్వగురువుగా నిలపడానికి ఒక మహాశక్తిగా స్త్రీ శక్తి మారుతుందని ఆశిద్దాం. ఈ దీపావళిని దివ్వెల పండుగగానే కాదు.. దేశరక్షణకు దండుగా నిలిచే మహిళావళిగా జరుపుకుందాం.

సంభాగ్‌ ఉద్యోగి సాంఘిక్‌ లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌

జనవరి 8, 2017, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ నారాయణగూడ, సంభాగ్‌ (భాగ్యనగర్‌, సికింద్రాబాద్‌) ఉద్యోగి సాంఘిక్‌లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌ సంక్షిప్తంగా..
 
సంఘది 91 ఏళ్ల చరిత్ర. సంఘ ప్రారంభపు రోజుల్లో ఎవరూ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యదశ్యాన్ని ఊహించి కూడా ఉండరు. కేవలం డాక్టర్జీపై నమ్మకం, విశ్వాసంతో పని చేసుకుంటూ పోయారు. ప్రారంభంలో సంఘం అంటే సమాజంలో ఉపేక్ష భావం ఉండేది. ఎవరూ మనను పట్టించుకునేవారు కాదు. కానీ మన కార్యం పెరిగినకొద్దీ అందరితోపాటు వ్యతిరేకుల దష్టి కూడా మనపై పడింది. నిష్ట, త్యాగాలతో కష్టమైన ఆ కాలఖండాన్ని దాటాం.మానవ బాంబులే లక్ష్యంగా హైదరాబాద్‌లో కూడా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ 'స్ట్రీట్‌ దావా'

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమేతర యువతే లక్షంగా చేసుకొని వారిని ఇస్లామిక్‌ తీవ్రవాద సమర్ధకులుగా, సమయాన్ని బట్టి వారిని మనవ బాంబు లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ''స్ట్రీట్‌ దావా'' అనే ఇస్లామిక్‌ తీవ్ర వాద సంస్థ భారత దేశంలోని కొన్ని నగరాలలో అనధికారికంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుంది. ప్రస్తుతుం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నయి లాంటి మహా నగరాలలో ప్రధానంగా ఐ టి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై ద ష్టి కేంద్రీకరించి పని చేస్తుంది.

'స్ట్రీట్‌ దావా' ప్రధాన ఉద్దేశం ముస్లిమేతర యువతలో ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల సానుకూలత తో ఉండడం, మతోన్మాదులుగా మారడానికి తగిన సాహిత్యాన్ని అందిస్తూ, వారి వ్యక్తగత ఫోన్‌ నెంబర్లను, ఈమెయిలు ద్వార విదేశీ ఇస్లామిక్‌ శక్తులతో సత్సంబదాలను ఏర్పాటు చేయడం. కొంత కాలం వారకు నిరంతరం వారితో సంభాషిస్తూ ఒక విధమైన మానసిక దాడి చేసి ఇస్లాం పట్ల ఆకర్షితులై సమయం వచ్చినపుడు మానవ బాంబు లాగ మారడానికి సైతం సిద్ధం చేయడం. ఒకసారి ఇస్లామిక్‌ తీవ్రవాదానికి సానుకూలత ప్రదర్శించిన తరువాత వారిని ముస్లిమేతర పేర్లతోనే నిఘా సంస్థలకు ఎలాంటి అనుమానం రాకుండా విదేశాలకు తరలించడం.

ఇదే విధంగా కాశ్మీరీ మూలాలు ఉన్న బ్రిటన్‌ పౌరుడు అయిన సిద్దార్థ్‌ దార్‌ అనే హిందువు ను , ఇదే సంస్థ ద్వార ఇస్లాం పథం ఆకర్హింప చేసి ప్రస్తుతం ఒక కరుడు గట్టిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిగా మారి పోయాడు. అదే విధంగా కొంత మంది హిందువులు సైతం ఈ ఉగ్రవాద సమస్త పట్ల ఆకర్షితులైనారు. గణాంకాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన మనవ బాంబు దాడులలో ప్రపంచ వ్యాప్తంగా 25 మంది వరకు ఈ స్ట్రీట్‌ దావా ద్వారా వివిధ దేశాలలో ఆకర్షితులు అయినవారే. వీరు అందరు స్వతహాగా ముస్లిమ్స్‌ కాదు, అందరు ఇస్లాం మతంలోకి మార్చబడినవారే.

ఈ 'స్ట్రీట్‌ దావా' అనే సంస్థ ముస్లిమేతరులే కాకుండా మస్జిద్‌ లలో పని చేస్తున్న మౌలానా లను కూడా ఆకర్షిస్తూ వారిని ఇస్లామిక్‌ తీవ్రవాదానికి సంభదించిన సాహిత్యాన్ని, అందిస్తూ తీవ్రవాదానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇంటెలిజన్స్‌ సంస్థలో పనిచేస్తున్న అధికారి ప్రకారం హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాలలో పనిచేస్తున్న 'స్ట్రీట్‌ దావా' కార్యకలపాలపై దృష్టి పెట్టామని వారికి ఇతర స్థానిక తీవ్రవాద సంస్థలకు జాకీర్‌ నాయక్‌లాంటి మత ప్రచారకులతో ఉన్న సంబందాలపై కూడా నిఘా పెట్టమని తెలిపారు. జమాయిత్‌-ఇ-ఉలేమీయా హింద్‌ నాయ కుడు మౌలానా అర్షద్‌ మదానీ , యాదార్‌-ఉల్‌-ఉలూమ్‌, అల్‌-జాకిరియా సంస్థల నాయకుడు మౌలానా ముఫ్తీ అర్షద్‌ షారుఖీలు ఇద్దరూ అమాయకులైన ముస్లిమేతరులు స్ట్రీట్‌ ద్వారా చేరి తీవ్రవాదులు అవుతున్న విషయాన్ని ధ్రువీకరిం చారు. ఇస్లాం హింసను ప్రోత్సహించదు అని దీనికి కారణం ముస్లింలో ఉన్న నిరక్షరాస్యత, మతంపై సరైన అవగాహన లేక పోవడం అని తెలిపారు.

జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు

ఇటీవల జలిలకట్టుపై పెద్ద జగడమే జరిగింది. పశుహింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు గగ్గోలు పెడితే, గ్రామీణ సంస్కృతికి ఈ క్రీడ అద్దంపడుతుందని చాలామంది సమర్థించారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించి జల్లికట్టుకు అనుమతినివ్వాలని వేలాదిమంది ఉద్యమించారు. చివరికి కేంద్రం జోక్యంతో ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు కథ సుఖాంతమైంది. కొన్ని వారాలపాటు దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ మొత్తం ప్రహసనంలో కొన్ని ఆందోళన కలిగించే, ప్రమాదకర ధోరణులు కూడా బయటపడ్డాయి.


వినాయక నిమజ్జనం, దీపావళి టపాకా యలు, రంగురంగుల హోళీ, కృష్ణాష్టమి ఉట్లు కొట్టే పండుగ, జల్లికట్టు...ఇలా పండుగ, ఉత్సవం ఏదైనా 'పర్యావరణ పరిరక్షకులు', 'మేధావులు', 'జంతు ప్రేమికులు' మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవన్నీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పరచినవేనని, వాటి వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదని వాదిస్తారు. వాటిని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ ప్రపంచం సుఖంగా, శాంతిగా బతకలేదని నొక్కి చెపుతారు. అందుకోసం ఊరేగింపులు, ఉద్యమాలు నిర్వహిస్తారు.

జల్లికట్టు ఏమిటి?
జల్లికట్టు 5000 ఏళ్ళనాటి నుండి వస్తున్న సంప్రదాయ క్రీడ. సింధూ నాగరకత సమయం నుంచి ఈ క్రీడ మన దేశంలో ఉంది. ఈ క్రీడా చిత్రాన్ని ముద్రించిన నాణాలు కూడా ఈ నాగరకత అవశేషాల్లో లభించాయి. పొగరుబోతు ఆంబోతు ల్ని వాటి మూపురాలు పట్టుకుని అదుపు చేయడం ఈ క్రీడలో ప్రధాన అంశం. అందుకనే దీనిని 'ఎరు తజువుతల్‌' (ఎద్దును అదుపు చేయడం) అంటారు. అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిన నాగరక తగా పేరుపడిన సింధూ నాగరకతలో ఉన్న ఈ క్రీడను ఇప్పుడు కొందరు 'అనాగరికం' అంటున్నారు. అదే విచిత్రం.

తమిళనాట నాయక రాజులు పరిపాలిస్తున్న ప్పుడు ఎద్దుల కొమ్ములకు బట్టలో చుట్టిన బంగారు నాణాలు కట్టేవారు. ఎద్దు మూపురాన్ని పట్టుకుని అదుపు చేసేవాళ్ళు ఆ బట్టను రెండవ కొమ్ముకు ముడివేయాలి. అలా చేస్తే అందులో నాణాలు అత నికి బహుమతిగా ఇచ్చేవారు. జల్లి లేదా సల్లి అంటే నాణాలు. కట్టు అంటే కట్టడం. ఇప్పుడు నాణాలు లేకుండా కేవలం ఒక బట్ట మాత్రమే కడుతున్నారు. 'వాడివాసల్‌' అనే ద్వారం నుండి బయటకు వచ్చే ఎద్దు లేదా ఎద్దులు నిర్ణీత మార్గం గుండా పరుగెడ తాయి. అలా పరుగెట్టే వాటిని పట్టుకుని అదుపు చేయాలి. ఇందులో అనేక వందలమంది పాల్గొంటా రు. ప్రయత్నిస్తారు. కానీ ఒకరిద్దరు మాత్రమే విజ యం సాధిస్తారు. వారికే బహుమతి లభిస్తుంది.

ఎందుకీ క్రీడ?
జల్లికట్టు కేవలం వినోదం కోసం ఆడే ఆట కాదు. దీనితో గ్రామీణ జీవన వ్యవస్థలోని సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. జల్లికట్టు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మనుష్యుల మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని, వాటి చుట్టూ అల్లుకున్న ఆచారాలు, పద్ధతుల్ని మన కు చూపుతుంది. దేవాలయాల్లో ఒక ఎద్దును ప్రత్యే కంగా పెంచుతారు. దానిని కోయిల్‌ కాలై (దేవాల య ఎద్దు) అంటారు. దీనిని చాలా పవిత్రంగా చూసుకుంటారు. జల్లికట్టు ఆటలో మొదట ఈ ఎద్దు పరిగెడుతుంది. అప్పుడు దానిని ఎవరూ తాకరు. ఆ తరువాతే అసలు ఆట మొదలవుతుంది. ఈ ఆటలో కులం, వర్గం తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. కాలగతిలో క్రమపరిణా మంలో భాగంగా ఏర్పడే స్థానిక పశు జాతుల వల్ల కలిగే ప్రయోజనాలు విదేశీ, సంకర జాతుల వల్ల ఉండవు. భారత రాజ్యాంగంలోని 48వ అధి కరణ పశు సంతతి అంతరించిపోకుండా, వాటిని వధశాలలకు తరలించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. అలాగే ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సులో ఆమోదించిన తీర్మానం కూడా దీనికి సంబంధించి నదే. అందులో ని 1,2,3 సూత్రాలు పశుసంపద ప్రకృతిలో ముఖ్య భాగమని, వాటిని జాతీయ సంపదగా గుర్తించి పరిరక్షించుకోవాలని పేర్కొంటున్నాయి. ఆ తీర్మానం పై ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ సంతకాలు చేశాయి.
జల్లికట్టును ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
గ్రామీణ జీవన వ్యవస్థతో ఏమాత్రం సంబం ధం లేనివారు, దాని గురించి ఎలాంటి అవగాహన లేని నగరవాసులు కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అలాగే సంచలన వార్తల కోసం తహతహలాడే మీడియా కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది. ఒక సంవత్సరంలో మొత్తం 10వేలమంది జల్లికట్టు క్రీడలో పాల్గొంటారనుకుంటే అందులో 50 నుంచి 100మందికి మాత్రమే కొద్దిగా గాయపడతారు. మరణాలనేవి అసలు ఉండవు. కానీ జల్లికట్టువల్ల హింస జరిగిపోతోందంటూ ప్రచారం మాత్రం సాగుతోంది.ఈ దేశంలో సంస్కృతీ సభ్యతల్ని పూర్తిగా రూపుమాపి తద్వారా ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్న మిషనరీలు కూడా ఇలాంటి ఉత్సవాలు, క్రీడల్ని వ్యతిరేకించారు. మత వ్యాప్తికి జోషువా ప్రాజెక్ట్‌లాంటి ప్రణాళికల్ని అమలు చేస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇక్కడ సంస్కృతీ సంప్రదాయాల్ని ధ్వంసం చేసేందుకు మరో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. అదే ప్రాజెక్ట్‌ థెసా లొనికా. దేశీయ ఉత్సవాలు, పండుగలపై విషప్రచా రం చేసి, వాటి పట్ల ప్రజల్లో అసహ్యాన్ని, చిన్నచూ పును కలిగించి తద్వారా వారిని సంస్కృతి, సంప్రదా యాలకు దూరం చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. అందులో భాగమే హిందూ పండుగలు, ఉత్సవాలపై విషప్రచారం. వీళ్ళేకాక జల్లికట్టు జగడాన్ని జిహాదీ వాదులు కూడా ఉపయోగించు కోవాలనుకున్నారు. జల్లికట్టు మద్దతుగా ప్రజల్లో సహజంగా వచ్చిన స్పందనను తమ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. ఈ ప్రదర్శనల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ వ్యతిరేక ఉద్యమం గా మలచాలంటూ పేర్కొన్న కొన్ని పత్రాలు మెరీనా బీచ్‌లో లభించడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యప రచింది.ఒసామాబినా లాడెన్‌ చిత్రాలు ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. భారత, మోదీ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. 

- కేశవ