రథ సప్తమి సందేశం

విత్తు మొలకెత్తడానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడుగటానికి, మొగ్గ పువ్వులా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి కాలమే కారణం. కాలానికి పురో గమనమే కానీ తిరోగమనమే లేదు. అట్టి కాలం యొక్క వేగాన్ని తెలుసుకోవాలంటే సూర్య గమన మే ప్రమాణం. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.

కాలం కంటికి కనపడదు కానీ కాలానికి ప్రమాణమైన సూర్యడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనను ప్రత్యక్షదైవంగా కొలుస్తాము. సూర్యుడి వలనే ఈ సమస్త ప్రకృతి చైతన్య వంతం అవుతుంది.
సప్తాశ్వరథ మారూఢం
ప్రచండం కశ్య పాత్మజం
శ్వేత పద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం

ఏడు గుర్రలు పూనిన రథాన్ని అధిరోహిం చి, నిరంతర సంచారం చేసే కశ్యపుని కుమారు డైన సూర్యునకు నమస్కారం అని స్తుతిస్తాము. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. సూర్యు డుని ఆధారం చేసుకోని మిగిలిన గ్రహలు సంచరిస్తాయి. సూర్యుడు లేకపోతే తక్కిన గ్రహలకు మనుగడే లేదు. అందుకే సూర్య జయంతి అయిన రధసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు సూర్యుడిని ఆరాధించటం ఆచారమైంది.

మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా ఈ బ్రహ్మండంలో ఇంకా 12మంది సూర్యులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన ప్రాచీన రుషులు ఈ ద్వాదశాదిత్యులను గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరులు.ఉత్తరాయణం మకరసంక్రమ ణంతో ప్రారంభమైనా రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరి స్తుంది. దక్షిణాయణం నుంచి సూర్యుడు విముక్తిడై రథసప్తమి నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు లు రేగుపండ్లు తలపై పెట్టుకోని స్నానం చేస్తారు. జిల్లేడు, రేగు చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వచేసుకోనే వృక్ష జాతులు. వీటి ప్రభావం శరీరంపై సంవత్సరమంతా ఉంటుందని ఆరోగ్యరీత్యా మన పూర్వికులు నిర్ణయించారు.

- పి.వి. సత్తిరాజు

హిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదుహిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదు. ఇది ఒక సాం స్కృతిక పదం. ఎటువంటి ఆరాధన పద్ధతులు పాటించని వారుకుడా తమ కు తాముగా 'హిందూ'గా భావించ వచ్చును. హిందూత్వమనేది ఒక జీవనశైలి. జీవన మూల్యం హిందూత్వం. హిందువు ఎప్పుడు సంకుచితం కాజాలడు ఇది కర్మకాండలపై ఆధారపడింది కాదు. నైతిక విలువలు సర్వమానవ సౌభ్రాతృత్వ స్వాభిమాన సమరసతా జీవన విధానం హిందూత్వం ఇటువంటి హిందూ జీవనశైలి రేపు అమెరికా-పాకిస్తాన్‌లకు కూడా అవసరమైనది.

- శ్రీ భయ్యాజీ జోషి, మా|| సర్‌ కార్యవాహ రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌

'నేను నాదేశం, నాదేశం కోసం నేను' అనే భావన నిర్మాణం చేయాలిదేశంలో దేశభక్తి భావనను జాగృతం చేసే బదులు, వ్యక్తి హితం, అంటే నేను మరియు నా కుటుంబాన్ని, నా వరకు
మాత్రమే ఆలోచనల పరిమితం చేసి సమాజ చింతన చేయకుండా ఉన్న మనం వెలుగుతున్న సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసేంతవరకు కొంత మంది పనిగట్టుకొని యోజనా బద్ధంగా దేశవ్యతిరేక కార్యాకలపాలకు ఊతమిస్తు లాభపడుతు వచ్చారు. ఇక నరేంద్రమోదిగారి ప్రభు త్వం వచ్చిన తరువాత ''నేను నాదేశం, నాదేశం కోసం'' నేను అనే భావన, ఉత్సహభరిత వాతవరణాన్ని సృష్టించి సత్ఫలితాలివ్వబోతుంది.
- శ్రీ థావర్‌ చంద్‌ గెహ్లట్‌, కేంద్రమంత్రి

ఎన్నెన్నో సంబురాల సంక్రాంతి

ఎన్నెన్నో సంబురాలను తెచ్చే సంక్రాంతి పండుగ మళ్లీ వస్తోంది. మంచిని తెచ్చేది, కలిగించేది మళ్లీ మళ్లీ వస్తుండాలి. కోట్లాది భారతీయులు సూర్య గమానాన్ని అనుసరించి జరుపుకునే పండుగ సంక్రాంతి. సూర్యుడు ఈ సమయంలో మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశంతోనే కాల చక్రంలో ఒక క్రాంతి అంటే మార్పు వస్తుంది. దక్షిణాయనం వెళ్లి ఉత్తరాయణం వస్తుంది. రాత్రి సమయం క్రమంగాతగ్గి పగటి సమయం పెరుగుతోంది. అంటే ప్రాణకోటి జీవితం చీకటి నుంచి ఎక్కువ సమయం వెలుగులో ఉంటుంది. మనిషి ఎక్కువ సమయం జాగురుకుడై ఉండటానికి, క్రియాశీలుడు కావాడానికి మంచి పనులను చేసుకోవాటానికి అవకాశముండే కాలం. కాబట్టి ఇది పుర్వకాలం. 

వాస్తవానికి ఈ సంక్రాంతి జన జీవనంతోను, ప్రకృతితోను, వ్యవసాయ కార్యకలపాలతో ముడిపడి ఉంది. రైతుల కృషి ఫలించి ధాన్యం ఇళ్లకు చేరే సంతోష సమయం. అందుకే సంబురాలు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, అని మూడు రోజుల పండుగ. భోగి నాడు భోగి మంటలు వేయడం, చిన్న పిల్లలకు పేరంటం చేసి బోగిపండ్లు పోయడం వంటివి అనావాయితీగా వస్తున్న సంప్రదాయం. పూర్వం భోగినాడు ఇంద్రుడిని పూజించే ఆచారం ఉండేది. కాని ఇంద్రుడు గర్వితుడై అధికారమదంతో అహంకారిగా ప్రవర్తిస్తుండేవాడు. సమాజం దానిని భరిస్తుండేది. ఈ సామాజిక స్థితిలో మార్పురావాలని శ్రీకృష్ణుడు ప్రయాత్నించి ఆ భోగినాడే గోవర్ధనగిరిని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. గిరిపూజ ప్రకృతి ఆరాధన అవుతుంది. సమాజం వన దేవతను, కుల పర్వతాలను పూజించి సత్పలితాలను పొందే మార్పు క్రమంగా సమాజంలో వచ్చింది. కుటుంబ సభ్యులందరు ఇంటికి వస్తున్న ధాన్యాన్ని పదిలపరుచుకోవాడానికి పాతధాన్యపు గాదెలను తీసివేసి పనికిరాని వస్తువులను మంటల్లో వేసి స్వచ్ఛగృహలుగా తీర్చిదిద్ధి ధాన్య లక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఆ మంటలే భోగి మంటలు. గుండ్రని రేగిపండ్లు విశ్వానికి సంకేతం. విష్ణువు బదీర ఫల ప్రియుడు. తమ సంతానాన్ని శ్రీకృష్ణుడిగా బావించుకుంటూ పేరంటాడ్ర చేత పిల్లల తలపై పూలు రేగుపండ్లు కలిపి పోయించి ఆశీస్సు ఇప్పించడం గొప్ప శుభ సంకేతం. శుభ ఆకాంక్ష గుడా. ధనుర్మాసంలో గోదాదేవి చేసిన పూజలను మెచ్చి శ్రీరంగనాథుడు ఆమెను తనలో లీనం చేసుకోని భోగాభాగ్యాలను ప్రసాదించిన శుభదినం ఈ భోగినాడే అని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తుంటారు. 

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజు సంక్రాంతి, మకరరాశి విష్ణుసంబంధమైన రాశి. ''ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ'' అంటే సౌర మండలం మధ్యనున్న విష్ణువు మకర కుండలములను ధరించి ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మకర రాశి ఎంత పుణ్యప్రదమైనదో తెలుస్తొంది. ఆ రోజు ధాన్యం వస్త్రాలు, పండ్లు, కాయగురాలు వగైరా శక్తి మేరకు ధానధర్మాలు చేయాలని ధర్మశాస్త్రం చెప్తోంది. అందుకే హరిదాసులు, గంగిరెద్దులవారు, బుడగజంగాలవారు, వీధి భాగోతులాడేవారు మొదలగు జానపద కళాకారుల వాళ్ల కళలను కన్నుల పండువగా ప్రదర్శిస్తుండేవారు. అందరూ ఇళ్లల్లో నుంచి చాటల కోలది ధాన్నాన్ని తెచ్చి వాళ్లకు పంచిపెట్టే వారు. ఊరువాడ ఏకమై కళాకారులను సన్మానించేవారు. అవి వాళ్లకు సంవత్సరం పాటు జీవనోపాధికి సరిపోయేవి. ఆ సమయంలో ఇచ్చే వాళ్లు గాని పుచ్చుకునే వాళ్లుగాని ఆ మునుషుల కుల గోత్రాలని చూడలేదు, ఆలోచించలేదు. మానవత దృకత్పంతో పరస్పర సహకారం, సహజీవనం, మనమంత ఒకే కుటుంబం అనే మనో భావనే ఉండేది. అది సమసమాజ జీవనము. సమరసత జీవనం అంటే హిందూ జీవన పద్ధతిలో ఈ సంస్కరాలు, సమాజ వ్యవస్థ సహజ సిద్ధంగా ఉండటమే హిందుత్వము యొక్క విశిష్టత. 

కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం హిందువుల జన్మజాత లక్షణం. అందుకే పాములకు పాలు, చీమలకు, కోళ్లకు పిండి నూకలు వంటివాటిని చల్లుతూ జీవరాసులను పోషించి జీవవైవిధ్యాన్ని సంరక్షిస్తుంటాము. వ్యవసాయంలోను నిత్యజీవనంలోను మనకు సహకరించే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కనుమను పశువులు పండుగగా జరుపుకుంటాము. నగర, గ్రామ సంకీర్తనలు ఎంతో గర్వించదగ్గ గొప్ప జీవనశైలి మనది. ఒక వైపు ఆధ్యాత్మికంగా ధనుర్మాస పూజలు, నైవేద్యాలు, మరోవైపు ముత్యాలముగ్గులు, గొబ్బెమ్మలు జానపద కళాకారుల ఆటపాటలు, ధాన్యపు సంచులను చేరవేస్తున్న ఎడ్లబండ్లు, బాలలు, యువకులు హుషారుగా ఎగురవేస్తున్న గాలిపటాల సందడి తమకున్న వాటిలో కొంత భాగాన్ని పదిమందికీ పంచి పెడుతున్న దాతృత్వం వెరసి సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయ సంరక్షణ మానవ జీవన విలువలు సంరక్షణే దీని వెనుకున్న తాత్వికత. అదే నిజమైన సంక్రాంతి. 

- డా|| శ్రీ అన్నదానం సుబ్రమణ్యం

మత రాజకీయంపై 'వేటు'

చట్టంలో ఉన్న నిబంధనను సర్వోన్నత న్యాయ స్థానం ధ్రువపరచింది. ప్రజాప్రాతినిధ్యపు చట్టం- రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌-లోని నూట ఇరవై మూడవ నిబంధన ఎన్నికల అవినీతి పద్ధ తుల- కరప్ట్‌ ప్రాక్టీసెస్‌-ను గురించి వివరిస్తోంది. ఈ నిబంధనలోని మొదటి ఉప నిబంధన ప్రకారం వోటర్లకు లంచం ఇవ్వడం అవినీతి. అక్రమంగా వోటర్లను ప్రభావితం చేయడం రెండవ ఉప నిబంధన ప్రకారం మరో అవినీతి పద్ధతి. 'మతం, వర్ణం కులం, సముదాయం, భాషల ప్రాతిపదికగా తమకు వోటు వేయమని కాని తమ ప్రత్యర్థులకు వోటు వేయరాదని కాని వోటర్లను అభ్యర్థి కాని అతని అనుమతితో అతని ప్రతినిధి- ఏజెంట్‌- కాని ఇతర సహచరులు, అనుచరులు కాని కోరడం అవినీతి పద్ధతి' అని ఈ నిబంధనలోని మూడవ ఉప నిబంధన నిర్దేశిస్తోంది. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం సప్తసభ్య ధర్మాసనం వారు సోమవారం చేసిన నిర్ధారణ చట్టంలోని నిబంధనలకు భాష్యం వంటిది, వివరణ వంటిది. 'మతం' అన్నది భగవంతునికీ భక్తులకు మధ్యగల వైయక్తిక అనుసంధాన మాధ్యమమని, మతాతీత సార్వజనిక సామూహిక సామాజిక రాజ్యాంగ ప్రక్రియలలోకి మతం చొరబడరాదని సర్వోన్నత న్యాయస్థానం చేసిన విశ్లేషణ- రాజ్యాంగ స్ఫూర్తికిి మా త్రమే కాక యుగయుగాల తరతరాల జాతీయ జీవన స్ఫూర్తికిి అనుకూలమైన పరిణామం.

పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలనా యంత్రాంగాల ఉద్యోగులు సర్వమత సమభావం స్వభావంగా విధులను నిర్వర్తించవలసిన వారు. అందువల్ల సర్వమత సర్వ భాషా, సర్వ సముదాయ, సర్వ ప్రాంత సర్వ వైవిధ్య సమాహారమైన జాతీయ జీవనం సమగ్రం. ఈ సమగ్ర తత్త్వం ఒక 'శకలం' ప్రభావానికి మాత్రమే గురికావడం వైపరీత్యం! జాతి-నేషన్‌- సకలం, 'సకలం'లో మత ఒక 'శకలం' మాత్రమే. అందువల్లనే మన దేశంలో జాతీయతా సాంస్క తిక వికాసానికి కేవలం మతం ప్రాతిపదిక కాలేదు. ఏక మత రాజ్యాంగ వ్యవస్థలు ఈ దేశంలో ఏర్పడలేదు. అనాదిగా ఈ దేశంలో అనేక వైదిక మతాలున్నాయి. శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, స్కాందం వంటివి ఈ వైదిక మతాలు. మాధ్వ మతం, ఆర్య సమాజం వంటి వైదిక మతాలు కూడా ఉన్నాయి. సిక్కుమతం ఉంది. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని జైన, బౌద్ధ మతాలున్నాయి. కానీ ఏ ఒక్క మతమూ ఈ దేశపు అద్వితీయ జాతీయతకు ప్రాతిపదిక కాలేదు. ఈ మతాలన్నీ కూడ ఒకే భరత జాతిలో లేదా ఒకే హైందవ జాతిలో సమానత్వం ప్రాతిపదికగా పరిఢవిల్లడం అనాది చరిత్ర. అందువల్లనే సర్వమత సమానత్వం ఈ జాతికి స్వభావమైంది. విదేశాల నుంచి ఆధునిక యుగంలో వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవ, పారశీక, యూదు మతాలకు ఈ జాతీయ వ్యవస్థలో శతాబ్దులుగా సమానత్వం లభించింది. రాజ్యాంగ వ్యవహారాలలోకి మతం చొరబడడం మన జాతీయ స్వభావానికి విరుద్ధం. మన రాజ్యాం గం ఈ జాతీయ స్వభావానికి ధ్రువీకరణ మాత్రమే.

రాజకీయాలలోకి, రాజ్యాంగ ప్రక్రియలోకి మతం చొరబడడం 'ఏక మత రాజ్యాంగ వ్యవస్థ'లు న్న విదేశాల జాతీయ స్వభావం. మన దేశాన్ని విదేశాల వారు నియంత్రించిన సమయంలో, విజాతీ యులు మన దేశంలో దమనకాండ సాగించిన సమయంలో ఒక మతానికి ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన మతాలను అణగదొక్కే రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినాయి. ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొగలాయిలు, పోర్చుగీసు వారు ఇంకా ఇతరేతర విదేశీయులు, విదేశీయ సంతతి వారు ఇలాంటి ఏకమత రాజ్యాంగ వ్యవస్థలను మన దేశంలో నెలకొల్పడానికి ప్రయత్నించారు. కానీ సమాంతరంగా కాకతీయులు, రాజపుత్రులు, విజయనగర రాజులు, మరాఠాలు, సిక్కులు వంటి స్వదేశీయులు పాలించిన భూ భాగాలలో సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలు పరిఢవిల్లాయి. ఇది భారత జాతీయులకు, విజా తీయులకు మధ్య పరిపాలనలో కొనసాగిన చారిత్రక అంతరం! ఇదంతా 1947కి పూర్వం నాటి చరిత్ర! విదేశీయ పాలన నుంచి విముక్తమైన భరతజాతి అనాది సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. ఈ అనాది స్వభావం అడుగంటి+పోయిన భారత భూభాగాలు 1947లో దేశం నుంచి విడిపోయాయి. పాకిస్తాన్‌గా ఏర్పడి నాయి. పాకిస్తాన్‌లో ఏకమత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం ఇందుకు కొనసాగుతున్న సాక్ష్యం! ఈ చరిత్ర పరిణామ క్రమం ప్రాతిపదికగా మన దేశంలో కొనసాగుతున్న 'సర్వమత సమభావ వ్యవస్థ'కు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పు విస్త త భాష్యం.

పరిపాలన మతాతీతమైనదన్న ఈ అనాది జాతీయ స్వభావానికి సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు ఇలా కొనసాగింపు.. 'ఎన్నికల ప్రక్రియ మతా లకు అతీతమైన స ర్వమత సమభావ- సె క్యులర్‌- కార్యక్రమం' అ న్న సర్వోన్నత న్యాయ నిర్ధారణ ఈ విస్తతి! అందువల్ల కులాల పేరుతో, మతాల పేరు తో వోటర్లను ప్రభావితం చేయాలన్న 'అపవాదానికి' సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు! కులాలు, మతాలు సామాజిక జీవనంలోని వైవిధ్యాలు, వత్తులు, ప్రవ త్తులు, విశ్వాసాలు. వైవిధ్యాల మధ్య వైరుధ్యాలు ఏర్పడడం బ్రిటన్‌ వంటి విదేశాల 'పరిపాలన' ఫలి తం. ఒక కులం వారు మరో కులం వారికి, ఒక మతం వారు మరో మతం వారికి న్యాయం చేయ రన్న అవిశ్వాసం ఈ ఎన్నికల అవినీతికి ప్రాతిపదిక! అందువల్లనే తమ మతం వారు, తమ కులం వారు ఎన్నికైతే తప్ప తమకు మేలు జరుగదన్న భ్రమను కొందరు రాజకీయ జీవులు జనంలో వ్యాపింప చేశారు. కేవలం ఎన్నికల పదవుల విషయంలో మాత్రమే కాదు, అన్ని సామాజిక రంగాలలోను ఈ అవిశ్వాసాన్ని, ఈ భ్రమను విస్తరింప చేయడానికి జరుగుతున్న కుట్రకు అంకురార్పణ విదేశీయుల పాలనలో జరిగింది. సర్వోన్నత న్యాయ నిర్ణయం ప్రాతిపదికగా ఈ భ్రమను, అవిశ్వాసాన్ని జనం నుండి తొలగించడానికి ఉద్యమ స్ఫూర్తితో నిరంతర ప్రయత్నం సాగాలి. కుల మత ప్రాంత భాషా వైరుధ్యాలకు లోనుకాని మానసిక స్వచ్ఛత విస్తరించ డం వల్ల మాత్రమే నిజమైన స్వచ్ఛాభారత్‌ మళ్లీ ఏర్పడుతుంది. ఈ 'వెలుగు' విస్తరించడం వల్ల మాత్రమే ఎన్నికల్లో అవినీతి పద్ధతులకు పాల్పడేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. మతం కంటె మాతభూమి, మాత  జాతీయత, మాత  సంస్కతి ప్రాధాన్యం సంతరించుకోగలిగినపుడు మతం పేరుతో వోట్లను అడిగేవారు ఉండరు.

అన్ని మతాలకు చెందిన రాజకీయ వేత్తలు, సాధారణ ప్రజలు సర్వమత సమభావ జాతీయ వారసత్వాన్ని, సంస్కతిని తమవిగా భావించి అలవరచుకొనడానికి వీలైన ప్రయత్నం జరగాలి. జాతీయతను మతంగాను, మతాన్ని జాతీయతగాను తారుమారు చేయడానికి బ్రిటన్‌ పాలకులు చేసిన కుట్ర ఫలితంగా గతంలో అనేక అనర్థాలు జరిగా యి. ఇస్లాం మతస్థులకు రాజ్యాంగ సభలో ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించడం ద్వారా మతం పేరు తో వోటర్లను ప్రభావితం చేసే కుట్రను బ్రిటన్‌ దురాక్రమణదారులు రూపొందించారు. దేశం 1947లో ముక్కలు కావడానికి ఈ 'మతం పేరుతో రెచ్చగొట్టిన రాజకీయం' దోహదం చేసింది. అనాది జాతీయత అయిన 'హిందుత్వం' ఒక మతమని చిత్రీకరించడం కూడ బ్రిటిష్‌ వారి కుట్ర! 'హిందు త్వం' ఈ దేశపు జాతీయ జీవన విధానమని సర్వోన్న త న్యాయస్థానం ఇదివరకే స్పష్టం చేసింది. ఏది మతం? ఏది జాతీయత? అన్న విచక్షణ పెరగాలి.