సంభాగ్‌ ఉద్యోగి సాంఘిక్‌ లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌

జనవరి 8, 2017, కేశవ్‌ మెమోరియల్‌ కాలేజీ నారాయణగూడ, సంభాగ్‌ (భాగ్యనగర్‌, సికింద్రాబాద్‌) ఉద్యోగి సాంఘిక్‌లో ప.పూ. సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ జీ బౌద్ధిక్‌ సంక్షిప్తంగా..
 
సంఘది 91 ఏళ్ల చరిత్ర. సంఘ ప్రారంభపు రోజుల్లో ఎవరూ మనం ఇప్పుడు చూస్తున్న భవ్యదశ్యాన్ని ఊహించి కూడా ఉండరు. కేవలం డాక్టర్జీపై నమ్మకం, విశ్వాసంతో పని చేసుకుంటూ పోయారు. ప్రారంభంలో సంఘం అంటే సమాజంలో ఉపేక్ష భావం ఉండేది. ఎవరూ మనను పట్టించుకునేవారు కాదు. కానీ మన కార్యం పెరిగినకొద్దీ అందరితోపాటు వ్యతిరేకుల దష్టి కూడా మనపై పడింది. నిష్ట, త్యాగాలతో కష్టమైన ఆ కాలఖండాన్ని దాటాం.మానవ బాంబులే లక్ష్యంగా హైదరాబాద్‌లో కూడా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ 'స్ట్రీట్‌ దావా'

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమేతర యువతే లక్షంగా చేసుకొని వారిని ఇస్లామిక్‌ తీవ్రవాద సమర్ధకులుగా, సమయాన్ని బట్టి వారిని మనవ బాంబు లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ''స్ట్రీట్‌ దావా'' అనే ఇస్లామిక్‌ తీవ్ర వాద సంస్థ భారత దేశంలోని కొన్ని నగరాలలో అనధికారికంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తుంది. ప్రస్తుతుం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నయి లాంటి మహా నగరాలలో ప్రధానంగా ఐ టి రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై ద ష్టి కేంద్రీకరించి పని చేస్తుంది.

'స్ట్రీట్‌ దావా' ప్రధాన ఉద్దేశం ముస్లిమేతర యువతలో ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల సానుకూలత తో ఉండడం, మతోన్మాదులుగా మారడానికి తగిన సాహిత్యాన్ని అందిస్తూ, వారి వ్యక్తగత ఫోన్‌ నెంబర్లను, ఈమెయిలు ద్వార విదేశీ ఇస్లామిక్‌ శక్తులతో సత్సంబదాలను ఏర్పాటు చేయడం. కొంత కాలం వారకు నిరంతరం వారితో సంభాషిస్తూ ఒక విధమైన మానసిక దాడి చేసి ఇస్లాం పట్ల ఆకర్షితులై సమయం వచ్చినపుడు మానవ బాంబు లాగ మారడానికి సైతం సిద్ధం చేయడం. ఒకసారి ఇస్లామిక్‌ తీవ్రవాదానికి సానుకూలత ప్రదర్శించిన తరువాత వారిని ముస్లిమేతర పేర్లతోనే నిఘా సంస్థలకు ఎలాంటి అనుమానం రాకుండా విదేశాలకు తరలించడం.

ఇదే విధంగా కాశ్మీరీ మూలాలు ఉన్న బ్రిటన్‌ పౌరుడు అయిన సిద్దార్థ్‌ దార్‌ అనే హిందువు ను , ఇదే సంస్థ ద్వార ఇస్లాం పథం ఆకర్హింప చేసి ప్రస్తుతం ఒక కరుడు గట్టిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిగా మారి పోయాడు. అదే విధంగా కొంత మంది హిందువులు సైతం ఈ ఉగ్రవాద సమస్త పట్ల ఆకర్షితులైనారు. గణాంకాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన మనవ బాంబు దాడులలో ప్రపంచ వ్యాప్తంగా 25 మంది వరకు ఈ స్ట్రీట్‌ దావా ద్వారా వివిధ దేశాలలో ఆకర్షితులు అయినవారే. వీరు అందరు స్వతహాగా ముస్లిమ్స్‌ కాదు, అందరు ఇస్లాం మతంలోకి మార్చబడినవారే.

ఈ 'స్ట్రీట్‌ దావా' అనే సంస్థ ముస్లిమేతరులే కాకుండా మస్జిద్‌ లలో పని చేస్తున్న మౌలానా లను కూడా ఆకర్షిస్తూ వారిని ఇస్లామిక్‌ తీవ్రవాదానికి సంభదించిన సాహిత్యాన్ని, అందిస్తూ తీవ్రవాదానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇంటెలిజన్స్‌ సంస్థలో పనిచేస్తున్న అధికారి ప్రకారం హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాలలో పనిచేస్తున్న 'స్ట్రీట్‌ దావా' కార్యకలపాలపై దృష్టి పెట్టామని వారికి ఇతర స్థానిక తీవ్రవాద సంస్థలకు జాకీర్‌ నాయక్‌లాంటి మత ప్రచారకులతో ఉన్న సంబందాలపై కూడా నిఘా పెట్టమని తెలిపారు. జమాయిత్‌-ఇ-ఉలేమీయా హింద్‌ నాయ కుడు మౌలానా అర్షద్‌ మదానీ , యాదార్‌-ఉల్‌-ఉలూమ్‌, అల్‌-జాకిరియా సంస్థల నాయకుడు మౌలానా ముఫ్తీ అర్షద్‌ షారుఖీలు ఇద్దరూ అమాయకులైన ముస్లిమేతరులు స్ట్రీట్‌ ద్వారా చేరి తీవ్రవాదులు అవుతున్న విషయాన్ని ధ్రువీకరిం చారు. ఇస్లాం హింసను ప్రోత్సహించదు అని దీనికి కారణం ముస్లింలో ఉన్న నిరక్షరాస్యత, మతంపై సరైన అవగాహన లేక పోవడం అని తెలిపారు.

జల్లికట్టు జగడం వెనుక దాగిన నిజాలు

ఇటీవల జలిలకట్టుపై పెద్ద జగడమే జరిగింది. పశుహింసను ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు గగ్గోలు పెడితే, గ్రామీణ సంస్కృతికి ఈ క్రీడ అద్దంపడుతుందని చాలామంది సమర్థించారు. సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించి జల్లికట్టుకు అనుమతినివ్వాలని వేలాదిమంది ఉద్యమించారు. చివరికి కేంద్రం జోక్యంతో ఆర్డినెన్స్‌ ద్వారా జల్లికట్టు కథ సుఖాంతమైంది. కొన్ని వారాలపాటు దేశప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ మొత్తం ప్రహసనంలో కొన్ని ఆందోళన కలిగించే, ప్రమాదకర ధోరణులు కూడా బయటపడ్డాయి.


వినాయక నిమజ్జనం, దీపావళి టపాకా యలు, రంగురంగుల హోళీ, కృష్ణాష్టమి ఉట్లు కొట్టే పండుగ, జల్లికట్టు...ఇలా పండుగ, ఉత్సవం ఏదైనా 'పర్యావరణ పరిరక్షకులు', 'మేధావులు', 'జంతు ప్రేమికులు' మాత్రం ఆగ్రహంతో ఊగిపోతారు. ఇవన్నీ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఏర్పరచినవేనని, వాటి వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదని వాదిస్తారు. వాటిని పూర్తిగా నిషేధిస్తే తప్ప ఈ ప్రపంచం సుఖంగా, శాంతిగా బతకలేదని నొక్కి చెపుతారు. అందుకోసం ఊరేగింపులు, ఉద్యమాలు నిర్వహిస్తారు.

జల్లికట్టు ఏమిటి?
జల్లికట్టు 5000 ఏళ్ళనాటి నుండి వస్తున్న సంప్రదాయ క్రీడ. సింధూ నాగరకత సమయం నుంచి ఈ క్రీడ మన దేశంలో ఉంది. ఈ క్రీడా చిత్రాన్ని ముద్రించిన నాణాలు కూడా ఈ నాగరకత అవశేషాల్లో లభించాయి. పొగరుబోతు ఆంబోతు ల్ని వాటి మూపురాలు పట్టుకుని అదుపు చేయడం ఈ క్రీడలో ప్రధాన అంశం. అందుకనే దీనిని 'ఎరు తజువుతల్‌' (ఎద్దును అదుపు చేయడం) అంటారు. అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిన నాగరక తగా పేరుపడిన సింధూ నాగరకతలో ఉన్న ఈ క్రీడను ఇప్పుడు కొందరు 'అనాగరికం' అంటున్నారు. అదే విచిత్రం.

తమిళనాట నాయక రాజులు పరిపాలిస్తున్న ప్పుడు ఎద్దుల కొమ్ములకు బట్టలో చుట్టిన బంగారు నాణాలు కట్టేవారు. ఎద్దు మూపురాన్ని పట్టుకుని అదుపు చేసేవాళ్ళు ఆ బట్టను రెండవ కొమ్ముకు ముడివేయాలి. అలా చేస్తే అందులో నాణాలు అత నికి బహుమతిగా ఇచ్చేవారు. జల్లి లేదా సల్లి అంటే నాణాలు. కట్టు అంటే కట్టడం. ఇప్పుడు నాణాలు లేకుండా కేవలం ఒక బట్ట మాత్రమే కడుతున్నారు. 'వాడివాసల్‌' అనే ద్వారం నుండి బయటకు వచ్చే ఎద్దు లేదా ఎద్దులు నిర్ణీత మార్గం గుండా పరుగెడ తాయి. అలా పరుగెట్టే వాటిని పట్టుకుని అదుపు చేయాలి. ఇందులో అనేక వందలమంది పాల్గొంటా రు. ప్రయత్నిస్తారు. కానీ ఒకరిద్దరు మాత్రమే విజ యం సాధిస్తారు. వారికే బహుమతి లభిస్తుంది.

ఎందుకీ క్రీడ?
జల్లికట్టు కేవలం వినోదం కోసం ఆడే ఆట కాదు. దీనితో గ్రామీణ జీవన వ్యవస్థలోని సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. జల్లికట్టు గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, మనుష్యుల మధ్య ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని, వాటి చుట్టూ అల్లుకున్న ఆచారాలు, పద్ధతుల్ని మన కు చూపుతుంది. దేవాలయాల్లో ఒక ఎద్దును ప్రత్యే కంగా పెంచుతారు. దానిని కోయిల్‌ కాలై (దేవాల య ఎద్దు) అంటారు. దీనిని చాలా పవిత్రంగా చూసుకుంటారు. జల్లికట్టు ఆటలో మొదట ఈ ఎద్దు పరిగెడుతుంది. అప్పుడు దానిని ఎవరూ తాకరు. ఆ తరువాతే అసలు ఆట మొదలవుతుంది. ఈ ఆటలో కులం, వర్గం తేడా లేకుండా అందరూ పాల్గొంటారు. కాలగతిలో క్రమపరిణా మంలో భాగంగా ఏర్పడే స్థానిక పశు జాతుల వల్ల కలిగే ప్రయోజనాలు విదేశీ, సంకర జాతుల వల్ల ఉండవు. భారత రాజ్యాంగంలోని 48వ అధి కరణ పశు సంతతి అంతరించిపోకుండా, వాటిని వధశాలలకు తరలించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. అలాగే ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్య సదస్సులో ఆమోదించిన తీర్మానం కూడా దీనికి సంబంధించి నదే. అందులో ని 1,2,3 సూత్రాలు పశుసంపద ప్రకృతిలో ముఖ్య భాగమని, వాటిని జాతీయ సంపదగా గుర్తించి పరిరక్షించుకోవాలని పేర్కొంటున్నాయి. ఆ తీర్మానం పై ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ సంతకాలు చేశాయి.
జల్లికట్టును ఎవరు వ్యతిరేకిస్తున్నారు?
గ్రామీణ జీవన వ్యవస్థతో ఏమాత్రం సంబం ధం లేనివారు, దాని గురించి ఎలాంటి అవగాహన లేని నగరవాసులు కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అలాగే సంచలన వార్తల కోసం తహతహలాడే మీడియా కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది. ఒక సంవత్సరంలో మొత్తం 10వేలమంది జల్లికట్టు క్రీడలో పాల్గొంటారనుకుంటే అందులో 50 నుంచి 100మందికి మాత్రమే కొద్దిగా గాయపడతారు. మరణాలనేవి అసలు ఉండవు. కానీ జల్లికట్టువల్ల హింస జరిగిపోతోందంటూ ప్రచారం మాత్రం సాగుతోంది.ఈ దేశంలో సంస్కృతీ సభ్యతల్ని పూర్తిగా రూపుమాపి తద్వారా ఇక్కడ తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటున్న మిషనరీలు కూడా ఇలాంటి ఉత్సవాలు, క్రీడల్ని వ్యతిరేకించారు. మత వ్యాప్తికి జోషువా ప్రాజెక్ట్‌లాంటి ప్రణాళికల్ని అమలు చేస్తున్న క్రైస్తవ మిషనరీలు ఇక్కడ సంస్కృతీ సంప్రదాయాల్ని ధ్వంసం చేసేందుకు మరో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. అదే ప్రాజెక్ట్‌ థెసా లొనికా. దేశీయ ఉత్సవాలు, పండుగలపై విషప్రచా రం చేసి, వాటి పట్ల ప్రజల్లో అసహ్యాన్ని, చిన్నచూ పును కలిగించి తద్వారా వారిని సంస్కృతి, సంప్రదా యాలకు దూరం చేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. అందులో భాగమే హిందూ పండుగలు, ఉత్సవాలపై విషప్రచారం. వీళ్ళేకాక జల్లికట్టు జగడాన్ని జిహాదీ వాదులు కూడా ఉపయోగించు కోవాలనుకున్నారు. జల్లికట్టు మద్దతుగా ప్రజల్లో సహజంగా వచ్చిన స్పందనను తమ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోవాలని ప్రయత్నించారు. ఈ ప్రదర్శనల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ వ్యతిరేక ఉద్యమం గా మలచాలంటూ పేర్కొన్న కొన్ని పత్రాలు మెరీనా బీచ్‌లో లభించడం పోలీసుల్ని కూడా ఆశ్చర్యప రచింది.ఒసామాబినా లాడెన్‌ చిత్రాలు ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. భారత, మోదీ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. 

- కేశవ

వివేకం.. యువత మమేకం..యువజాగరణలో సంస్కృతీ ఫౌండేషన్‌

'ఈ దేశం మీ చేతుల్లో ఉంది' అన్న వివేకా నందుని పిలుపు.. యువత హదయాలలో ఎల్లప్పుడు మార్మోగి, ఈ దేశ పౌరుల్ని విలువలున్న, ఉత్తమ గుణాలు కలిగిన వివేకవంతులుగా తయారుచేయాల్సిన అవసరం వచ్చిందంటోంది హైదరాబాద్‌కు చెందిన 'సంస్కతి ఫౌండేషన్‌'. వివేకానంద జయంతిని పురస్కరించుకుని పలు స్ఫూర్తి దాయక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. 

చేయి చేయి కలిపి..
వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి 26 వరకు ఒక ఉద్యమంగా కొన్ని కార్యక్రమాలను చేస్తోందీ సంస్థ. ''సౌశీల్య నిర్మాణం, సామాజిక లక్ష్యాల అభివద్ధి పట్ల యువత దృష్టి సారించేటట్లు చేయడమే మా వివేక ఉద్యమ లక్ష్యం'' అంటున్నారు సంస్థ ప్రతి నిధులు. ఆ ఉద్యమంలో ముఖ్యమైన అంశం చేతికి ధరించే 'వివేక్‌బ్యాండ్‌'. ఇది ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ లాంటిదే. దీనిపై 'మంచిగా ఉండు, మంచి పని చెయ్యి' అన్న నినాదం ఉంటుంది. ఈ బ్యాండ్లను వీలైనంత ఎక్కువ మంది యువతకు చేరవేసేందుకు సంస్థ కషి చేస్తోంది. ''సంస్థ భావాల ప్రచారం కోసం సోషల్‌మీడియా, వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌లను వాడుకుంటున్నాం. మా ప్రచారంలో భావ సారూప్యత కలిగిన సంస్థలు, విద్యాకేంద్రాలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సినీతారలు, రేడియో జాకీలు పాలు పంచుకుంటుండం విశేషం..'' అని సంస్థ ప్రతినిధులు అన్నారు.

పదిమంది మేలు కోరి..
పెద్దల పట్ల గౌరవమర్యాదలు తగ్గిపోతున్న తరుణంలో.. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు - మానవ సంబంధాల పునరుద్దరణ మీద కూడా దష్టి పెట్టింది సంస్కృతి పౌండేషన్‌. మసక బారుతున్న జాతీయభావాన్ని పెంపొందిం చేందుకు - మన జాతీయగీతం, పతాకం, చిహ్నాలను గౌరవిం చాలన్నది మరో ముఖ్య అంశం. ఇక, సేవాభా వాన్ని రగిలించేందుకు యువతను.. ఆ దిశగా మేల్కొల్పుతున్నదీ సంస్థ.

జీవన స్ఫూర్తి.. మహిళా శక్తి..


మహిళలు అబలలు కాదు.. సబలలు అని నిరూపించే విధంగా ఎందరో భారతీయ మహిళలు తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచపు నలుమూలల చాటుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అని ముద్ర పడిపోయిన వృత్తి పనులను వారు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా వాటిలో ఉత్తమ నైపుణ్యాన్ని కూడా కనబరుస్తున్నారు.

క్షవర వ త్తి కాదది జీవనోపాధి....
తమ తండ్రులు అనారోగ్యంతో మంచాన పడితే.. కుటుంబం రోడ్డున పడుతుందన్న ఆవేదనతో.. కన్నవారికి భారం కావద్దనే ఆలోచనతో.. కుటుంబ సభ్యుల ఆకలి తీర్చే బాధ్యతతో తమ కులవత్తి అయిన క్షవరాన్ని ఎంచుకున్నారు వారిద్దరు. ఎన్నో అవమానాలు,. హేళనలు.. వెక్కిరింపులు ఎదురైనా విధికి తలవంచక నిలుచున్నారు. తాము కూడా ఎందులో నూ తీసుపోమని, జీవనోపాధికి వివక్ష ఉండదని నిరూపించారు. కేవలం పురుషులు మాత్రమే చేపట్టే వత్తిగా భావించే క్షవరాన్ని తమ జీవన సంగ్రామానికి ఆయుధంగా మలచుకున్నారు. నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో మొదటి వారు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం, మొండిగుంట గ్రామానికి చెందిన హిమబిందు. తండ్రి రాజేశ్‌కు మెదడు సంబంధిత వ్యాధి రావడంతో అతను మంచాన పడ్డాడు. ఆ సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న హిమబిందు తన తండ్రి వత్తిని తన వత్తిగా మార్చకుంది. రోజు క్షవరం చేయగా వచ్చే సొమ్ముతో కుటుంబాన్ని పోషించడం ప్రారంభించింది. తన తండ్రికి అయ్యే వైద్య ఖర్చులను కూడా తానే భరిస్తోంది. తన అక్కను డిగ్రీ చదివిస్తూ తాను కూడా తన చదువును కొనసాగిస్తోంది.

ఇక రెండవ వ్యక్తి తమిళనాడు పల్లాడమ్‌, తిరుప్పూర్కు చెందిన దేవి.. చదువురీత్యా పట్టభద్రురాలు.. తండ్రి అనారోగ్య కారణాలతో తన సెలూన్‌ నడపలేకపోయాడు. చిన్నప్పటి నుంచి క్షవర వత్తిపై అవగాహన ఉన్న ఆమె తన కుటుంబ బాధ్యతలను మోయడానికి సిద్ధమైంది. చదువుకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉన్నప్పటికీ క్షవరాన్నే ఉపాధిగా మలచుకొంది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎంత నచ్చ జెప్పినా.. వారిని వారించి సెలూన్‌ బాధ్యతలను చేబుచ్చు కుంది. తొలినాళ్ళలో మహిళ గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం ఏమిటి? అనే అవమానాలు ఎదుర య్యాయి. కానీ ఇప్పుడు ఆమె వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోంది. కులవత్తులు కేవలం పురుషులు మాత్రమే కాదు.. మహిళలు కూడా చేయగలరని నిరూపించింది.

అబలలు కాదు... ఆడ పులులు..
గుజరాత్‌లోని గిర్‌ అడవి ప్రాంతంలో ఒక మహిళా దళం పనిచేస్తోంది. ఆసియా జాతికి చెంది న అరుదైన సింహాల పరిరక్షణ ఈ మహిళల బాధ్య త. ఇది దేశంలోనే ఏకైక మహిళా అటవీ అధికారుల దళం కావడం విశేషం. ఈ దళానికి రసిలా వాదేర్‌ నాయకత్వం వహిస్తారు. తమ దళం ఇప్పటి వరకు 800లకు పైగా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. వాటిలో 200ల వరకు సింహలను రక్షించారు. వన్య ప్రాణుల మధ్య సాధారణంగా జీవించడానికే భయపడే చోట.. వీరు ఉండడం గొప్ప విషయమే కదా..? ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 2007సంవత్సరంలో అటవీ శాఖలో 33శాతం మహిళా కోటాను ఇచ్చారు. అందులో ఎంపికైన తొలి 43మంది మహిళా అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. వారిలోని 12మంది గిర్‌ అడవులకు వచ్చి తమ సేవలను ఇలా అందజేస్తున్నారు. సింహాల నుండి గ్రామస్తులను, వేటగాళ్ళ నుండి వన్యప్రాణులను రక్షించడంలో ఏ మాత్రం తగ్గకుండా ఈ మహిళా దళం పనిచేస్తోంది. నేషనల్‌ జియోగ్రాఫీ, డిస్కవరీ ఛానెళ్ళలో వీరికి సంబంధించి న కథనాలు కూడా వచ్చాయి. 


జమ్ముకాశ్మీర్‌లో పని చేసే గ్రామ మిలీషియా దళం కూడా మహిళలతో కూడినదే. వీరు కరడుగట్టిన ఉగ్రవాదులను సైతం మట్టు పెడుతారు. ఆయుధాలను అవలీలగా వాడుతారు. దేశ సరిహద్దుల్లో ఉండి సైనికులకు తోడ్పాటును అందిస్తారు.19వ దశకంలో జమ్ము, కాశ్మీర్లలో మహిళల మాన, ప్రాణాలను తీవ్రవాదులు తీసేసే వారు. అంతేకాకుండా గ్రామాలను సర్వనాశనం చేసేవారు. ఇలాంటి దుశ్చర్యల నుండి గ్రామాలను రక్షించడానికి, మహిళల మానాన్ని, ఆత్మగౌరవాన్ని రక్షించడానికి గ్రామ రక్షణ దళాలను భారత సైనిక దళం ఏర్పాటు చేసింది. వారికి యుద్ధ విద్యలతోపాటు ఆయుధాలను కూడా అందించింది. అప్పటి నుంచి ఎందరో కరడుగట్టిన తీవ్రవాదులను కాశ్మీర్‌ లోయల్లోని మారుమూల గ్రామాల్లో ఈ గ్రామ రక్షణ దళాల సభ్యలు మట్టుబెట్టారు. పూంచ్‌, రాజౌరి, ఖతా, రెక్కాన్‌ వంటి అత్యంత సంక్లిష్ట వాతావరణ పరిస్థితులు ఉన్న చోట కూడా ఈ ధీరవనితలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా కేవలం వత్తి పనులే కాదు.. రక్షణ.. ఐటీ.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమ సత్తాను చాటుకుంటూ ముందుకు వెళ్తున్న మహిళామణులు ఎందరో ఉన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి యువతి, మహిళ దేశం కోసం, సమాజం కోసం, తమ కుటుంబం కోసం పనిచేయాలి. వంటింటికే కాదు.. బాధ్యతల పంపకాల్లో కూడా తాము ముందుంటామని నిరూపించుకోవాలి. అవసరమైతే ఆయుధం పట్టాలి.. కలంతో కాలాన్ని మార్చేయాలి.. యంత్రంతో అభివద్ధి వైపు పరుగులిడాలి.. నారీ లోకం జయభేరిని మోగించాలి.. స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటాలి.

- లతా కమలం


గృహ వైద్యం : వంటింటి పదార్థాలలో అతి ముఖ్యమైన వాము

వాము లేని వంటిల్లు ఉండదు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఇమిడి ఉన్నాయి. వాము చేసే మేలు ఒక్కమాటలో చెప్పలేనిది. ఇది చిన్న చిన్న కడుపునొప్పుల నుండి పెద్ద పెద్ద (క్యాన్సర్‌ వంటి) వ్యాధులను నయం చెయ్యగలిగే ఔషధం. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు వాము, వేడినీళ్ళు, ఉప్పు కలిపిన కషాయం త్రాగవచ్చు. 

జలుబు చేసినప్పుడు (బాగా పడిశం పట్టినప్పుడు) ఈ వాముగింజలను కుంపటిమీద నిప్పులో వేసి, వచ్చేపొగనిపీల్చడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వాము, బెల్లం కలిపిన ముద్దని రోజూ తినడం వలన ఆస్తమా (ఉబ్బసం వ్యాధి) తగ్గిపోవును. షుగర్‌ వ్యాధి ఉన్నవారికి కూడా ఈ వాము ఒక దివ్య ఔషధం. 

వాము పులావు ఆకు ముద్దగా నూరి దాని రసం త్రాగడంవలన మెరుగుపడవచ్చును. కలుషిత నీరు త్రాగడంవలన కలిగే కలరా జబ్బు సోకడంవలన కడుపులో పట్టే పురుగులను హత మార్చడంలో వాము నీరు ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మద్యానికి బానిసలయిన వారికి వామునీరు విరుగుడుగా పనిచేస్తుంది. దీనిని 50 రోజులపాటు రెండుపూటలాత్రాగించాలి. 

చిన్న (13-16ఏళ్ళ) వయసులో వాము గింజలు తినిపించడంవలన అవాంఛిత కామవాంఛ తగ్గును. పైన తెలిపిన అనేక కారణాలు, వ్యాధులు, గుణాలు, ఉపయోగాలు తెలుసుకున్నాము కనుక ప్రతిరోజూ ఏదో ఒకవిధంగా వామును ఆహారములో భాగంగా సేవించాలి.

-ఉషా లావణ్య

వెయ్యేండ్ల గణపతి విగ్రహం ధ్వంసం, పునఃప్రతిష్ట

ఛత్తీస్‌గఢ్‌లోని ఒక పర్వతంపై ఉన్న వెయ్యేండ్ల నాటి గణపతి విగ్రహం విధ్వంసానికి గురైంది. సముద్ర మట్టానికి దాదాపు 2,994 మీటర్ల ఎత్తు లోని డోల్‌కల్‌ పర్వత శిఖరాగ్రంపై ఉన్న గణేశ్‌ విగ్రహాన్ని చూసేందుకు తరచూ పర్యాటకులు, భక్తు లు రావడం నచ్చని మావోయిస్టులు దీనిని ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు. మావో యిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే దంతేవాడ జిల్లా బైల డిల్లా అటవీ ప్రాంతంలో ఈ డోలకల్‌ పర్వతం ఉంది. 56ముక్కలై ఉన్న విగ్రహాన్ని పర్వతం కింది భాగంలో గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరుపు తున్నామని దంతెవాడ ఎస్పి కమ్లోచన్‌ కశ్యప్‌ చెప్పా రు.

ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్క తిక శాఖ మంత్రి దయాళ్‌దాస్‌ భాగెల్‌ చెప్పారు. విగ్రహ ధ్వంసం మావోయిస్టుల పనేనని బస్తర్‌ ఐజి కల్లూరి వెల్లడించారు. ఈ విగ్రహాన్ని 9లేదా 10వ శతాబ్దంలో నాగవంశ రాజులు ప్రతిష్టించినట్టు చెప్తుంటారు. అక్కడికి చేరుకోవడానికి రోడ్డు మార్గం లేదు. కాలి నడకనే చేరుకోవాలి. ఇదే పర్వతానికి సమాంతరంగా మరో పర్వతంపై ఉన్న సూర్యదేవుని విగ్రహం సైతం 15ఏండ్ల క్రితం ఇదే తరహాలో ధ్వంసం కావడం గమనార్హం. దీన్ని గుర్తించిన పోలీసుల వారంరోజుల పాటు కష్టపడి పునఃప్రతిష్టించారు.

సేవాభారతి, తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల చదువుకు బాసటగా పరుగు

సేవాభారతి తెలంగాణ ప్రాంతం వారు 2017 జనవరి 22న 'బాలికల విద్య కోసం పరుగు' ను నిర్వహించారు. ఈ పరుగులో 5300 మంది నమోదు చేయించుకోగా 4500 మంది పాల్గొన్నారు. వీరిలో 1650 మంది మహిళలు. విద్య, వివేకం, సామాజిక అవగాహన కలిగిన మగువ వివాహంతో పుట్టినిల్లు వీడి, భర్త చేయి అందుకుని మెట్టినింటిలో ఉంటూ కుటుంబ వ్యవస్థకు ప్రాణం పోసి, తద్వారా ఉన్నత సమాజ నిర్మాణానికి ఆధారం అవుతుంది. నిరుపేదల ఎక్కువగా వుండే నగరాల్లోని బస్తీలు, గ్రామాలలో కిశోరి వికాస్‌ కేంద్రాల ద్వారా ప్రతిరోజు పాఠశాల తర్వాత సాయంత్రం 2 గంటల పాటు 4 నుండి 10వ తరగతి చదువుతున్న బాలికలకు విద్య, ఆరోగ్య, వ త్తి విద్య, భారతీయ సాంస్కతిక విలువలు, స్వీయ శిక్షణ, వ్యక్తిత్వ వికాసం మున్నగు విషయాలలో శిక్షణను ఇస్తున్నారు. ప్రస్తుతం భాగ్యనగరంలో 100, తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50 కేంద్రాల ద్వారా 3500 మందికి పైగా కిశోరీలకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కిశోరి వికాస కేంద్రాలను తెలంగాణ ప్రాంతం అంతటా వ్యాప్తి చేయాలని సంకల్పించారు. 47 మంది ఉత్సాహవంతులైన కార్యకర్తలు వేసవి సెలవుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లోకి వెళ్లి వారం రోజులపాటు అక్కడ స్థానికులతో ఉండి, కిశోరి వికాస కేంద్రాలను నిర్వహించి, వీటి ఆవశ్యకత వివరించారు. ఏ కార్యమైన విజయవంతం కావాలంటే సమాజ భాగస్వామ్యం అవసరం. ఈ విషయాన్ని గుర్తెరిగిన సేవాభారతి జనవరి 27న ఈ పరుగును నిర్వహించింది. దీనికి అనూహ్యంగా వివిధ కార్పోరేట్‌ సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలను అందించాయి.

మిజోరాంలో క్రైస్తవుల మిషనరి డే సెలవు

ప్రభుత్వ కార్యాలయాల్లో రాముడు, అమ్మవారి చిత్రాలు ఉండరాదు అని కొంత మంది వాదన. దానికి వారు చెప్పే కారణం మనదేశం ''సెక్యులర్‌'' అని. ముస్లింలు నమాజు చేసుకోటానికి కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. సెక్యులరిజానికి ప్రమాదం లేదు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఒక అడుగు ముందుకు వేసి సెక్యులరిజాన్ని అధికారికంగానే ''హత్య'' చేసింది. ఒక శతాబ్దం క్రిందట అస్సాం నుంచి వచ్చిన లోరియన్‌, సావిడ్‌గే అనే ఇద్దరు క్రైస్తవ మిషనరీలు ప్రజలను మభ్యపెట్టి, మోసగించి, బెదిరించి మతం మార్చారు. నేడు మిజోరం వంద శాతం క్రైస్తవ రాజ్యం. జనవరి 11, 2017 (బుధవారం)న రాష్ట్ర ప్రభుత్వం లోరియన్‌, సావిడ్‌గేలు అక్కడ అడుగుపెట్టిన రోజుని ''మిషనరీ డే'' అంటూ అధికారికంగా జరిపింది. సెలవు దినంగా ప్రకటించింది. రాముడు పేరు తలిస్తే మతోన్మాదం. కానీ విదేశీ విద్రోహులను, వారి మతాన్ని అధికారికంగా గౌరవించడం మాత్రం మతోన్మాదం కాదా.! ఇదెక్కడి న్యాయం.!

స్ఫూర్తి

తమ సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఒక రూపాయిని. ఒక మట్టి ముద్దను పుచ్చుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి,
''ధనం.. మట్టి ముద్దే ధనం'' అని పలికారు. అలా పలికి ఆ వెంటనే రెండింటినీ గంగలో విసిరివేశారు. ఆయన యాభై ఒక్క సంవత్సరాలు జీవించి ఈ ప్రపంచంలో డబ్బు తాకకుండా జీవించ వచ్చునని రుజువు చేశారు. మథూర్‌, లక్ష్మీనా రాయణ్‌ మార్వాడీ గురుదేవులకు డబ్బు ఇవ్వ బోయారు. ఆయన డబ్బును నిరాకరించడమే కాకుండా తమను ప్రలోభపరచడానికి ప్రయత్ని స్తున్నారని వారిని గట్టిగా చీవాట్లు పెట్టారు. లౌకికులు డబ్బును ప్రేమిస్తారు. తమకు శాంత్యా నందాలను అది తెచ్చిపెడుతుందని వారు భావిస్తారు. డబ్బుతో విలాసవంతమైన భవనాలను, ఖరీదైన కార్లను, రకరకాల వస్త్రాలను, ఇతర సౌకర్యా లను కొనుగోలు చేయవచ్చు- కాని భగవంతుణ్ణి కాదు. కలకత్తావాసులకు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ''వ్యాజ్యాలలో నెగ్గాలి, ఎంతో ధనం గడించాలి, ఇతరు లను న్యాయస్థానాలలో గెలిపించడానికి సహాయం చేయాలి. ఆస్తిపాస్తులు సముపార్జించాలి-వీటి కోసం సాధనలు అనుష్టించడం? నీచాతినీచం. తిండి,గుడ్డ, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్సేవకు, సాధుసేవకు, తారసపడ్డ పేదసాదలకు సహాయం చేయడానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకూ, భోగాలకూ ధనం ఉపయోగించరాదు. సమాజంలో పేరు ప్రతిష్టలు సముపార్జించడానికి ధనం వినియోగించకూడదు.