లోక హితం పాఠకులకు శుభవార్త !

మా ప్రియమైన పాఠక మిత్రులకు..! 
మన లోకహితం పత్రిక ఇకనుండి ఇంటర్ నెట్ ఎడిషన్ గా వెలువడుతున్నదని ప్రకటించుటకు చాల ఆనందంగా ఉన్నది. ఈ ఆనందాన్ని మీతో పంచుకొంటున్నందుకు ధన్యవాదములు .  అనేకమంది పాఠకులు కోరిన మీదట లోకహితం సంపాదకవర్గం ఈ నెట్ ఎడిషన్ ప్రారంభించుటకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నం ఇంత త్వరగా సాకారం అయినందులకు ఆ భగవంతునికి లోకహితం సంపాదకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నది.  


ఇకనుండి పాఠకులు 'లోకహితం' పత్రికను ఇంటర్నెట్ ద్వార కూడా వీక్షించి మీ సమయాన్ని అదా చేసుకోండి. 

http://www.lokahitham.net/  అని టైపుచేసి ఈ సైట్ చూడవచ్చు. ఈ పత్రికకు మీ ఆశీర్వాదములు ఎల్లప్పుడూ లభిస్తాయని కోరుకుంటూ .....

ధన్యవాదములతో..
సంపాదక వర్గం.

భారత దేశ విభజన సమసి పోవాలి

ప్రాచీన భారత ప్రభుత్వ వ్యవస్థలో అందరికీ, అన్ని అవసరాలకీ స్థానం ఉండేది - యోగి అరవింద

మనం మరచిన కుంకుడుకాయ

కుంకుడుకాయ నురుగుతో తలంటుకోవటం వలన చుండ్రు తగ్గి, తల వెంట్రుకలు వత్తుగా, నల్లగా పెరుగుతాయి. షాంపు, సబ్బులు మొదలైన వాటికన్నా తలంటుకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది. తేలు కటుపై కుంకుడుకాయ రసం రాసిన విషం విరిగి బాధ తగ్గుతుంది. కుమ్కుడును తేనెతో ఆరగతీసి నాకిస్తే కఫము బయటకు వచ్చి ఆయాసం తగ్గుతుంది.

సత్యమేవ జయతే

సత్యమేవ జయతే నానృతం |
సత్యేన పంథా వితతో దేవయానః |
యేనా క్రమం త్రుషయో హ్యప్తకామా |
యాత్ర తత్సత్యస్య పరమం నిదానం || 

భావము : సత్యమే జయించును. అసత్యము పరాస్తమగును. సత్యము వలననే దేవతల మార్గము విస్తరించి యున్నది. సత్యము చేతనే మహర్షులు అప్తరాములై ఈశ్వరుని పొందుచున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
ముండకోపనిషత్ - 3-1-6

మన చరిత్రను తెలుసుకుందాం - 8 వ భాగం

ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచినా విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?  తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.