సామాజిక ఐక్యతను సాధించే ఏకైక ఆశాకిరణం ఆర్.ఎస్.ఎస్.

సంఘం ప్రారంభించి ఈ విజయ దశమికి 86 పూర్తయి 87 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఆ  సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టత ఉన్నది. ప్రపంచ కళ్యాణానికి కావలసిన విజ్ఞానం భారతదేశం నుండి అందుతుంది. 


వంటింటి వైద్యశిఖామణి - వెల్లుల్లి

మాంసాహారం మరియు ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో  ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. 

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఆరోగ్య భారతి లక్ష్యం

"ఆరోగ్యమే మహాభాగ్యం"  అన్నది అనాదిగా వస్తున్న సూక్తి. మన దేశంలో నేడు ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, యోగ, ప్రకృతి, యునాని, హోమియోపతి, అలోపతి మొదలైన వైద్య పద్ధతుల ద్వారా రోగ చికిత్స పైన విశేషమైన కృషి జరుగుతున్నది. 


మన చరిత్రను తెలుసుకొందాం - 10వ భాగం

ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.

554 సంస్థానాలను భారత్ లో విలీనం చేసిన పటేల్

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31 న గుజరాత్ లోని నాడియాడ్  లో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ రోజుల్లో దేశంలో ఉన్న 554 సంస్థానాలను స్వల్ప వ్యవధిలో దేశంలో విలీనం చేసిన ఖ్యాతి పటేల్ దే. పటేల్ అనాడు అలా చేసి ఉండకపోతే భారతదేశం ఇంత సమైక్యంగా ఉండేది కాదు. 

వాణిజ్య చక్రబంధం నుండి భారత్ బయట పడగలదా ?

కలియుగాబ్ది 5113 , శ్రీ ఖర నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం 

ఘనత వహించిన మన ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ ఈ రోజున ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం గురించి విశ్లేషించారు. "


తన ఉనికిని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ఆడుతున్న ప్రమాదకర అట - మత పరమైన రిజర్వేషన్లు

మతపమైన రిజర్వేషన్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం. వందల సంవత్సరాలుగా సమాజంలో వివక్షకు గురైన వారిని మిగతా సమాజంతో పాటు అభివృద్ధి చేయాలనే ఉన్నత లక్ష్యంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ లక్ష్యాన్ని విస్మరించి, తమ రాజకీయ అవసరాలకు తగిన విధంగా రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు కూడా రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధంగా ఉన్నాయి.

లవ్ జిహాద్ ఒక ప్రమాదకర ఎత్తుగడ

గడచినా కొద్ది సంవత్సరాలుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 'లవ్ జిహాద్' పేరు తరచుగా వినిపిస్తోంది. ఏమిటీ ఈ లవ్ జిహాద్? ఇదేమైనా సమస్యా? దేశంలో అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యల్లో ఇదొక ప్రమాదకరమైన సమస్య. ఆ సమస్య కూడా అంత త్వరగా అర్థం కానిది. సమస్యను ఎదుర్కొంటున్న వారు పరువు, మర్యాదల కోసం పదిమందిలో చెప్పుకోలేని సమస్య. ఈ సమస్య గురించి ఈ మధ్య కేరళ హైకోర్టు పోలీసు విభాగాన్ని హెచ్చరించిన విషయం పాఠకుల దృష్టికి వచ్చి ఉంటుంది.

పాక్ లో తిరిగి తెరచుకున్న హిందూ ఆలయం

"ఈ దేవాలయంలో హిందువులు మళ్ళీ పూజా పునస్కారాలు జరుపుకోవచ్చు. కాని కండిషన్స్ అప్లై" అని పెషావర్ హైకోర్టు తీర్పు చెప్పడంతో పాకిస్తాన్లోని పెషావర్ ప్రాంత హిందువులు సంతోషంతో ఉబ్బిపోయారు. 

మీ 'ఓదార్పు' ఆపండి మహాప్రభో...

ఇటీవల సిక్కిం ప్రాంతాన్ని తీవ్ర భూకంపం అతలాకుతలం చేసింది. వివిధ కారణాలుగా అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరిగింది. అయినా ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు ఎలాంటి కష్టాలనూ లెక్క చేయకుండా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 

ఇదేమి ప్రజాసేవ ?

తాడిత పీడిత పేద గిరిజనుల సేవ కోసం అహరహం శ్రమిస్తామని చెప్పుకొనే మావోయిస్టుల చర్య ఆశ్చర్య గొలిపేలా ఉంది. 

త్వరలో వెలువడనున్న శ్రీ బాలాసాహెబ్ జీ జీవిత చరిత్ర

శ్రీ బాలాసాహెబ్ జీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ గా  సంఘాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో నడిపించిన వ్యక్తిగా చరిత్ర పుటల కెక్కిన శ్రీ బాలాసాహెబ్ జీ జీవిత చరిత్ర తెలుగు పాఠకులకు త్వరలో అందుబాటు లోకి రానున్నది.  

మన తెలుగు భాషను రక్షించుకుందాం

తెలుగు మన మాతృభాష. అంటే తల్లినుడి. అంటే తల్లి పలుకు. వేల ఏండ్లుగా కోట్లమంది భాషగా, ఇతర భాషలతో కలసి మెలసి ఎంతో పద సంపదను సొంతం చేసుకొంది. గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రపంచీకరణ నేపథ్యంలో మన మాతృభాషకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి. 

హిందూ వ్యతిరేక కుట్ర - మతహింస నివారణ బిల్

24 అక్టోబర్ సాయంత్రం 6 గంటలకు గోదావరి ఖనిలో న్యాయవాద పరిషత్ అధ్వర్యంలో మతహింస నివారణ బిల్లుపై చర్చా వేదిక జరిగింది. ఈ చర్చకు సీనియర్ న్యాయవాది శ్రీ పింగిళి విశ్వేశ్వరరావు, సింగరేణి ఎస్.ఏం.ఎస్. ప్లాంట్ అధికారి శ్రీ రాజయ్య, గోదావరి ఖని జిల్లా సంఘచాలక్ శ్రీ భగవాన్ రెడ్డి, సమాచార భారతి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ పాల్గొన్నారు.

వరంగల్ మహానగరంలో లోకహితం పాఠకుల సమావేశం

సెప్టెంబర్ 18 న వరంగల్ మహానగరంలో డాక్టర్స్ కాలనీ ఫేజ్-2 లో లోకహితం పాఠకుల సమావేశం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జేష్ఠ కార్యకర్త శ్రీ రేవా కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా లోకహితం పత్రిక సంపాదకులు శ్రీ మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది పాఠకులు  పాల్గొన్నారు.

అగ్రే వేదాశ్చతురః

"అగ్రే వేదాశ్చతురః
పృష్ఠత స్సశరంధనుహ్
ఇదం బ్రాహ్మ్య మిదం క్షాత్రం
శాపాదపి శరాదపి"

భావము : ముందు నాలుగు వేదములున్నూ, వెనుకనేమో శరసహితమైన ధనుస్సున్నూ.. ఇదిగో ఇది బ్రహ్మము, ఇది క్షాత్రము. శాపమునకును, యుద్ధమునకును కూడా సమర్థులమే.
- పరశురామ వాక్యం, భాసనాటకమ్

జాతి స్మరించుకోదగిన మహా పురుషులు

అక్టోబర్, నవంబర్ మాసాలు  

వనవాసీ కళ్యాణ పరిషత్ క్రీడా మహోత్సవం

2011 సంవత్సరం వనవాసీ కళ్యాణాశ్రమానికి  క్రీడా మహోత్సవం. ఈ క్రీడలు అఖిల భారత స్థాయిలో డిశంబరు 27 నుండి 31 వరకు మహారాష్ట్రలోని పూనాలో జరగబోతున్నాయి.