హిందూ హింస బిల్లు

2011 సం. నవంబరు 14వ తేదీన సోషల్ కాజ్ మరియు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యా ప్రాంగణంలో జరిగిన మేధావుల సదస్సులో....

చదువు సంస్కారాలను మేళవించుకుంటూ ముందుకు సాగుతున్న సరస్వతీ శిశుమందిరాలు

పిల్లలకు తొలి గురువు తల్లి. తల్లి దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుని, సంస్కారాన్ని పొందుతాడు. పిల్లల పరిపూర్ణ వికాసానికి పాఠశాల స్థాయి వరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలనే లక్ష్యంతో

తల వెంట్రుకలను వత్తుగా పెంచే తానికాయ

తానికాయ : తానికాయలో కూడా కరక్కాయ, ఉసిరికాయలలో వలె లవణరసము తప్ప మిగిలిన అయిదు రసములు ఉండును. వేడి చేయు స్వభా వము కలదు. కఫ, పిత్త, వాత దోషములను 

ధర్మబద్ధమైన కర్మను చేయాలి

కురుక్షేత్ర సంగ్రామంలో మోహంలో పడి యుద్ధ విముఖుడైన అర్జునుడికి తన ధర్మాన్ని గుర్తు చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి ? అనే విషయాలతో

చిల్లర వ్యాపారంలోకి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవు తున్నా, UPA భాగస్వామ్య పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తమవుతు న్నప్పటికీ చిల్లర (రిటైల్) వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంలో

అధిష్టానం తథా కర్తా

అధిష్టానం తథా కర్తా
కరణం చ పృథగ్విధమ్ |

మన చరిత్రను తెలుసుకొందాం - 12వ భాగం

ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.

సరిహద్దులలో పొంచి ఉన్న ప్రమాదం - నిరంతర జాగరూకతే ప్రజల కర్తవ్యం

అంతర్జాతీయ బీభత్సకాండను ఉసిగొల్పిన ఒసామా బిన్ లాడెన్ ఇటీవల పాకిస్తాన్ లో హతమారి పోయాడు. కానీ అంతకుముందు అనేక సంవత్స రాలపాటు బిన్ లాడెన్ సకుటుంబసమేతంగా

మండుతున్న పెట్రోలు ధరలు

పెట్రోలుకు మండే ధర్మం ఉన్నది. కాని మన దేశంలో పెట్రోలుకంటే దాని ధరలే ఎక్కువగా మండుతున్నాయి. గత ఏడాది ఏప్రియల్ మాసం నుండి ఇప్పటి దాకా చూసుకుంటే...

గోవధ చట్టవిరుద్ధం - సుప్రీంకోర్టు

సరైన ఆధారాలు లేనందున గోవధను చట్టవిరుద్ధ చర్యగా భావించ నిరాకరించిన పంజాబ్, హర్యానా కోర్టు తీర్పును

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి

"భూమి" బల్ల పరుపుగా ఉన్నది. గుండ్రముగా ఉన్నదంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా మత గ్రంథంలో అలాగే ఉంది" అని అడ్డంగా వాదించే క్రైస్తవ పండితుల గురించి మనకు తెలుసు.

64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం -3

చదువుల వ్యాపారం - యువత 
మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి

తల వెంట్రుకలను వత్తుగా పెంచే తానికాయ

తానికాయ

తానికాయ : తానికాయలో కూడా కరక్కాయ, ఉసిరికాయలలో వలె లవణరసము తప్ప మిగిలిన అయిదు రసములు ఉండును. వేడి చేయు స్వభావము కలదు. కఫ, పిత్త, వాత దోషములను తగ్గించును. దగ్గు, నేత్ర రోగములు, కం రోగములందు పనిచేయును. తలవెంట్రుకలను వత్తుగా పెంచును. నులిపురుగులను నశింపచేయును. దగ్గు, వాంతులను తగ్గించును.  

దగ్గు, ఆయాసముల యందు తానికాయల చూర్ణమును తేనెతో ఇవ్వవలయును. తానికాయ గింజలలోని పప్పు మూత్రాశయములోని రాళ్ళను కరిగించును. అటులే తానికాయ పప్పును తేనెతో ఇచ్చిన సుఖ నిద్రను కలుగ చేయును. తానికాయ గింజలలోని పప్పును మెత్తగా నూరి పైన పూత పూసిన వాపులు తగ్గును. నేతితో వేయించిన తానికాయ పెచ్చును చప్పరించిన గొంతు బాధలు తగ్గి మంచి స్వరము కలుగును.

ఆయుర్వేదము నందు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలకు మంచి ప్రాధాన్యత కలదు. ఈ మూడు కాయలను సమభాగాలుగా తీసుకొని గింజలు తీసివేయగా మిగిలిన దానిని ఎండబెట్టి చూర్ణముగా తయారుచేయుదురు. దీనిని త్రిఫల చూర్ణమందురు. ఇది అన్ని ఆయుర్వేద మందుల షాపులలోనూ లభించును. ఈ చూర్ణములో పై మూడు కాయలలోని అన్ని గుణములు ఉండును. 

ఈ త్రిఫల చూర్ణమును ఒక చెంచా చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా సేవించినచో సుఖ విరేచనమగును. ముఖము కాంతివంతమగును. 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య 

రాబోయే 50 సంవత్సరాల పాటు భారతమాతను ఆరాధించాలని పిలుపునిచ్చిన స్వామి వివేకానంద

వివేక సూర్యోదయం - ధారావాహికం - 1

ప్రపంచంలో భారతదేశం ఎంతో విలక్షనమైనది. సమన్వయ దృష్టి కోణం కలిగినది భారతీయ సంస్కృతి. అసలు సంస్కృతి అంటే యునెస్కో వారి నిర్వచనం ప్రకారం "ఏదేని సమాజంలో ఒక తరం నుండి మరొక తరానికి అందించబడే ఆలోచనలు, నమ్మకాలు, ప్రతీకలు, భౌతిక, ఆధ్యాత్మిక విషయాలు, విలువలు, సామాజిక వ్యవస్థ మొదలైనవి అన్ని కలగలిపిన వ్యవస్థ సంస్కృతి అనబడును". భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల నుండి విలసిల్లుతూ వస్తున్నది. గడిచిన వెయ్యి సంవత్సరాలకు పైగా విదేశీయుల రాజకీయ, సాంస్కృతిక ఆక్రమణను ఎదిరించి పోరాటం చేసిన జాతి మనది.

సరిహద్దులలో పొంచి ఉన్న ప్రమాదం - నిరంతర జాగరూకతే ప్రజల కర్తవ్యం

ఆర్. ఎస్. ఎస్.అఖిల భారత కార్యకారీ మండలి తీర్మానం
గోరఖ్ పూర్ - 2011 

వేదికపై పూజ్య సర్ సంఘచాలక్ మా. శ్రీ మోహన్జీ భాగవత్, సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి.
జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్న పరిణామాల పట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. కలియుగాబ్ది 5113 ఆశ్వయుజ బహుళ విదియ నుండి మూడు రోజుల పాటు అనగా క్రీస్తు శకం 2011 అక్టోబర్ 14 నుండి 16 వరకు ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన సంఘ 'అఖిల భారత కార్యకారీ మండల్' సమావేశాలలో దేశ భద్రతను పరిరక్షించి పెంపొందించడానికై సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని  కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానం క్రింది విధంగా ఉన్నది.

దేశ సరిహద్దుల వెంబడి నెలకొని ఉన్న ఉద్రిక్తతలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని 'అఖిల భారత కార్యకారీ మండల్' నిరసిస్తోంది. విచ్ఛిన్న వాదులకు, బీభత్స కారులకు సరిహద్దులకు ఆవల నుంచి లభిస్తున్న ప్రోత్సాహం గురించి కాని, మన గగన తలానికి, సముద్ర సీమలకు ఎదురౌతున్న ప్రమాదాల గురించి కాని, అంతరిక్షంలోను, అంతర్జాతీయ జలాలలోను మన దేశానికి విరుద్ధంగా విస్తరిస్తున్న వైపరీత్యాలను గురించి కాని మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మన ప్రాదేశిక సమగ్రతకు విఘాతకరంగా పరిణమిస్తున్న ప్రమాదాల గురించి మన ధ్యాస పెరగాలి. 

కవ్విస్తున్న చైనా
చైనా సైనిక దళాలు నిరంతరం మన సరిహద్దులను ఉల్లంఘించి చొరబాట్లు కొనసాగిస్తునారు. సరిహద్దు ప్రాంతాలలోని మన సైనిక స్థావరాలను జనావాసాలను ధ్వంసం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు. మన ఇరుగు పొరుగు దేశాలలో చైనా ప్రభుత్వం సైనిక స్థావరాలను ఏర్పరచుకొంటోంది. ఆ దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకొంటోంది. ఈ చర్యల ద్వారా మన దేశాన్ని నలువైపుల నుంచి సైనిక దిగ్బంధం చేయాలన్నది చైనా ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం! ఈ పరిణామాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. చైనా ప్రభుత్వం పాకిస్తాన్ కు ఆయుధాలను, ఇతర యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ లోని భారత వ్యతిరేక బీభత్సకారులను (టెర్రరిస్టులను) ప్రోత్సహిస్తోంది.  పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న కాశ్మీర్లో చైనా సైనికులు తిష్ఠ వేసి ఉన్నారు. మావోయిస్టులు మాధ్యమంగా నేపాల్ లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని తన అదుపులో ఉంచుకొనడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్, బర్మా (మయన్మార్), శ్రీలంక వంటి మన పొరుగు దేశాలకు చైనా సైనిక నిపుణులు విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. మన దేశాన్ని వ్యూహాత్మకంగా దిగ్బంధించాలన్న చైనా ప్రభుత్వ విధానంలో ఇవన్నీ భాగం. 

సరిహద్దులకు ఆవల నుంచి బీభత్స కారులను, విచ్ఛిన్న వాదులను మన దేశానికి వ్యతిరేకంగా ఉసికొల్పడం మాత్రమే కాదు, మన ఈశాన్య ప్రాంతంలోని దేశ విద్రోహక ముఠాలకు చైనా ప్రభుత్వం బాహాటంగా సహాయం చేస్తున్నది. ఇది మన జాతి సమైక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు ప్రమాద కరంగా పరిణమించింది. చైనాకు చెందిన 'సైబర్' సాంకేతిక పరిజ్ఞాన వేత్తలు రహస్యంగా మన 'సమాచార వినిమయ వ్యవస్థ' (ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ సిస్టం) లోనికి చొరబడిపోతున్నారు. అతి తక్కువ వ్యయంతో అమలు జరుపడానికి సిద్ధపడడం ద్వారా చైనా సంస్థలు రక్షణపరంగా కీలకమైన ప్రాంతాలలోని మన పథకాలను హస్తగతం చేసుకొంటున్నారు. తద్వారా చైనా ప్రభుత్వం తన గూఢచర్య  వ్యవస్థను మన దేశంలో విస్తరించు కొంటోంది. ఇలాంటి పరిణామాలు మన దేశ భద్రతా వ్యవస్థను భగ్నపరుస్తున్నాయని 'అఖిల భారత కార్యకారీ మండల్' భావిస్తున్నది.

క్రీస్తుశకం 1962 వ సంవత్సరంలో చైనా ప్రభుత్వం దురాక్రమించిన 38 వేల చదరపు కిలోమీటర్ల మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ అదే సంవత్సరం నవంబరు 14 వ తేదీన మన పార్లమెంటు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది. మన దేశానికి చెందిన మరో 90 వేల చదరపు కిలోమీటర్ల భూమి తమదని చైనా ప్రభుత్వం చేస్తున్న వాదానికి మన ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పడం లేదు. మనపై మళ్ళీ దాడి చేయడానికి చైనా ప్రభుత్వం సర్వ సమగ్ర సైనిక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రతిఘటించడానికి వీలుగా మౌలిక సదుపాయాలను సమకూర్చుకొనడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్న జాడ లేదు.

మన సరిహద్దుల పొడవునా చైనా ప్రభుత్వం 'సుదూర ఖండాంతర లక్ష్యచ్చేదక  అణ్వస్త్ర వాహక క్షిపణుల' (ఇంటర్ కాంటినెం టల్ బాలిస్టిక్ మిస్సైల్స్ - ఐసిబిఎమ్) ను మోహరించింది. ఈ అణు క్షిపణులు మన భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించాయి. ఉపగ్రహాలను, యుద్ధనౌకలను విధ్వంసం చేయగల క్షిపణులను కూడా చైనా రూపొందించింది. 8500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగల అణ్వస్త్రాలను మోసుకొని పోగల 'జలాంతర్గాములు' అనేకం చైనా వద్ద ఉన్నాయి. 

ఈ ప్రమాదాలను ప్రతిఘటించడానికి  వలసిన రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం మనకు అనివార్యం.

మన వాణిజ్య ప్రాంగణాలలో చైనా వారి వస్తువులు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా స్వదేశీయ పరిశ్రమలు చతికిల పడి ఉన్నాయి. మన దేశం నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న వస్తువుల విలువకంటే చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న సరుకుల విలువ చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా మనం వాణిజ్య పరమైన లోటు (ట్రేడ్ డెఫిసిట్) నకు గురి అవుతున్నాము. ఈ లోటు పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. సమాచార సంచార - టెలి కమ్యూనికేషన్ల రంగంలో మొదటితరం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే మనం పెంపొందించుకో గలిగాము. రెండో తరం 'తరంగాల' స్పెక్ట్రం పరిజ్ఞానం సమగ్రంగా రూపొందనే లేదు. ఫలితంగా మూడవ తరం, నాలుగవ తరం టెలికం తరంగాల పరిజ్ఞానాన్ని చైనా నుండి దిగుమతి చేసుకొంటున్నాము. ఇలా అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని చైనా మనకు సరఫరా చేయడం వల్ల మన సమాచార దూర సంచార వ్యవస్థ గుట్టు మొత్తం ఆ దేశానికి తెలిసిపోతోంది. ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన పాటవం విషయంలో ఇలా చైనా దయాదాక్షిణ్యాలపై అతిగా ఆధారపడవలసిన దిస్థితి మన భద్రతకు ప్రమాదకరం. 

టిబెట్ నుంచి భ్రహ్మపుత్ర నదీ జలాలు మనదేశంలోనికి రాకుండా చైనా ప్రభుత్వం నిరోధించడానికి యత్నిస్తోంది. తమ దేశం నుంచి పొరుగు దేశాలలోకి ప్రవహిస్తున్న ఇతర నదులపై కూడా చైనా ప్రభుత్వం అక్రమంగా ఆనకట్టలను నిర్మించి నీటిని కాజేస్తోంది. ఇలా నదుల నీటిని మళ్ళించడం వల్ల నష్టపోతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, లావోస్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, బర్మా వంటి దేశాలతో కలిసి మన ప్రభుత్వం చైనా ప్రభుత్వాన్ని నిలదీయ గలగాలి. నదుల నీటిని న్యాయమైన రీతిలో పంచుకొనేందుకు చైనాను ఒప్పించగలగాలి. 

పాకిస్తాన్ కుట్ర 
పాకిస్తాన్ ప్రభుత్వ చర్యల వల్ల మన పడమటి సరిహద్దులకు ప్రమాదం పెరుగుతోంది. పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలోకి చొరబడుతున్న అక్రమ ప్రవేశకుల సంఖ్య గత కొన్ని నెలలుగా పెరుగుతోందని, ఉన్నత సైనిక అధికారుల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా, ఇటీవల మన ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. కాశ్మీర్ లోనే వాస్తవాధీన రేఖ వెంబడి, గత నాలుగున్నర నెలల కాలంలో డెబ్భై చొరబాటు సంఘటనలు జరిగినట్లు తెలిసింది. కొన్ని సందర్భాలలో పాకిస్తానీ ప్రభుత్వ దళాలు మన సైనికులపై కాల్పులు కూడా జరిపాయి. పాకిస్తాన్ సైనిక దళాలలో మత మౌడ్య వాద ప్రభావం పెరుగుతోంది. పాకిస్తాన్లోని అణ్వస్త్ర భాండాగారాలను  స్వాధీనం చేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది. 

అంతర్జాతీయ బీభత్సకాండను ఉసిగొల్పిన ఒసామాబిన్ లాడెన్ ఇటీవల పాకిస్తాన్ లో హతమారి పోయాడు. కానీ అంతకుముందు అనేక సంవత్సరాలపాటు బిన్ లాడెన్ సకుటుంబ సమేతంగా పాకిస్తాన్ లో సురక్షితంగా మనుగడ సాగించగలిగాడు. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం 'ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ఏజన్సీ' ఐ.ఎస్.ఐ., పాకిస్తాన్ సైన్యం అంతర్జాతీయ బీభత్స వ్యవస్థకు అండగా నిలబడి ఉన్నాయన్న సత్యానికి ఇంతకుమించిన సాక్ష్యం అక్కరలేదు. ఒసామా ఆచూకీని కనుగొనడంలో అమెరికా దళాలకు సహకరించిన ఒక డాక్టర్ పై పాకిస్తాన్ ప్రభుత్వం దేశద్రోహ నేరాన్ని ఆరోపించి విచారించడం గమనించదగిన పరిణామం.

డిల్లీ హైకోర్టు ప్రాంగణంలో ఇటీవల బాంబులు పేల్చి బీభత్సం సృష్టించింది 'ఐ.ఎస్.ఐ' వారేనని ధృవపడింది. మావోయిస్టు బీభత్స కారులకు చైనా ప్రభుత్వం సహాయాన్ని అందచేయడంలో ఐ.ఎస్.ఐ. అనుసంధాన వ్యవస్థగా పని చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ లో కర్జాయ్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెళ్ళిపోయిన తరువాత అక్కడ మళ్ళీ 'తాలిబాన్ల' ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది పాకిస్తాన్ వ్యూహం. తాలిబాన్ బీభత్సకారులు మనదేశాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబాన్ల పెత్తనం నెలకొన్నట్లయితే అది మన దేశానికి మరింత ప్రమాదకరం కాగలదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో సంభవిస్తున్న ఈ పరిణామాలను గమనించవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. కానీ మన ప్రభుత్వ స్పందన మాత్రం చాలా పేలవంగా ఉంది !

బంగ్లాదేశ్ తో సరిహద్దు సమస్యలు
గత సెప్టెంబర్లో మన ప్రభుత్వం బంగ్లాదేశ్ తో జరిపిన చర్చల సందర్భంగా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అస్సాంలోనూ, బెంగాల్ లోను, ఉన్న వేలాది ఎకరాల భూమిని బంగ్లాదేశ్ కు అప్పగించడం గర్హనీయం.  ఈ భూమి ఇదివరకే బంగ్లాదేశ్ అధీనంలో ఉందని మన ప్రభుత్వం చెప్పడం కుంటిసాకు మాత్రమే. 'ప్రాదేశిక వినిమయం' పేరుతో బంగ్లాదేశ్ కు ఎక్కువ భూమిని బదిలీ చేయడం ఆ దేశం నుంచి మన దేశానికి తక్కువ భూమిని రాబట్టడం తెలివి తక్కువ తనానికి నిదర్శనం. అనేక వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు భారతీయ పౌరులుగా పరిగణన పొందడానికి ఈ 'బదలాయింపు' దోహదం చేసింది. కూచ్ బిహార్, జల్పాయిగురి ప్రాంతంలోని ప్రజల మత నిష్పత్తిలో వైపరీత్యాలు ఏర్పడడానికి ఈ చర్య దోహదం చేసింది. దీనివల్ల ఈ ప్రాంతంలో విచ్ఛిన్నవాదం బలం పుంజుకునే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్ తో మన ప్రభుత్వం జరుపుతున్న చర్చల సందర్భంగా, మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న కోట్లాది మంది బంగ్లాదేశీయులను ఆ దేశానికి తరలించే అంశం ప్రస్తావనకు రాకపోవడం మిక్కిలి దురదృష్టకరం.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు
క్రొత్త పెత్తందార్ల మధ్య ఆధిపత్య సమరానికి హిందూ మహా సముద్రం ప్రాంతం ప్రాతిపదిక కావడం ఆందోళన కలిగిస్తున్న మరో పరిణామం. ఈ కొత్త సమరాంగణం గతంలో ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఐరోపాను తలపిస్తోంది. హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలు ప్రాకృతికమైన సంపదకు ఆలవాలమై ఉన్నాయి. ఆధిపత్య సమరంలో వ్యూహాత్మకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

హిందూసాగర ప్రాంతంలో చైనా తన నౌకా దళాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సంబంధ కార్యకలాపాలను విస్తరింపచేస్తోంది. ఈ ఆధిపత్య ధోరణి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. తీరస్థ దేశాలకు దూరంగా డియాగో గార్సియా దీవులలో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే భారతదేశానికి మరింత సమీప ప్రాంతాలలో తమ సైనిక స్థావరాలు నెలకొల్పాలన్నది అమెరికా తపన. 2003లో ఇండోనేషియా నుంచి విడివడి 'తూర్పు తైమూర్' స్వతంత్ర దేశంగా అవతరించడం, శ్రీలంక ప్రభుత్వానికీ, తమిళ ఈలం లిబరేషన్ టైగర్ - ఎల్.టి.టి.ఇ. - ముఠాకు మధ్య కొనసాగిన పోరాటం, తైవాన్ స్వాతంత్ర్య సమస్య - ఇలాంటి పరిణామాలు హిందూ సాగర ప్రాంతంలో అమెరికా చైనాల మధ్య ఆధిపత్య సమరాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇది ఉద్రిక్తతలు చెలరేగడానికి దారి తీస్తోంది. ఈ పరిస్థితులలో మనదేశం మౌన వీక్షక పాత్రను పోషించరాదని 'అఖిల భారత కార్యకారీ మండల్' అభిప్రాయపడుతోంది. మనదేశ ప్రభావం పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ప్రశాంత సుస్థిర వ్యవస్థ ఏర్పడగలదని హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలలో అధికశాతం భావిస్తున్నాయి.

తూర్పువైపుగా అన్వేషణ - లుక్ ఈస్ట్ - అన్న మన ప్రభుత్వ విధానానికి అంకురార్పణ జరిగి ఇరవై ఏళ్ళ పైబడింది. తూర్పు వైపుగా అన్వేషణ ఇకపై 'తూర్పు ప్రాంతంలో కార్యాచరణ' - యాక్ట్ ఈస్ట్ - గా పరివర్తన చెందాలని 'అఖిల భారతీయ కార్యకారీ మండల్' కోరుతోంది. తూర్పు ఆసియా ప్రాంతంలోని అధికాధిక దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునే దిశగా మన ప్రభుత్వం ఈ కార్యాచరణను చేపట్టాలి. ప్రధానంగా బర్మా, వియత్నాం వంటి దేశాలతో మన స్నేహం వర్ధిల్లాలి. 

ఇటీవలి కాలంలో దక్షిణ చైనీయ సముద్ర ప్రాంతంలో మన నౌకాదళాన్ని నిరోధించడానికి చైనా దళాలు దురుసుగా ప్రవర్తించాయి. అలాగే అరేబియా సముద్ర ప్రాంతంలో మన నౌకపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. చైనా దాని మిత్ర దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరికి ఇలాంటివి ఉదాహరణలు. పశ్చిమ పాకిస్తాన్ లోని 'గ్వాదార్' ఓడరేవు మొదలుకొని తూర్పు సముద్ర జలాలలో 'కోకో' ద్వీపాల వరకు గల సువిశాల సీమలలో చైనా యుద్ధనౌకలు నిరంతరం విహరిస్తున్నాయి. ఇలా చైనా ప్రభావం పెరగడం వల్ల మూడు వైపులా ఉన్న సముద్ర జలాలలో మన దేశానికి ముప్పు ముంచుకొస్తోంది. హిందూ మహా సముద్రంలోని నైరుతి ప్రాంతంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్  ఖనిజాల కోసం అన్వేషణ జరిపేందుకు చైనాకు హక్కులు లభించాయి. దానికోసం పదివేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని 'అంతర్జాతీయ సముద్ర నిర్వహణ సంస్థ' వారు చైనాకు అప్పగించారు. 'అన్వేషణ' సాకుతో చైనా ప్రభుత్వం తమ నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో భారీగా మోహరించే ప్రమాదం ఉంది. 

చైనా పాకిస్తాన్ల దురాక్రమణను తిప్పికొట్టగల సామర్ధ్యం మన సైనిక దళాలకు ఉంది. మన సైనికులు తమ సమర పటిమను గతంలో అనేకసార్లు నిరూపించారు. కానీ మన సైనిక దళాలు మరింత సమర్ధవంతంగా పోరాడడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చడంలో మన ప్రభుత్వం పదేపదే విఫలమౌతోంది.

సామాన్య ప్రజా హృదయాలలో పెల్లుబుకుతున్న జాతీయ ఆకాంక్షలకూ, అధికార రాజకీయ విధానాలకు మధ్య ఓ పెద్ద అఖాతం ఏర్పడి ఉంది. శాస్త్ర విజ్ఞాన పటిమ, రక్షణ సామర్ధ్యం, దేశభక్తియుతమైన జాతీయ భావస్ఫూర్తి మనకు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇవేవీ మన రాజకీయ విధాన రూపకల్పనలో ప్రస్ఫుటించడం లేదు. 

మన భద్రతకు భంగం వాటిల్లచేస్తున్న ఈ పరిణామాల నేపథ్యంలో, మన సరిహద్దుల రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. హిందూ మహా సాగర ప్రాంతంలో మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి కావలసిన చర్యలను గైకొనాలని కోరుతోంది. విచ్చిన్నకారులను, బీభత్స కారులను, అక్రమ ప్రవేశకులను అరికట్టడానికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు జరపాలని 'అఖిల భారత కార్యకారీ మండల్' ప్రభుత్వాన్ని కోరుతోంది. సమగ్ర రక్షణ యంత్రాంగాన్ని పెంపొందించాలని ఆర్ధిక, ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన స్వయంసమృద్ధి సాధనకై కృషి చేయాలని కోరుతోంది. జాతీయ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను పెంపొందించడానికి కావలసిన చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలని ఈ తీర్మానం ద్వారా 'అఖిల భారత కార్యకారీ మండల్' దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం -3

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా 

చదువుల వ్యాపారం - యువత 
మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి 7, 8 శాతం అభివృద్ధితో అగ్రదేశాల  జిడిపిని కూడా అధిగమించడం కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది ఆర్ధిక వేత్తలు  జిడిపి కొలతలు చూసి మనలను మార్కెట్ లా చూస్తున్నారు. కాని నిత్య అవసరాల అభివృద్ధి తక్షణ అవసరమున్న సమాజంగా చూడకపోవడం శోచనీయం.

ఒక వైపున కే.పి.సింగ్, డి.ఎల్.ఎఫ్.చైర్మన్ లాంటి వారు తమ పుట్టినరోజును వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి జరుపుకుంటున్న వారిని, మరోవైపు ఇల్లు, తిండి లేక బాధలు పడుతూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. స్వాతంత్ర్యం తరువాత మన దేశాన్ని దోచుకుతినే మేధావులను తయారు చేశామే కాని, మాతృదేశ ఉన్నతి గురించి తపించి పని చేయగల యువకులను తయారు చేయడంలో వెనుకపడే ఉన్నాం.

ఒకప్రక్క సత్యం రామలింగరాజు, హర్షద్ మెహతా, రాజా, గాలి వంటి బాగా చదువుకొన్నవారు కోట్లకు పైగా కుంభకోణాలు చేస్తూ, తప్పుడు పద్ధతులతో సాటి ప్రజలను మోసం చేసేందుకు తమ తెలివి తేటలను వాడుకొన్న ఉదాహరణలు, మరోప్రక్క దారిలో దొరికిన లక్షల రూపాయలను చదువురాని సామాన్యులు నిజాయితీతో అప్పగించిన సందర్భాలు చూస్తే, మన చదువులు సామాజిక సంస్కారాలనివ్వడంలో విఫలమయ్యాయని అర్ధమౌతోంది. 

1950లో తయారైన భారతదేశం యొక్క ఉన్నత విద్య విధానం వలన ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో, ఐఐటి సృష్టి,  ఐఐఎమ్ లు, సైన్సు పాశాలలు, ఆధునిక శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు మన దేశంలో మంచి ఫలితాల నిచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఇప్పటివరకు 1,40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుకొని బయటికి రాగా, వారిలో ఇప్పటివరకు 55,000 కు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. వీరి వలన అమెరికా మార్కెట్ మూలధనీకరణలో $80 బిలియన్ సృష్టించే క్రెడిట్ ని పొందినట్లు అంచనా. ఇలా మన దేశంలో తయారయిన మేధావులు ప్రపంచ మానవాళికి ఉపయోగపడటం సంతోషమైనా, వందల కోట్ల ప్రజల కడగండ్లు తీర్చడానికి ఈ మేధస్సు వినియోగించి ఉంటే భారతం బాగుపడేదని మేధోవలసలను గమనించిన వారి అంచనా. కంప్యూటర్ వల్ల ప్రపంచానికి మన శక్తియుక్తులు తెలిశాయి. భారతీయులంటే లేచి గౌరవమిచ్చే స్థాయికి ఈ అరవై నాలుగు ఏళ్ళలో మనం చేరుకున్నాం. మనం సాఫ్ట్ వేర్ లో అభివృద్ధి చెందామంటున్నా, టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీలు డాలర్ల రేట్లలో తేడాల ఆధారంగా నడిపే వ్యాపారమే మనకు గొప్పగా కనిపించడం శోచనీయం. మైక్రోసాఫ్ట్, హ్యూలెట్ ప్యాకార్డ్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్ వంటి అనేక కంపెనీలు యూనివర్శిటీ విద్యార్ధులచే స్థాపించబడి నేడు గొప్పగా నడుపబడుతున్నాయి. కాని మనదేశ యువకులలో ఇటువంటి కంపెనీలను స్థాపించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. ఇప్పటికీ డిగ్రీ చేతికొచ్చాక నేను ఉద్యోగం సంపాదించగలను అని ధైర్యంగా చెప్పే యువత ఇరవై శాతం మాత్రమే ఉండడం బాధాకరం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా చెప్పుకొంటున్న మనదేశంలోని యువకులు ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం. 

సాఫ్ట్ వేర్ తో పాటుగా, ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి, సనాతన విలువలను ప్రపంచానికి కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు వేలమంది యువకులు ప్రయత్నాలు చేయడం ఈ అరవై నాలుగు ఏళ్ళలో కలిగిన పెద్ద మార్పు.

సెక్యులరిజం పేరుతో విద్యలో జీవిత విలువలను పెంపొందించే భగవద్గీతను, అనేక ధార్మిక గ్రంథాలను మన యువకులకు పరిచయం చేయకపోవడం ఒక లోపంగా నేటి మానసిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. క్రికెట్ లో బెట్టింగ్ లు, టీట్వంటీని వ్యాపారంగా మార్చడం, అలాగే కబడ్డీ, ఫుట్ బాల్ వంటి జట్టుగా ఆడే ఆటలను మనం మరచిపోవడం అనే స్థితికి ఈ 64 ఏళ్ళ స్వతంత్ర పాలన ఉపయోగపడింది.

జగద్గురువుగా మన్ననలందుకున్న మన దేశం చదువులకోసం విదేశాలపై ఆధారపడడం మరో క్రొత్త ప్రామాణికత. మన యువత పాలకులు తమకు దూరం చేసిన స్వప్నాలను, నిజాలను నెమ్మదిగా తెలుసుకొంటున్నారు. వారు త్వరలోనే తమ లక్ష్యం చేరుకొంటారని ఆశిద్దాం.

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్. 

చదువు సంస్కారాలను మేళవించుకుంటూ ముందుకు సాగుతున్న సరస్వతీ శిశుమందిరాలు

పిల్లలకు తొలి గురువు తల్లి. తల్లి దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుని, సంస్కారాన్ని పొందుతాడు. పిల్లల పరిపూర్ణ వికాసానికి పాఠశాల స్థాయి వరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలనే లక్ష్యంతో శ్రీ సరస్వతీ విద్యా పీఠం తెలుగు మాధ్యమ పాఠశాలలను ప్రారంభించి నడిపిస్తోంది. విద్యార్ధుల పరిపూర్ణ వికాసం అంటే శారీరిక, మానసిక, బౌద్ధిక వికాసాల కనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. మన ఆంధ్ర ప్రదేశ్ లో 121 ఉన్నత పాఠశాలలను, 89 మాధ్యమిక పాఠశాలలను, 175  ప్రాథమిక పాఠశాలలను, 66 ఏకోపాధ్యాయ పాఠశాలలను నడుపుతూ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అనే సత్సంకల్పంతో కొండకోనల్లో నివసించే వనవాసీయులకు ప్రత్యేకంగా పాఠశాలలను కూడా నిర్వహిస్తోంది. కొన్ని వనవాసీ గూడాల్లో, గిరిజన తాండాల్లో, వెనుకబడిన బస్తీల్లోని పిల్లలకు భారతీయ సంస్కృతి, విద్యాభిరుచి కలగాలనే భావనతో పాఠశాలలో పనిచేస్తున్న ఆచార్యుల ఆధారంగా 109 బాలసంస్కార కేంద్రాలను నిర్వహిస్తూన్నది. ఆవాస విద్యాలయాలలో 4568 మంది వనవాసీయులకు, బీదలకు ఉచితంగా విద్యనందిస్తోంది.

మొత్తమ్మీద శ్రీ సరస్వతీ విద్యా పీఠంలో 3637 మంది ఆచార్యులు (పురుషులు 1325, మహిళలు 2313) పని చేస్తున్నారు. 65150 మంది బాల బాలికలు చదువుకుంటున్నారు. ఈ వ్యవస్థ అంతా నడవడానికి విద్యాపీఠం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్ధిక సహాయాన్ని పొందడంలేదు. ఒక్క పైసాకూడా రాదు. విద్యారంగాన్ని వ్యాపారరంగంగా మార్చుకుంటున్న నేటి రోజుల్లో విద్యాపీఠం సేవా దృక్పథంతో ముందుకు వెళుతోంది. 

ఈ సంస్థలో పని చేస్తున్న ఆచార్యులు కూడా మంచి విద్యార్హతలతో శిక్షణ పొందిన వారే. పైగా విలువలతో కూడిన విద్యనూ, జీవితాన్ని అందించడానికి విద్యాపీఠం రూపకల్పన చేసిన శిక్షణ కూడా పొంది అతి తక్కువ వేతనానికే సిద్ధపడి అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రారంభ దశలో సిద్ధాంతం కోసం, ఆశయం కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వదిలిపెట్టి ఇందులో చేరి పని చేసిన, చేస్తున్న వారెందరో ఉన్నారు. నేటికీ మరో చెట్టునో, కొమ్మనో పట్టుకొని వ్రేలాడదామని మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఈ పవిత్ర ఆశయ సాధనలో శిశుమందిరాలకే అంకితమై జీవితాన్ని సార్ధకం చేసుకుందామని పని చేస్తున్నవారు కోకొల్లలుగా ఉన్నారు.

మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతాలతో శిశుమందిరాల ఉద్యోగులు కాలం గడుపుతున్నారు. వీరందరి సంక్షేమం చూడటం సంస్థ బాధ్యత కూడా. అందుకోసమే శ్రీ సరస్వతీ విద్యాపీఠం మహా నిధికి పిలుపునిచ్చింది. 

ఈ మహానిధి సేకరణకు శ్రీ అరవిందరావు రిటైర్డు డి.జి.పి. గౌరవాధ్యక్షులుగా, జి.పుల్లారెడ్డి విద్యాసంస్థల అధిపతి శ్రీ సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ప్రాంత స్థాయిలో సమితి ఏర్పడినది. ఉద్యోగుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్ణయం చేసింది.  

 • భవిష్యనిధి, పెన్షను పథకము,
 • పరివార సంక్షేమ పథకము,
 • అకాల మరణం చెందిన ఆచార్యుల కుటుంబ భవిష్యనిధి. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకము
 • ఉద్యోగుల సంతతికి ప్రోత్సహకముగా కళాశాల విద్యకై పారితోషికములు
 • ఉద్యోగులకు విద్య, వైద్య, వివాహ, గృహ నిర్మాణ ఇత్యాది అవసరములకు వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే వ్యవస్థ
 • పదవీ విరమణ సమయంలో పారితోషికము (గ్రాట్యుటీ) అందించుట
మొదలగు కార్యక్రమములు చేపట్టబడ్డాయి. అందుకోసం నిధిని సేకరించాలని పిలుపునివ్వడం జరిగింది. 

----------------------------------------------------------------------
ఒకదేశం, గ్రామం బాగుపడాలంటే విద్యాలయాలు, దేవాలయాలు, ధర్మశాలలవంటి వాటిని సమాజమే నడుపుకుంటూ ఉండాలి.

ఉదారస్వభావులు, దాతృత్వబుద్ధి కలవారు, సహాయ సహకారాలందించాలనే కోరిక, తనకున్న దానిలో కొంత ఇవ్వాలనే మనస్తత్వం కలవారు అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళ మనస్సులు విశాలం కావాలి. జరుగుతున్న ఒక మంచి పనిని స్వయంగా చూడాలి. వారందించే సేవ యోగ్య స్థానాన్ని పొందాలి. అందుకే మహానిధి సమర్పణలో భాగస్వాములై సార్థకత పొందాలి. 
----------------------------------------------------------------------

సరిహద్దులలో పొంచి ఉన్న ప్రమాదం - నిరంతర జాగరూకతే ప్రజల కర్తవ్యం

ఆర్. ఎస్. ఎస్.అఖిల భారత కార్యకారీ మండలి తీర్మానం
గోరఖ్ పూర్ - 2011
 
వేదికపై పూజ్య సర్ సంఘచాలక్ మా. శ్రీ మోహన్జీ భాగవత్, సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి.

క్రిందటి సంచిక తరువాయి భాగం 

అంతర్జాతీయ బీభత్సకాండను ఉసిగొల్పిన ఒసామాబిన్ లాడెన్ ఇటీవల పాకిస్తాన్ లో హతమారి పోయాడు. కానీ అంతకుముందు అనేక సంవత్సరాలపాటు బిన్ లాడెన్ సకుటుంబ సమేతంగా పాకిస్తాన్ లో సురక్షితంగా మనుగడ సాగించగలిగాడు. పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం 'ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ఏజన్సీ' ఐ.ఎస్.ఐ., పాకిస్తాన్ సైన్యం అంతర్జాతీయ బీభత్స వ్యవస్థకు అండగా నిలబడి ఉన్నాయన్న సత్యానికి ఇంతకుమించిన సాక్ష్యం అక్కరలేదు. ఒసామా ఆచూకీని కనుగొనడంలో అమెరికా దళాలకు సహకరించిన ఒక డాక్టర్ పై పాకిస్తాన్ ప్రభుత్వం దేశద్రోహ నేరాన్ని ఆరోపించి విచారించడం గమనించదగిన పరిణామం.

డిల్లీ హైకోర్టు ప్రాంగణంలో ఇటీవల బాంబులు పేల్చి బీభత్సం సృష్టించింది 'ఐ.ఎస్.ఐ' వారేనని ధృవపడింది. మావోయిస్టు బీభత్స కారులకు చైనా ప్రభుత్వం సహాయాన్ని అందచేయడంలో ఐ.ఎస్.ఐ. అనుసంధాన వ్యవస్థగా పని చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్ లో కర్జాయ్ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెళ్ళిపోయిన తరువాత అక్కడ మళ్ళీ 'తాలిబాన్ల' ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నది పాకిస్తాన్ వ్యూహం. తాలిబాన్ బీభత్సకారులు మనదేశాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ తాలిబాన్ల పెత్తనం నెలకొన్నట్లయితే అది మన దేశానికి మరింత ప్రమాదకరం కాగలదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో సంభవిస్తున్న ఈ పరిణామాలను గమనించవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. కానీ మన ప్రభుత్వ స్పందన మాత్రం చాలా పేలవంగా ఉంది !

బంగ్లాదేశ్ తో సరిహద్దు సమస్యలు
గత సెప్టెంబర్లో మన ప్రభుత్వం బంగ్లాదేశ్ తో జరిపిన చర్చల సందర్భంగా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అస్సాంలోనూ, బెంగాల్ లోను, ఉన్న వేలాది ఎకరాల భూమిని బంగ్లాదేశ్ కు అప్పగించడం గర్హనీయం.  ఈ భూమి ఇదివరకే బంగ్లాదేశ్ అధీనంలో ఉందని మన ప్రభుత్వం చెప్పడం కుంటిసాకు మాత్రమే. 'ప్రాదేశిక వినిమయం' పేరుతో బంగ్లాదేశ్ కు ఎక్కువ భూమిని బదిలీ చేయడం ఆ దేశం నుంచి మన దేశానికి తక్కువ భూమిని రాబట్టడం తెలివి తక్కువ తనానికి నిదర్శనం. అనేక వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు భారతీయ పౌరులుగా పరిగణన పొందడానికి ఈ 'బదలాయింపు' దోహదం చేసింది. కూచ్ బిహార్, జల్పాయిగురి ప్రాంతంలోని ప్రజల మత నిష్పత్తిలో వైపరీత్యాలు ఏర్పడడానికి ఈ చర్య దోహదం చేసింది. దీనివల్ల ఈ ప్రాంతంలో విచ్ఛిన్నవాదం బలం పుంజుకునే ప్రమాదం పొంచి ఉంది. బంగ్లాదేశ్ తో మన ప్రభుత్వం జరుపుతున్న చర్చల సందర్భంగా, మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న కోట్లాది మంది బంగ్లాదేశీయులను ఆ దేశానికి తరలించే అంశం ప్రస్తావనకు రాకపోవడం మిక్కిలి దురదృష్టకరం.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు
క్రొత్త పెత్తందార్ల మధ్య ఆధిపత్య సమరానికి హిందూ మహా సముద్రం ప్రాంతం ప్రాతిపదిక కావడం ఆందోళన కలిగిస్తున్న మరో పరిణామం. ఈ కొత్త సమరాంగణం గతంలో ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఐరోపాను తలపిస్తోంది. హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలు ప్రాకృతికమైన సంపదకు ఆలవాలమై ఉన్నాయి. ఆధిపత్య సమరంలో వ్యూహాత్మకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. 

హిందూసాగర ప్రాంతంలో చైనా తన నౌకా దళాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సంబంధ కార్యకలాపాలను విస్తరింపచేస్తోంది. ఈ ఆధిపత్య ధోరణి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. తీరస్థ దేశాలకు దూరంగా డియాగో గార్సియా దీవులలో అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే భారతదేశానికి మరింత సమీప ప్రాంతాలలో తమ సైనిక స్థావరాలు నెలకొల్పాలన్నది అమెరికా తపన. 2003లో ఇండోనేషియా నుంచి విడివడి 'తూర్పు తైమూర్' స్వతంత్ర దేశంగా అవతరించడం, శ్రీలంక ప్రభుత్వానికీ, తమిళ ఈలం లిబరేషన్ టైగర్ - ఎల్.టి.టి.ఇ. - ముఠాకు మధ్య కొనసాగిన పోరాటం, తైవాన్ స్వాతంత్ర్య సమస్య - ఇలాంటి పరిణామాలు హిందూ సాగర ప్రాంతంలో అమెరికా చైనాల మధ్య ఆధిపత్య సమరాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇది ఉద్రిక్తతలు చెలరేగడానికి దారి తీస్తోంది. ఈ పరిస్థితులలో మనదేశం మౌన వీక్షక పాత్రను పోషించరాదని 'అఖిల భారత కార్యకారీ మండల్' అభిప్రాయపడుతోంది. మనదేశ ప్రభావం పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ప్రశాంత సుస్థిర వ్యవస్థ ఏర్పడగలదని హిందూ మహా సముద్ర తీరస్థ దేశాలలో అధికశాతం భావిస్తున్నాయి.

తూర్పువైపుగా అన్వేషణ - లుక్ ఈస్ట్ - అన్న మన ప్రభుత్వ విధానానికి అంకురార్పణ జరిగి ఇరవై ఏళ్ళ పైబడింది. తూర్పు వైపుగా అన్వేషణ ఇకపై 'తూర్పు ప్రాంతంలో కార్యాచరణ' - యాక్ట్ ఈస్ట్ - గా పరివర్తన చెందాలని 'అఖిల భారతీయ కార్యకారీ మండల్' కోరుతోంది. తూర్పు ఆసియా ప్రాంతంలోని అధికాధిక దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునే దిశగా మన ప్రభుత్వం ఈ కార్యాచరణను చేపట్టాలి. ప్రధానంగా బర్మా, వియత్నాం వంటి దేశాలతో మన స్నేహం వర్ధిల్లాలి. 

ఇటీవలి కాలంలో దక్షిణ చైనీయ సముద్ర ప్రాంతంలో మన నౌకాదళాన్ని నిరోధించడానికి చైనా దళాలు దురుసుగా ప్రవర్తించాయి. అలాగే అరేబియా సముద్ర ప్రాంతంలో మన నౌకపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. చైనా దాని మిత్ర దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరికి ఇలాంటివి ఉదాహరణలు. పశ్చిమ పాకిస్తాన్ లోని 'గ్వాదార్' ఓడరేవు మొదలుకొని తూర్పు సముద్ర జలాలలో 'కోకో' ద్వీపాల వరకు గల సువిశాల సీమలలో చైనా యుద్ధనౌకలు నిరంతరం విహరిస్తున్నాయి. ఇలా చైనా ప్రభావం పెరగడం వల్ల మూడు వైపులా ఉన్న సముద్ర జలాలలో మన దేశానికి ముప్పు ముంచుకొస్తోంది. హిందూ మహా సముద్రంలోని నైరుతి ప్రాంతంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్  ఖనిజాల కోసం అన్వేషణ జరిపేందుకు చైనాకు హక్కులు లభించాయి. దానికోసం పదివేల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని 'అంతర్జాతీయ సముద్ర నిర్వహణ సంస్థ' వారు చైనాకు అప్పగించారు. 'అన్వేషణ' సాకుతో చైనా ప్రభుత్వం తమ నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో భారీగా మోహరించే ప్రమాదం ఉంది. 

చైనా పాకిస్తాన్ల దురాక్రమణను తిప్పికొట్టగల సామర్ధ్యం మన సైనిక దళాలకు ఉంది. మన సైనికులు తమ సమర పటిమను గతంలో అనేకసార్లు నిరూపించారు. కానీ మన సైనిక దళాలు మరింత సమర్ధవంతంగా పోరాడడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చడంలో మన ప్రభుత్వం పదేపదే విఫలమౌతోంది.

సామాన్య ప్రజా హృదయాలలో పెల్లుబుకుతున్న జాతీయ ఆకాంక్షలకూ, అధికార రాజకీయ విధానాలకు మధ్య ఓ పెద్ద అఖాతం ఏర్పడి ఉంది. శాస్త్ర విజ్ఞాన పటిమ, రక్షణ సామర్ధ్యం, దేశభక్తియుతమైన జాతీయ భావస్ఫూర్తి మనకు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇవేవీ మన రాజకీయ విధాన రూపకల్పనలో ప్రస్ఫుటించడం లేదు. 

మన భద్రతకు భంగం వాటిల్లచేస్తున్న ఈ పరిణామాల నేపథ్యంలో, మన సరిహద్దుల రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా 'అఖిల భారత కార్యకారీ మండల్' కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. హిందూ మహా సాగర ప్రాంతంలో మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి కావలసిన చర్యలను గైకొనాలని కోరుతోంది. విచ్చిన్నకారులను, బీభత్స కారులను, అక్రమ ప్రవేశకులను అరికట్టడానికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు జరపాలని 'అఖిల భారత కార్యకారీ మండల్' ప్రభుత్వాన్ని కోరుతోంది. సమగ్ర రక్షణ యంత్రాంగాన్ని పెంపొందించాలని ఆర్ధిక, ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన స్వయంసమృద్ధి సాధనకై కృషి చేయాలని కోరుతోంది. జాతీయ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను పెంపొందించడానికి కావలసిన చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలని ఈ తీర్మానం ద్వారా 'అఖిల భారత కార్యకారీ మండల్' దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.   

మండుతున్న పెట్రోలు ధరలు

పెట్రోలుకు మండే ధర్మం ఉన్నది. కాని మన దేశంలో పెట్రోలుకంటే దాని ధరలే ఎక్కువగా మండుతున్నాయి. గత ఏడాది ఏప్రియల్ మాసం నుండి ఇప్పటి దాకా చూసుకుంటే వివిధ దేశాలలో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

పాకిస్తాన్ రూ.48.64 

శ్రీలంక    రూ.61.38

నేపాల్    రూ.65.26

భారత్    రూ.66.42

ఇది కూడా నవంబర్ 16 నాడు తగ్గించిన రూ.2.22 ను లెక్కలోకి తీసుకున్న తర్వాతే. మన దగ్గర నుండి పెట్రోలు దిగుమతి చేసుకుంటున్న నేపాల్ లీటరుకు రూ.65.26 కే వారి ప్రజలకు అందిస్తోంది. మన పెట్రోలు ధర ఇంత ఎక్కువ ఉండడానికి కారణం 45 శాతం పన్నులు. నిజానికి రిఫైనరీ ధర లీటరు పెట్రోలుకు రూ.36.82 మాత్రమే. పై విషయాలు నవంబర్ 23 న పార్లమెంటులో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.యెన్.సింగ్ ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. 

ఈనాడు 24/11/2011 - 5 వ పుట
-ధర్మపాలుడు

మన చరిత్రను తెలుసుకొందాం - 12వ భాగం

ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.

ఖలీఫా కోసం ఉద్యమాన్ని పణంగా పెట్టిన గాంధీజీ
అప్పుడు టర్కీ సుల్తాను విస్తార సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఖలీఫా అనే బిరుదును వహించి ఉండేవాడు. ఖలీఫా అంటే ప్రపంచ ముస్లిం ప్రజానీకానికి అధిపతి, భూమిపై అల్లా ఛాయ అని భావించేవారు. క్రీ.శ. 1914 నుంచి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఇంగ్లాండుకు వ్యతిరేక పక్షంలో పోరాడి ఓటమి చెందింది. ఈ పరిస్థితిలో భారత దేశంలోని ముస్లిం నేతలు టర్కీ సామ్రాజ్యపు సరిహద్దులను, ఖలీఫా యొక్క అధికారాలను యథాతథంగా ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆరంభించారు. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే భారత ముస్లింలు స్వాతంత్ర్య పోరాటంలో సహకరిస్తారని, హిందువుల పట్ల స్నేహాన్ని అవలంబిస్తారని, గోవధను తమంత తామే మానుకుంటారని భావించిన గాంధీజీ ఎందరు అడ్డు చెప్పినా వినకుండా ఖలీఫా పీఠ
పు ఉనికి భారత జాతీయ సమస్య అయినట్లుగా కాంగ్రెస్ పార్టీని, భారత ప్రజలను ఆ ఉద్యమంలోకి దించాడు. తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమానికి జోడించి నడిపాడు. కాని ప్రపంచ యుద్ధపు ఒప్పందాలను శాసించే బలం ఈ ఉద్యమానికెక్కడుంది? టర్కీ సామ్రాజ్యం ముక్కలు ముక్కలుగా చేయబడి సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, సిరియా, జోర్డాన్, యెమెన్, బిమన్ మొదలైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఖలీఫా పదవి రద్దు చేయబడి టర్కీ 1923 లో ఒక రిపబ్లిక్ గా అవతరించింది. 

మోఫ్లా మారణకాండ - పాఠాలు నేర్వని గాంధీజీ
ఖిలాఫత్ ఉద్యమం చివరి దశలో కేరళలోని మోఫ్లా జాతి ముస్లింలు ఆంగ్ల ప్రభుత్వంపై జిహాద్ ప్రకటించారు. ఆ విప్లవాన్ని బ్రిటీష్ ప్రభుత్వం కఠినంగా అణచి వేసింది. 2226 మంది జిహాదీ మోఫ్లాలు వధించబడ్డారు. ఈ వైఫల్యం వల్ల కలిగిన ఆగ్రహాన్ని మోఫ్లాలు అప్పటి వరకు తమతో సహకరించిన హిందువులపై వెళ్ళగ్రక్కారు. 1500 మంది హిందువులను హత్య చేశారు. 20 వేల మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. హిందూ స్త్రీలపై జరిగిన మానభంగాలకు, అపహరణలకు లెక్కే లేదు. ఇస్లామిక్ మత భావనలను సంతుష్టి పరచడం ద్వారా హిందూ ముస్లిం ఐక్యతను సాధించ గలనన్న గాంధీజీ నమ్మకం ఇలా బెడిసి కొట్టింది. అయన "నేను హిమాలయమంత పొరపాటు చేశాను" అని తరువాత ప్రకటించాడు. కాని ఆ పొరపాటును ఎప్పుడూ సరిదిద్దుకోలేదు. 

ముస్లిం సంతుష్టీకరణకే ప్రాధాన్యత
జాతీయ విప్లవ గీతమైన "వందేమాతరం" పట్ల ముస్లింలు అయిష్టత ప్రకటించడంతో గాంధీజీ ఆ గీతం యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించాడు. శివాజీ, రాణాప్రతాప్, గురుగోవింద్ సింగ్ వంటి జాతీయ వీరులు ముస్లింలకు అప్రియమైన వారన్న కారణంతో కాంగ్రెస్ వేదికలపై వారి ప్రస్తావన, ప్రశంసలను మానిపించాడు. భారత్ లో గాంధీజీ ఆరంభించిన ఉద్యమాన్ని ఈ విధంగా మొదటి దశలోనే ఇస్లాం మతతత్వం హైజాక్ చేసేసి దానిపై తన ముద్ర వేసింది. 
 
జాతిని నడిపించలేని జాతీయ ఉద్యమాలు
ఆ తరువాత గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాలను నిర్వహించాడు. వాటితో ఆయనకు వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలు, మహాత్ముడు అన్న బిరుదు వచ్చాయి గాని దేశానికి స్వాతంత్ర్యం రాలేదు.

మహమ్మదాలీ జిన్నా - పాకిస్తాన్ డిమాండ్
అప్పటి వరకు జాతీయవాదిగా, మతతత్వానికి వ్యతిరేకిగా ఉన్న మహమ్మదాలీజిన్నా ముస్లిం లీగులో చేరి దానికి అధ్యక్షుడై "ముస్లింలు, హిందువులు - రెండు వేరు వేరు జాతులు. ముస్లింలకు ప్రత్యేక రాజ్యంగా పాకిస్తాన్ కావాలి" అని డిమాండ్ చేశాడు.
 
ఇంగ్లాండ్ భిక్ష - గాంధీజీ నిస్సహాయ స్థితి
ఇంగ్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచింది గాని ఆర్ధికంగా బలహీనపడి ప్రపంచంలోని తన వలసలను నిర్వహించుకునే శక్తిని కోల్పోయింది. ఆ కారణంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదలచుకున్నారు. ఆ పరిస్థితిలోనే ముస్లిం లీగు వేర్పాటు వాదం తలెత్తింది. 1944 సెప్టెంబర్ 9వ తేదీన బొంబాయిలో గాంధీజీ జిన్నాను కలుసుకున్నాడు. ముందు స్వాతంత్ర్యం వచ్చేందుకు కాంగ్రెసుతో సహకరించవలసిందని, తరువాత పాకిస్తాన్ ను ఏర్పాటు చేసుకోవచ్చునని జిన్నాను అర్ధించాడు. కాని జిన్నా అంగీకరించలేదు. ముందుగానే పాకిస్తాన్ ఏర్పాటు జరగాలని పట్టుపట్టాడు. హిందువులు, ముస్లింలు వేరు వేరు జాతులన్న విషయాన్ని అంగీకరించవలసిందని జిన్నా కోరాడు. భారత ముస్లింలలో అత్యధికులు మొదట హిందువులై ఉండి తరువాత మతం మార్చబడ్డ వారేనని, కనుక హిందువులు, ముస్లింలు వేరు వేరు జాతులు కాదని గాంధీజీ అన్నారు. మూడు వారాల పాటు జరిగిన గాంధీ - జిన్నా చర్చలు విఫలమయ్యాయి. ఆ తరువాత గాంధీజీ "మధ్యంతర ప్రభుత్వంలో జిన్నానే ప్రధాన మంత్రిగా చెయ్యండి, మంత్రి వర్గంలో అందరినీ ముస్లింలనే నియమించుకోమనండి, నాకు సమ్మతమే" అని వైస్రాయితో అన్నాడు. కాని జిన్నా దీనికి కూడా ఒప్పుకోలేదు. తనకు కావలసింది దేశ విభజనే అన్నాడు. 
 
హిందువులపై ప్రత్యక్ష చర్య - ముక్కలైన భారత్
పాకిస్తాన్ సాధనకై ప్రత్యక్ష చర్య సాగించవలసిందని జిన్నా ముస్లింలకు పిలుపునిచ్చాడు. 1946 ఆగస్టు 16 నుంచి ముస్లింలు హిందువులపై హత్యలు, దహనకాండ, మానభంగాలు, దోపిడీలు పెద్ద ఎత్తున ఆరంభించారు. బ్రిటిష్ సాయుధ బలగాలు కలగచేసుకోలేదు. అహింసతో సమస్తం సాధించవచ్చని, సత్యాగ్రహం తిరుగులేని ఆయుధమని తాను నమ్మి, ప్రజలను నమ్మించిన గాంధీజీ వద్ద ఈ పరిస్థితిని ఎదుర్కొనే వ్యూహం లేకపోయింది. చివరకు దేశ విభజన జరిగిపోయింది. గత శతాబ్దాలలో విదేశీ మూకల ఆక్రమణలు, నిర్బంధ మత మార్పిడులు అత్యధికంగా జరిగిన ప్రాంతాలు పాకిస్తాన్ పేరుతో ప్రత్యేక ముస్లిం రాజ్యంగా ఏర్పడ్డాయి. 

మిగిలిన భారత్ కూడా హిందువులది కాలేదు
మిగిలిన భారతదేశం కూడా హిందూ రాజ్యం కాలేదు. ఇక్కడ మైనార్టీల పేరుతో ఇక్కడే ఉండిపోయిన ముస్లింలకు క్రైస్తవులకు కూడా ప్రత్యేక హక్కులు, మత మార్పిడి సౌకర్యాలు ఏర్పడ్డాయి. హిందుత్వాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం అన్న అర్థం ఆచరణలోకి వచ్చింది. క్రైస్తవ, ముస్లిం మనోభావాలను సంతుష్టి పరుస్తూ హిందుత్వాన్ని బలిపెట్టడమే ఓటు రాజకీయాలలో పైకి రావడానికి మార్గంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. హిందువు, హిందుత్వం అనే మాటలు అగౌరవకరమైన పదాలై పోయాయి.

రామజన్మభూమి ఉద్యమం
ఈ పరిస్థితులలో రామజన్మభూమి ఉద్యమం ఒక ప్రత్యేకమైన, ప్రాముఖ్యం గల సంఘటన. 
పదహారవ శతాబ్దిలో బాబరు సేనాపతి అయోధ్య లోని రామాలయాన్ని కూల్చి దాని స్థానంలో మసీదును నిర్మించినప్పటి నుంచీ (దానినే బాబరీ మసీదు అంటారు.) హిందువులు ఆ స్థలం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తరతరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక హిందుత్వ సంస్థలు అదే ఉద్యమాన్ని చేపట్టాయి. కాని ముస్లిం సంతుష్టీకరణను పరిపాలనా విధానంగా అనుసరిస్తున్న ప్రభుత్వం దోపిడీ సొత్తు దోపిడీ దారుకే చెందాలన్న సిద్ధాంతంతో ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి సమ్మతించలేదు. దీనితో హిందూ సమాజంలో ఆగ్రహం ఉవ్వెత్తున లేచింది. 1992 డిశంబరు 6వ తేదీన హిందుత్వ ఉద్యమకారులు రామజన్మభూమిలోని బాబరీ కట్టడాన్ని కూల్చివేశారు. దేశ రాజకీయాలలో హిందుత్వవాదం బలం పుంజుకుంది. కాని అది కొంతమేరకే. ఎందుకంటే ఈ ఉద్యమం ఒక హిందూ దేవాలయం యొక్క పునరుద్ధరణను మాత్రమే కోరుతూ సాగింది గాని దేవాలయ విధ్వంసకాండ వెనుక గల మనస్తత్వాన్ని, సిద్ధాంత జాలాన్ని సమగ్రంగా ఖండిస్తూ, అందులో పరివర్తన కోరుతూ సాగలేదు. అందుచేత హిందూ సమాజంలో కలిగిన జాగృతి అసంపూర్ణంగానూ, అసమగ్రంగానూ ఉండిపోయింది. ఇస్లాం మనస్తత్వంలో అపరాధ భావన, పరమతాల పట్ల సామరస్య భావన అనేది ఏర్పడలేదు. 

పెరిగిపోతున్న ఇస్లాం, క్రైస్తవాల ఆగడాలు
ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ మతశక్తులు, కాశ్మీర్ లో ఇస్లాం మతశక్తులు వేర్పాటువాదాన్ని రాజేస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి దేశంలో తిష్ఠ వేసిన 2 కోట్ల ముస్లింలను వెనక్కు పంపగల పరిస్థితి కనబడడం లేదు. దేశంలోని తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ తోడ్పాటునందిస్తూ విధ్వంసాలు జరిపిస్తోంది. ఇస్లామిక్ మదరసాలు ముస్లిం బాలలకు హిందువులపై ద్వేషాన్ని, కాఫిర్ జిహాద్ భావనలను ఉగ్గుపాలతో నూరిపోస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలు విదేశీ నిధులతో యధేచ్చగా మతమార్పిడులు సాగిస్తున్నారు. మతమార్పిడి అవకాశాలు సృష్టించుకోవడం కోసమే విద్యా సంస్థలను, ఆసుపత్రులను, సేవా సంస్థలను నడుపుతున్నారు. దేశాన్ని ఏలుతున్న రాజకీయ వర్గం హిందూ ధర్మాన్ని ధ్వంసం చెయ్యడమే సాంస్కృతిక విధానంగా, కుంభకోణాలే ఆర్థిక విధానంగా, అవినీతే పరిపాలనా విధానంగా మనుగడ సాగిస్తోంది.
 
నేటి సంతానంపై భారత్ భవిష్యత్తు
ఇస్లాం, క్రైస్తవ మతాల విద్వేష శీలతను ఎదుర్కొని నిలద్రొక్కుకోవడానికి  భారతీయత, హిందుత్వం సాగిస్తున్న పోరాటమే గత వెయ్యేళ్ళ భారతదేశ చరిత్ర. ఈ కాల ఖండంలో హిందువులు తమ మాతృభూమిలో మూడవ భాగాన్ని కోల్పోయారు, తమ సోదర ప్రజలలో మూడవ వంతును ఆ విదేశీ మతాలకు వదులుకున్నారు. ఇకనైనా భారత భవిష్యత్తు ఎలా ఉంటుందనేది భారతమాత నేటి సంతానపు సంకల్ప శక్తి పైన, సామర్ధ్యం పైన ఆధారపడి ఉంది. 

- మణి
- సమాప్తం
-------------------------------------------------------------------------------------
రచయితకు ధన్యవాదములు
ధారావాహికంగా వెలువడిన "మన చరిత్రను తెలుసుకొందాం" శీర్షిక ఈ మాసంతో ముగిసినది. దీనిని సంక్షిప్తంగా, సమగ్రంగా అందించిన శ్రీ మణిగారికి లోకహితం సంపాదకవర్గం ధన్యవాదములు తెలుపుతున్నది.

ఈ శీర్షిక ఎలా ఉన్నదనే విషయంపై పాకులు తమ అభిప్రాయాలను ఈ క్రింద కామెంటు రూపంలో గాని, లేదా editor@lokahitham.net కు మెయిల్ చేయడం ద్వారా గాని తెలుపగలరు.   

చిల్లర వ్యాపారంలోకి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్న కేంద్ర ప్రభుత్వం

కలియుగాబ్ది 5113 , శ్రీ ఖర నామ సంవత్సరం, మార్గశిర మాసం

దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నా, UPA భాగస్వామ్య పక్షాల నుండి అభ్యంతరం వ్యక్తమవుతున్నప్పటికీ చిల్లర (రిటైల్) వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడంలో వెనక్కు తగ్గేది లేదని, అవసరమైతే మధ్యంతర ఎన్నికలకు సిద్ధమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేసినట్లు డిశంబర్ 2 నాటి దినపత్రికలలో వచ్చింది. అంటే దేశంలోని నాలుగు కోట్లకు పైగా చిల్లర వ్యాపారులు బజారున పడినా ఫర్వాలేదనుకుంటున్నారు  మన ప్రధాని. 

దేశానికి భారం కాకుండా బ్రతుకుతున్న చిల్లర వ్యాపారులను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు గతంలో మేము వ్రాశాము. ఆ నిర్ణయం తీసుకోవటానికి ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నట్లు ఇప్పటి పరిస్థితులను బట్టి అర్ధమవుతున్నది.

చిల్లర వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానిస్తే దేశంలో అదనంగా కోటిమందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నదని ఆశ చూపుతున్నారు. ఇది యెట్లా సాధ్యమవుతుందో మాత్రం చెప్పటం లేదు. ఒక ప్రక్క నిరుద్యోగులకు ఈ రకమైన ఆశలు చూపిస్తూ మరోప్రక్క తమ వ్యాపారం తాము చేసుకొంటూ స్వతంత్రంగా బ్రతుకుతున్న వారి స్వతంత్రాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాలనుకొంటున్నది  ఈ ప్రభుత్వం. చిల్లర వ్యాపార రంగంలో విదేశీ సంస్థలు ప్రవేశిస్తే ద్రవ్యోల్బణం తగ్గిపోతుందని రిజర్వ్ బ్యాంకు వారి కథనం. ఇది ఎట్లా అనేది చెప్పదు. అంటే ప్రజలను మభ్య పెట్టేందుకు రకరకాల ఆశలు చూపిస్తున్నారు. ఏతావాతా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల ప్రభావం ఎట్లా ఉంది అంటే భయంకరంగా ఉన్నాయి. గ్రామాలలో వ్యవసాయం చేసుకోవటం, చిన్న చిన్న పనులు చేసుకోవటం కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామ జీవనంలో పరస్పర విశ్వాసం దూరమవుతున్నది. 1890 -1950 మధ్య కాలం నాటి గ్రామాల పరిస్థితులు వివరిస్తూ విశ్వనాధ సత్యనారాయణ వ్రాసిన "శార్వరి నుండి శార్వరి వరకు" అనే సామాజిక నవలలలో "గ్రామాలలో పాలు లేవు, దొరకటం లేదు, సోడాలు మాత్రం దొరుకుతున్నాయి, పండ్లు కూరగాయలకు బదులు చాకిలెట్లు, కూల్ డ్రింకులు దొరుకుతున్నాయి" అని వ్రాశారు. నేటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితులు ప్రజల జీవన విలువలు, సంస్కారాలను నాశనం చేసే ప్రక్రియను వేగం చేయటానికి దారి తీస్తున్నవి.

64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా

భారతదేశం భవిష్యత్తుపై ఆశతో, సమాజ శరీరానికి అయ్యిన గాయాలతో.. నెత్తురోడుస్తూ.. మౌంట్ బాటెన్ కుయుక్తులతో.. మత పరంగా విభజింపబడి.., లక్షలాది శవాల మధ్యన.. 1947 ఆగస్టు 15 న బ్రిటిషు వారి నుండి స్వాతంత్ర్యాన్ని పొంది 1950 లో రాజ్యాంగాన్ని నిర్మించికొని సకల మర్యాదలతో మౌంట్ బాటెన్ కు వీడ్కోలు పలికింది. 

సర్దార్ పటేల్ మొక్కవోని దీక్షతో విడిపోయిన హృదయాలను అతికించి, జన సామాన్యాన్ని కలిపారు. 1951 అక్టోబర్ 25 న రాజ్యాంగం అనే నిబద్ధతను ఏర్పరచుకొని రాజకీయ విలువలను ఏర్పరిచే ప్రయత్నంతో మొట్టమొదటి ఎన్నికలను హిమాచల్ ప్రదేశ్ లో చీని, అంగీ అనే వోటర్లు వోటు వేయడంతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజం పడింది. 

1951 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఒక వోటుకు కేవలం 98  పైసలు ఖర్చయ్యాయి. ఈ ఎన్నికలలో 2438 మంది ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు పోటీ పడ్డారు. పదిహేడు కోట్ల మంది వోటర్లు మొదటి పార్లమెంటు ఎన్నికలలో వోటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, నెహ్రు, జయప్రకాశ్ నారాయణ వంటి హేమాహేమీలు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్యానికి ఊపిరులూదేందుకు కృషి చేశారు. 

శాంతీ-శాంతీ అనే భ్రమ, ప్రపంచ నిజాలు 1962 చైనా యుద్ధంతో నెహ్రూకు తెలిసొచ్చాయి. ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో జైజవాన్ - జైకిసాన్ నినాదంతో కర్షకుడికి, యుద్ధంలోని సైనికుడికి గౌరవమిచ్చే సమాజ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. హరిత విప్లవంతో దిగుబడి పెంచి వ్యవసాయం లాభ దాయకమయ్యేలా, అందరికీ ఆహారం అందేలా ప్రణాళికల స్వరూపాన్ని లాల్ బహదూర్ నాయకత్వం రెండేళ్లలో దేశానికి అందించింది.

అనుమానాస్పద పరిస్థితులలో శాస్త్రీజీ మరణించడంతో ఇందిర ప్రధానిగా ఎన్నికైంది. 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం జరిగినప్పుడు ఇందిర తెగువ చూపి బంగ్లాదేశ్ కు ప్రాణం పోసినా, మరల శాంతి మాయలో చిక్కుకొని కాశ్మీర్ గాయాన్ని మాన్పించే చక్కటి అవకాశాన్ని వదులుకొని కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ ను వదిలిపెట్టింది. అప్పటి వరకూ ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకున్న ప్రజాస్వామ్యం.. 1975 లో స్వార్ధ ప్రయోజనాల కోసం, నియంతృత్వ పోకడలతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య జీవనాన్ని అపహాస్యం చేస్తూ స్వేచ్చాయుత జీవనాన్ని చీకట్లోకి నెడుతూ, ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఎమర్జెన్సీని విధించడంతో..

సహజంగా చలిత పరిణామం కలిగిన, వెలుతురుని ప్రేమించే సగటు భారతీయుడు సృష్టించిన అలల తుఫానుకు, యువరక్తపు చైతన్యములో ఎగిసిన అలలు సమాజ సముద్రం లో ప్రజాస్వామ్య తుఫానుగా మారి, ఎమర్జెన్సీ తొలగి 1977 లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తరువాత రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్ర శేఖర్, పీవీ నరసింహారావు, దేవగౌడ, అటల్ బిహారీ వాజపాయ్ ల సారధ్యములో ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పాఠాలను నేర్చుకొంటూ ఇటలీ వనితను ప్రధాని కాకుండా ఈ ప్రజాస్వామ్యం అడ్డుకోగలిగి, ప్రస్తుతం మన్మోహన్తో కలిపి ఇప్పటి వరకూ 13 మంది ప్రధాన మంత్రులను, 370 కి పైగా ముఖ్యమంత్రులను, 7900 లకు పైగా పార్లమెంటు సభ్యులను, 50100 కి పైగా ఎం.ఎల్.ఏ. లను ఎన్నుకొని బహుముఖ ఆలోచనలతో, స్వేచ్ఛాయుత  సమాజంతో అందరినీ కలుపుకొంటూ, 80 % వోటర్ల హాజరుతో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కుగ్రామంలోని వోటరు అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ, వోటరు గుర్తింపు కార్డులతో, సరికొత్త వోటింగు యంత్రాలతో, ఒకవైపు ఆరోపణలతో, రిగ్గింగులతో, విభజన రాజకీయాలతో, మరొక వైపు స్వేచ్చతో, ఐక్యతతో, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఎగ్జిట్ పోల్ ని అవహేళన చేస్తూ వోటరు దేవుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూనే ఉన్నాడు.

కులాల శాతానికి, మతాల బుజ్జగింపులకు తాను లొంగనని, స్వచ్ఛమైన నాయకత్వం ఉంటే మార్పు తెస్తానని వోటర్లు ఎన్నోసార్లు రుజువు చేసారు...,

1951 లో వోటుకు 98 పైసలు ఖర్చు అయితే ఇప్పుడు వోటుకు 250 రూపాయలు ఖర్చు కావడం విశేషం. అరవై ఏళ్ళయినా గరీభీ హఠావో నినాదం ఇంకా ఒక అజెండాగా ఉండడం మనం తీవ్రంగా ప్రశ్నించుకోవలసిన  విషయం.

ఆశావహ భారతదేశంలో దాగని నిరాశ  
అరవై నాలుగు సంవత్సరాల భారతావనిలో గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అనే ఆశ ఒక స్వప్నంలా కనబడటానికి కారణాలు అనేకం. 

స్వతంత్ర భారతావని ఎలా ఉండాలో గాంధీజీ యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరూ సమగ్రంగా అభివృద్ధి ఫలాలను అనుభవించాలని కోరుకొన్నారు. వివేకానంద దేశంలో కుక్కపిల్ల కూడా ఆహారం లేకుండా మరణించరాదనీ కోరుకున్నారు.

దేశంలో దారిద్ర్యం ఒకవైపు, సంపన్నుల వృద్ధి మరోవైపు నాణేనికి రెండు పార్శ్వాలుగా వృద్ధి చెందాయి. ఒక వైపు అంబానీలు నిమిషానికి 25 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మరో వైపు లక్షది మంది గంటకు ఐదు పైసలు కూడా సంపాదించలేని పరిస్థితి. 

భారతదేశంలో ఉండటానికి ఇల్లు, కడుపు నిండా తిండి, వైద్యం చేయించుకోగల స్థోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేనివారంతా పేదవారే. కాని మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారతదేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేకమంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా వంటి నయం చేయగల జబ్బులతో కూడా చనిపోతున్న వారు అనేకమంది ఉన్నారు.  ఉండటానికి చోటు లేక, ప్లాట్ ఫాంల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్ల పక్కన తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేసుకున్న వారు ప్రతి పట్నంలోనూ కనిపిస్తారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని దొరకనివారు కోట్లాదిమంది ఉన్నారు. ప్రణాళికా సంఘం లెక్క ప్రకారం భారతదేశంలోని 122  కోట్ల మంది జనాభాలో కేవలం 37 శాతం మందే పేదలు!

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని పరిగణించడానికి ప్రాతిపదిక ఏమిటని కోర్టు ప్రశ్నించగా, ప్రణాళికా సంఘం తన ప్రాతిపదికను వెల్లడించింది. దాని ప్రకారం (ద్రవ్యోల్బణంతో  సర్దుబాటు చేస్తే) పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి నెలకు 578 రూపాయలు (13 డాలర్లు) కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగినట్లయితే అతను దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. అంటే రోజుకు రూ. 20 కంటే తక్కువ. గ్రామంలో ఐతే రోజుకు రూ.15 కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే అతను పేదవాడు కాదు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వ సహాయానికి అనర్హుడు. 

45  శాతం కటిక పేదలుగానూ 80 శాతం మంది సాధారణ పేదలుగానూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన లెక్క తేలినట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది. అంటే భారతదేశంలో నూటికి 80 మంది 2 డాలర్ల సంపాదనతో బతుకులు వెళ్ళ దీస్తున్నారు. భారతదేశంలో జరిగిన వివిధ అధ్యయనాలు కనీస జీవనానికి రూ.40000 (నలభై వేలు) నుండి రూ.60000 (అరవై వేలు) వరకూ అవసరమని నిర్దారించాయని ప్రణాళికా సంఘం పత్రం ద్వారా తెలుస్తోంది. నిజానికి పెరుగుతున్న ధరలు, వాతావరణ కాలుష్యం వలన ఎదురౌతున్న జబ్బుల నుండి రక్షణ, చదువుల ఖరీదు ఇవన్నీ కలిపితే వారి అంచనాలు కూడా సరిపోవు. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో దరిద్రుల నిర్మూలన జరుగుతుంది తప్ప దారిద్ర్య నిర్మూలన మాత్రం జరగదు. 

మనం సమరస భారతాన్ని ఒకరికి మరొకరు సహకారమిచ్చుకొంటూ నిర్మించుకోవాలి, రామరాజ్య నిర్మాణంలో విద్వేష పూరిత అసమానతలు ఆధారంగా కాదని ప్రతి వ్యక్తి తన కళను సాకారం చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనే నిజాన్ని తెలియపరచాలి. అసలైన అవకాశ కల్పనను నిర్లక్ష్యం చేసి, వోట్ల కోసం పేదలను ఉపయోగించుకోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. దారిద్ర్యం తొలగిస్తామనే పేరుతో అనేక రకాల పథకాలతో వర్గాల మధ్య చిచ్చు పెట్టే శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకొంటున్నాయి. కాని ఈ పథకాల వల్ల పేదలకు, నిరుపేదలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లు నిరూపించాయి. 

చదువుల వ్యాపారం - యువత 
మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి 7, 8 శాతం అభివృద్ధితో అగ్రదేశాల  జిడిపిని కూడా అధిగమించడం కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది ఆర్ధిక వేత్తలు  జిడిపి కొలతలు చూసి మనలను మార్కెట్ లా చూస్తున్నారు. కాని నిత్య అవసరాల అభివృద్ధి తక్షణ అవసరమున్న సమాజంగా చూడకపోవడం శోచనీయం.

ఒక వైపున కే.పి.సింగ్, డి.ఎల్.ఎఫ్.చైర్మన్ లాంటి వారు తమ పుట్టినరోజును వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి జరుపుకుంటున్న వారిని, మరోవైపు ఇల్లు, తిండి లేక బాధలు పడుతూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. స్వాతంత్ర్యం తరువాత మన దేశాన్ని దోచుకుతినే మేధావులను తయారు చేశామే కాని, మాతృదేశ ఉన్నతి గురించి తపించి పని చేయగల యువకులను తయారు చేయడంలో వెనుకపడే ఉన్నాం.

ఒకప్రక్క సత్యం రామలింగరాజు, హర్షద్ మెహతా, రాజా, గాలి వంటి బాగా చదువుకొన్నవారు కోట్లకు పైగా కుంభకోణాలు చేస్తూ, తప్పుడు పద్ధతులతో సాటి ప్రజలను మోసం చేసేందుకు తమ తెలివి తేటలను వాడుకొన్న ఉదాహరణలు, మరోప్రక్క దారిలో దొరికిన లక్షల రూపాయలను చదువురాని సామాన్యులు నిజాయితీతో అప్పగించిన సందర్భాలు చూస్తే, మన చదువులు సామాజిక సంస్కారాలనివ్వడంలో విఫలమయ్యాయని అర్ధమౌతోంది. 

1950లో తయారైన భారతదేశం యొక్క ఉన్నత విద్య విధానం వలన ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో, ఐఐటి సృష్టి,  ఐఐఎమ్ లు, సైన్సు పా
ఠశాలలు, ఆధునిక శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు మన దేశంలో మంచి ఫలితాల నిచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఇప్పటివరకు 1,40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుకొని బయటికి రాగా, వారిలో ఇప్పటివరకు 55,000 కు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. వీరి వలన అమెరికా మార్కెట్ మూలధనీకరణలో $80 బిలియన్ సృష్టించే క్రెడిట్ ని పొందినట్లు అంచనా. ఇలా మన దేశంలో తయారయిన మేధావులు ప్రపంచ మానవాళికి ఉపయోగపడటం సంతోషమైనా, వందల కోట్ల ప్రజల కడగండ్లు తీర్చడానికి ఈ మేధస్సు వినియోగించి ఉంటే భారతం బాగుపడేదని మేధోవలసలను గమనించిన వారి అంచనా. కంప్యూటర్ వల్ల ప్రపంచానికి మన శక్తియుక్తులు తెలిశాయి. భారతీయులంటే లేచి గౌరవమిచ్చే స్థాయికి ఈ అరవై నాలుగు ఏళ్ళలో మనం చేరుకున్నాం. మనం సాఫ్ట్ వేర్ లో అభివృద్ధి చెందామంటున్నా, టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీలు డాలర్ల రేట్లలో తేడాల ఆధారంగా నడిపే వ్యాపారమే మనకు గొప్పగా కనిపించడం శోచనీయం. మైక్రోసాఫ్ట్, హ్యూలెట్ ప్యాకార్డ్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్ వంటి అనేక కంపెనీలు యూనివర్శిటీ విద్యార్ధులచే స్థాపించబడి నేడు గొప్పగా నడుపబడుతున్నాయి. కాని మనదేశ యువకులలో ఇటువంటి కంపెనీలను స్థాపించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. ఇప్పటికీ డిగ్రీ చేతికొచ్చాక నేను ఉద్యోగం సంపాదించగలను అని ధైర్యంగా చెప్పే యువత ఇరవై శాతం మాత్రమే ఉండడం బాధాకరం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా చెప్పుకొంటున్న మనదేశంలోని యువకులు ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం.

సాఫ్ట్ వేర్ తో పాటుగా, ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి, సనాతన విలువలను ప్రపంచానికి కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు వేలమంది యువకులు ప్రయత్నాలు చేయడం ఈ అరవై నాలుగు ఏళ్ళలో కలిగిన పెద్ద మార్పు.

సెక్యులరిజం పేరుతో విద్యలో జీవిత విలువలను పెంపొందించే భగవద్గీతను, అనేక ధార్మిక గ్రంథాలను మన యువకులకు పరిచయం చేయకపోవడం ఒక లోపంగా నేటి మానసిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. క్రికెట్ లో బెట్టింగ్ లు, టీట్వంటీని వ్యాపారంగా మార్చడం, అలాగే కబడ్డీ, ఫుట్ బాల్ వంటి జట్టుగా ఆడే ఆటలను మనం మరచిపోవడం అనే స్థితికి ఈ 64 ఏళ్ళ స్వతంత్ర పాలన ఉపయోగపడింది.
 
జగద్గురువుగా మన్ననలందుకున్న మన దేశం చదువులకోసం విదేశాలపై ఆధారపడడం మరో క్రొత్త ప్రామాణికత. మన యువత పాలకులు తమకు దూరం చేసిన స్వప్నాలను, నిజాలను నెమ్మదిగా తెలుసుకొంటున్నారు. వారు త్వరలోనే తమ లక్ష్యం చేరుకొంటారని ఆశిద్దాం. 

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్.

దయ్యాలు పిశాచాలు యోగం చేస్తాయి

"భూమి" బల్ల పరుపుగా ఉన్నది. గుండ్రముగా ఉన్నదంటే మేము ఒప్పుకోము. ఎందుకంటే మా మత గ్రంథంలో అలాగే ఉంది" అని అడ్డంగా వాదించే క్రైస్తవ పండితుల గురించి మనకు తెలుసు. "కపిద్ధాకార భూగోళం అని మూర్ఖులు వాదిస్తారు" అని అంటారు వీరు. యోగాసనాల మీద వీరు చేసిన హేళనలలో ఒక అడుగు ముందుకు వేసి ఏమంటున్నారో చూడండి.

రోమన్ కాథలిక్ మతానికి సర్వాధికారి అయిన వాటికన్ వ్యవస్థలోని ప్రముఖుడు గాబ్రియేలు అమోర్ద్ అంటాడు కదా! "ప్రాచీన కాలం నుండి హిందువులు చేసే అన్ని యోగ ప్రక్రియలు, ఆసనాలు మొదలైనవన్నీ సైతాను ప్రేరితమైనవే కాని, అంతకుమించి ఏమీ కాదు. దయ్యాలు, పిశాచాలూ మాత్రమే యోగం అభ్యసిస్తాయి" అని. పాపం వాటికన్ ను చూస్తే అయ్యో! అనిపిస్తోంది. ఈనాడు భారతదేశంలో కంటే కూడా పాశ్చాత్య దేశాలలోనే యోగం ఎక్కువగా ఆచరించబడుతున్నది. పైగా యోగ ప్రక్రియలోని వైజ్ఞానిక సంపద చూచి యావత్ ప్రపంచం ఈర్ష్యపడుతున్న ఈ కాలంలో వాటికన్ అభిప్రాయాలు వింతగా ఉన్నాయి. "చదువ వేస్తె ఉన్న మతి పోయింది" అంటే ఇదేనేమో. 

టైమ్స్ ఆఫ్ ఇండియా - 28/11/2011, పేజి 17
-ధర్మపాలుడు

గోవధ చట్టవిరుద్ధం - సుప్రీంకోర్టు

సరైన ఆధారాలు లేనందున గోవధను చట్టవిరుద్ధ చర్యగా భావించ నిరాకరించిన పంజాబ్, హర్యానా కోర్టు తీర్పును సుప్రీం కోర్టు కొట్టి వేసి గోవధచట్ట విరుద్ధమేనని స్పష్టం చేసింది. "గోవధ జరిగిన ప్రదేశం దోషిది అనేందుకు సాక్ష్యాలు లేకున్నా, అతడి స్వాధీనంలో లేకున్నా సరే విచారణ ఎదుర్కొని తీరవలసినదేనని" కుండ బ్రద్దలు కొట్టింది. ఈ మేరకు జస్టిస్ ద.కే.గంగూలీ, జస్టిస్ ఖేహార్ లతో కూడిన ధర్మాసనం క్రింది కోర్టు తీర్పును కొట్టి వేసింది.
సాక్షి 28/11/2011 - 14 వ పుట 
-ధర్మపాలుడు

ధర్మబద్ధమైన కర్మను చేయాలి

(గీతా జయంతి సందర్భంగా) 

కురుక్షేత్ర సంగ్రామంలో మోహంలో పడి యుద్ధ విముఖుడైన అర్జునుడికి తన ధర్మాన్ని గుర్తు చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి ? అనే విషయాలతో పాటు సమన్వయాత్మక దృష్టి కోణాన్ని ఈ గీత మనకు అందిస్తోంది. భగవద్గీతలో బోధించిన కర్మ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. గీతలో కర్మ గురించి చెప్పబడిన క్రింది విషయాలు గమనిద్దాం. 

నిజానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు. అయితే ఆ కర్మ ఎలాంటిది ఉండాలి? అనేదే ప్రశ్న. ఉదాహరణకు దొంగతనం చేయడం కూడా కర్మే. అయితే ఇలాంటి కర్మ వల్ల వ్యక్తికీ, సమాజానికి కీడు కలుగుతుంది. అందువల్ల ధర్మబద్ధమైన కర్మ చేయాలని గీతా వాక్యం చెబుతుంది. కర్మను చేయటమే కాదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నిస్వార్ధ బుద్ధితో పరిత్యాగం చేయడం గీతా ధర్మం యొక్క పరమ లక్ష్యం. కర్మ చేయకపోవటం వల్ల వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సమాజంలో ఇతరుల కర్మఫలం వల్ల తాను లాభపడతాడు.  అంటే ఇతరుల శ్రమ ఫలాన్ని అక్రమంగా దోచుకున్న వాడవుతాడు. అందుకే వ్యక్తి కర్మ చేయాలి, ఆ కర్మ ఫలాన్ని తాను కోరక భగవంతుడికి అర్పించాలి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడంటే ఈ చరాచర సృష్టి అనే భావం అర్జునుడికి స్పష్టమైంది. భగవదర్పణ చేయడమంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో, ఆ సృష్టికే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అర్పించడం. భగవద్భావనలో మరో విశేషం ఉంది. సామాజిక స్పృహ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైనది. భగవద్భావన సమస్త సృష్టికి వ్యాప్తమైంది. 

హిందూ హింస బిల్లు

వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. కూర్చున్నవారు శ్రీ రామ్ మాధవ్, శ్రీ సి. ఆంజనేయరెడ్డి, శ్రీ టి.హనుమాన్ చౌదరి, శ్రీ ఏం.వి.ఆర్.శాస్త్రి
2011 సంవత్సరం నవంబరు 14వ తేదీన సోషల్ కాజ్ మరియు ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ లోని కేశవ స్మారక విద్యా ప్రాంగణంలో జరిగిన మేధావుల సదస్సులో ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ (పూర్వపు కేంద్ర మంత్రి, మేధావి, ముస్లిం అభ్యుదయ వాది), రామ్ మాధవ్ (rss కేంద్ర కార్యకారిణి సభ్యుడు), ఆంజనేయ రెడ్డి IPS రిటైర్డ్, ఏం.వి.ఆర్. శాస్త్రి ఆంధ్ర భూమి సంపాదకుడు, త్రిపురనేని హనుమాన్ చౌదరి అధ్యక్షుడు ప్రజ్ఞాభారత పాల్గొని ప్రసంగించారు. వారి ప్రసంగాల సారాంశం సంక్షిప్తంగా... 
_______________________________________________
ప్రసంగించిన ప్రముఖులు ప్రతిపాదిత బిల్లు గురించి కూలంకషంగా విశ్లేషిస్తూ తమ తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా సభాసదుల ముందు ఉంచారు.
 • సోనియా గాంధీ అధ్యక్షతన ఏర్పడిన నేషనల్ అడ్వైజరీ కమిటీకి ఎటువంటి రాజ్యాంగ నిబద్ధత లేదు. కానీ ! ముస్లింలు, క్రైస్తవులు దానిని గట్టిగా వ్యతిరేకించడం వల్ల ఈ బిల్లుని వెనక్కు తీసుకున్నారు. NAC ని 2010  మార్చిలో పునర్వ్యవస్తీకరించి 14 మందితో తిరిగి ఏర్పాటు చేశారు. నలుగురు సభ్యులు (ఇందులో ఇద్దరు హిందూ వ్యతిరేకులు) ముసాయిదా రూపొందించారు. వీరికి సలహాలు ఇవ్వడానికి ఇంకొక 19  మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా హిందూ సానుభూతిపరులు లేరు.  
 • నిజానికి ఇటువంటి బిల్లు ప్రవేశపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న చట్టాలు అందుకు సరిపోతాయి. కానీ పోలీసు వ్యవస్థకి స్వయం నిర్ణయాధికారం లేదు. 150 సంవత్సరాల నాటి బానిస వ్యవస్థే ఇంకా పోలీసు శాఖలో కొనసాగుతున్నది. అధికారంలో ఉన్న పార్టీకి జై కొట్టడం వినా పోలీసులు ఏమీ చేయలేని దురవస్థ. 
 • యూనిఫాం సివిల్ కోడ్ లేదు. పీనల్ కోడ్ (IPC) అందరికీ ఒకటే అయినా ఈ బిల్లు ఆమోదించబడితే రెండు IPC లుగా మారుతుంది. తిరోగమనమే తప్ప పురోగతి లేదు. 
 • బిల్లు ఆమోదించబడితే ప్రజలు ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించబడతారు. బలవంతులు, తక్కువ బలవంతులు, అతి బలహీనులు (బలవంతులు ముస్లింలు క్రైసవులు కాగా హిందువులు అతి బలహీనులౌతారు) 
 • ఇంతా చేసి ఈ బిల్లు హిందువులు అల్పసంఖ్యలో ఉన్న రాష్ట్రాలలో ఆచరణలోకి రాదు. అనగా జమ్మూ కాశ్మీర్, నాగాలాండు, మేఘాలయ, మిజోరం, లక్షద్వీప్ లలో ఇది పని చేయదు.
  ఎటు చూచినా హిందువులకి వెన్నుపోటు మాత్రమే మిగులుతుంది.
 • ఈ బిల్లు చట్టంగా మారితే హిందూ జాతిని నిర్మూలించడం రాజ్యాంగ బద్ధమౌతుంది.
ఎందుకంటే, ఈ చట్టాన్ని అమలు పరిచే సంఘంలో ఏడుగురు సభ్యులు ఉంటారు. అందులో నలుగురు ముస్లిం-క్రైస్తవులు ఉంటారు. వారే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులలో ఉంటారు. వారిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ ఉండదు. వారినెవ్వరూ  తొలగించలేరు. 

పూర్వపు కేంద్ర మంత్రి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రసంగిస్తూ ఇలా అన్నారు.
"ఈ ప్రతిపాదిత బిల్లు ఓటు బ్యాంకు నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప వేరొకటి కాజాలదు. వాస్తవానికి నేను మైనారిటీ మెజారిటీ అన్న సిద్ధాంతాన్నే ఒప్పుకోను. గతంలో షాబానో కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును సమర్ధిస్తూ నేను నా మంత్రి పదవినే వదులుకున్నాను. మన రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వాన్ని ప్రసాదించింది. ఈ బిల్లుతో ఆ సమానత్వం నశిస్తుంది. నిజానికి నన్ను గాని ఎవరైనా "మైనారిటీ" అంటే నేను దాన్ని ఒక తిట్టుగా భావిస్తాను. వివిధ కులాలూ, మతాల ప్రజలు హాయిగా కలిసి జీవించే సమాజం మనది. ప్రజలను మైనారిటీ మెజారిటీగా విభజిస్తే దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఉదాహరణకి తమను మైనారిటీగా పరిగణించాలని కలకత్తా హైకోర్టుకు రామకృష్ణా మఠం గతంలో విజ్ఞాపన చేసింది. ఇది ఎంత విడ్డూరం? ఒక హిందూ సంస్థ తనను మైనారిటీగా గుర్తించమని అర్ధించడం ఎంత దౌర్భాగ్యం? 
నేను తులసీ రామాయణం అధ్యయనం చేశాను. అందులో ఎంతో ఉదాత్తమైన అంశాలు ఉన్నాయి. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో గొప్పగా చెప్ప బడ్డది. జాతి యావత్తూ ఒక్కటని రామాయణం చెప్పలేదా? మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ లాంటి పదాలు విన్నప్పుడు నాకు కంపరంగా ఉంటుంది. ముందుగా మన దేశానికి కావలసినది ఒక Uniform Civil Code. అంతేగాని మతహింస బిల్లు కాదు. ఈ బిల్లు చట్టంగా మారితే మన దేశానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఈ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచనే సిగ్గుచేటు. మనం చరిత్ర నుండి పాఠం నేర్చుకోవలసి ఉంది" అంటూ ప్రసంగం ముగించారు.  ఎన్.నాగరాజుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.
_______________________________________________
"ఊరందరిదీ ఒక దారి - ఉలిపి కట్టదొక దారి" అని సామెత. "వేసినట్లే వేస్తే వేర్రివాడే గెలిచాడు" అనేది ఇంకొక సామెత. మన దేశానికి పట్టిన హీనమైన పరిస్థితి చూస్తుంటే ఇటువంటి సామెతలన్నీ మన కోసమే పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది. మన జాతికి ఉన్న కష్టాలూ, క్లేశాలు తక్కువేమీ కావు. క్రొత్తగా ముంచుకొస్తున్న ప్రమాదం ప్రతిపాదిత "మత హింస బిల్లు". ప్రపంచంలో అన్ని దేశాలూ వాటి వాటి రక్షణ చేసుకుంటూ బలోపేతమౌతుంటే మనదేశం మాత్రం స్వీయ విధ్వంసక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. దానికి ఉదాహరణే పార్లమెంటులో చర్చకు పెట్టబోతున్న "Prevention of Communal and Targeted Violence Bill - 2011".  
_______________________________________________  
- ధర్మపాలుడు