విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ రాఘవ రెడ్డి

శ్రీ జి.రాఘవ రెడ్డి

జి. పుల్లారెడ్డి స్వీట్స్ మరియు జి. పుల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ జి.రాఘవ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులుగా నియమింపబడ్డారు. ఈ సందర్భంగా జనవరి 1 న భాగ్యనగర్ లో వారి అభినందన సభ జరిగింది. "ప్రఖండ స్థాయిలో పూర్తి సమయ కార్యకర్తల నియామకం ద్వారా పని వేగాన్ని పెంచేందుకు విశేషంగా ప్రయత్నిస్తామని" శ్రీ రాఘవ రెడ్డి ఈ సభలో ప్రకటించారు.