పాక్ లో హిందూ ఆలయాలపై దాడి

పాకిస్తాన్ పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయం

పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువయ్యాయి. భారత్ లో మైనారిటీ వర్గాలకు అన్ని రకాల మతస్వేచ్ఛ  ఉండగా, పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులకు రక్షణ కొరవడింది. పాకిస్తాన్ లోని వాయువ్య ప్రాంతంలో గల పెషావర్ లోని గోరఖ్ నాథ్ దేవాలయంపై ఇటీవల దాడి జరిగింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోరఖ్ నాథ్ దేవాలయాన్ని అధికారులు మూసివేయగా, హైకోర్టు ఆదేశాల మేరకు 2011 లో ఆ దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తిరిగి తెరిచారు. అప్పటినుంచి హిందువులు గోరఖ్ నాధుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. 

కాగా, ఇటీవల కొందరు దుండగులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న చిత్ర పటాలను చించివేసి, ఆలయ గర్భ గుడిలోని శివ లింగాన్ని ధ్వంసం చేశారు. గత రెండు నెలల్లో దుండగులు వరుసగా మూడోసారి ఈ గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి చేశారు. సాహిత్యాన్ని ధ్వంసం చేశారు. 

ఈ గోరఖ్ నాథ్ ఆలయానికి 160 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం పంజాబ్, రాజస్తాన్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన హిందువులు ఈ ఆలయాన్ని సందర్శించి పునీతులయ్యేవారు. దేశ విభజన అనంతరం ఈ ఆలయాన్ని మూసివేశారు. అయితే హిందువుల నిరంతర పోరాటం ఫలితంగా గత ఏడాది పెషావర్ హైకోర్టు ఈ ఆలయాన్ని తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. 

భారత్ లో మత ప్రజాస్వామ్యం లేదంటూ ఇటీవల కొందరు నాస్తికులు, భౌతిక వాదులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను మాత్రం వారు ఖండించలేక పోతున్నారు. హిందుత్వం మతతత్వం అని, ఇతర మతాలలో చాలా విశాల భావాలున్నాయని వాదిస్తున్న ఇటువంటి వారికి పాకిస్తాన్ లోని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు కనువిప్పి కావాలి.

కార్యదీక్షా పరుడే హిందువు

వివేక సూర్యోదయం - ధారావాహికం - 6

 

హిందువన్న మాట వినడంతోనే నీలో ఎక్కడ లేని శక్తి ఆవిర్భవించి నిన్ను సర్వ సమర్ధుడ్ని చెయ్యాలి. అప్పుడే నీవు నిజమైన హిందువు. 

ఏ దేశానికి చెందిన హిందువైనా, ఏ భాష మాట్లాడేవాడైనా నీకు బహి:ప్రాణం కావాలి.  అప్పుడే నీవు నిజమైన హిందువు. 

ఏ హిందువు కష్టస్థితి అయినా నీ హృదయాన్ని కరిగించి, నీ కన్న కొడుకే కష్టంలో ఉన్నట్లు నీ చేత భావింప చెయ్యాలి. అప్పుడే నీవు నిజమైన హిందువు.

అంతేకాదు, హిందువుల కోసం ఆ మహాత్ముడు గురుగోవిందసింగు వలె ఎటువంటి కష్టాన్నైనా భరించగలగాలి. హిందూ ధర్మ సంరక్షణ కోసం తన నెత్తురు ధారపోసి, యుద్ధ భూమిలో కన్నబిడ్డల చావును కళ్ళారా చూసి, ఎవరి కోసం తానీ త్యాగం చేశాడో వాళ్ళే తన్ను విసర్జించి వెయ్యగా, దెబ్బతిన్న సింహమై ఆ మహానుభావుడు, తన ఎడల కృతఘ్నులై, తన్ను పరిత్యజించిన తన వాళ్ళను పల్లెత్తు మాటైనా అనకుండా, ప్రశాంతంగా కార్యరంగం నుండి ఉపసంహరించుకుని దక్షిణానికి వెళ్ళిపోయి అక్కడే చనిపోయాడు. ఆ ఉత్తమోత్తమ సహనశీలమే నీకు లక్ష్యం కావాలి. అప్పుడే నీవు నిజమైన హిందువు. 

దేశ సేవా కాంక్ష ఉన్న ప్రతి వ్యక్తీ గురుగోవిందసింగు కావాలి. సోదర దేశీయులలో సహస్రాధిక దోషాలు ఉండవచ్చు. అయినా వాళ్ళు హిందువులన్న సంగతి మరచిపోకూడదు. వాళ్ళు నిన్ను నానా యాతనలూ పెట్టినా సరే, వాళ్ళే నీకు ముందు పూజింపదగిన దేవతలు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నీవు వారిని ప్రేమతో ఆశీర్వదించగలగాలి. వాళ్ళు నిన్ను తరిమివేస్తే ఆ మహా నాయకుడు గోవిందసింగు వలె మౌనంతో మరణించడానికి కూడా సిద్ధపడాలి. అట్టి కార్యదీక్షా, సహనశక్తీ ఉన్నవాడే, హిందువు అనిపించుకోవడానికి అర్హుడు.  ఆ ఔన్నత్యాన్ని అందుకోవడమే మనకెల్లప్పుడూ లక్ష్యమై ఉండాలి.  

పరస్పర వైమనస్యాలు పారద్రోలి ఈ మహత్తర ప్రేమ ప్రవాహాన్ని సర్వదిశలా వ్యాప్తం చేద్దాము.

కార్యకర్తలారా.. 

ధీమంతులై, ధైర్యవంతులై సముద్రాలు ఈదడానికి సిద్ధపడుతూ, మృత్యుగహ్వరంలోకి దూకే సాహసం గల, ఉత్సాహవంతులైన యువకులు కావాలి. అట్టివాళ్ళు వందల కొలదీ కావాలి. ఆ లక్ష్య సిద్ధికి మీ శక్తినంతా ఉపయోగించండి. అసంఖ్యాకంగా యువకుల నాకర్షించి ఉత్తేజపరిచి మన పవిత్రీకరణ యంత్రంలో పెట్టండి. పవిత్ర హృదయాలతో పట్టుదల వహించి, వేరు వేరు చోట్ల కేంద్రాలు స్థాపించి కార్యసాధకులను సమకూర్చండి.   

- ఆకాశ్

ఆరోగ్యానికి ఆహారం - 2

నువ్వులు చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. దోసకాయ చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది. ఉలవలు దగ్గు, ఆయాసం, జలుబులను తగ్గిస్తుంది. కాకరకాయ జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. కారట్ ముఖ్యంగా నేత్రములకు మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తే చర్మవాపులు తగ్గుతాయి. టమోటా రక్తవృద్ధిని కలిగిస్తుంది. 


శెనగలు : చలువ చేయును. రక్త దోషాన్ని పోగొడుతుంది. తేలికగా జీర్ణము కాదు.
ఉలవలు : వగరుగా ఉండును. వేడి చేస్తుంది. తేలికగా జీర్ణమగును. దగ్గు, ఆయాసం, జలుబును తగ్గిస్తుంది. మూత్ర పిండములలో ఉన్న రాళ్ళను కరిగిస్తుంది. నులిపురుగులను నశింపచేస్తుంది.
నువ్వులు : కటు, తిక్త, మధుర, కషాయ రసములు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. గురుగుణం కలిగి ఉంటుంది. చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. వాత రోగములను పోగొడుతుంది. 

శాకములు (కూరగాయలు) 


కంద : వగరుగా ఉంటుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూలశంక వ్యాధిని పోగొడుతుంది. ప్లీహ రోగములలో పథ్యము. కుష్టు, చర్మ రోగములు కలవారు దీనిని తినరాదు.
పెండలము : చలువ చేయును, మలబద్ధం చేస్తుంది. తియ్యగా ఉంటుంది. తేలికగా జీర్ణం కాదు. బలకరము.
చిలగడదుంప : బలాన్ని ఇస్తుంది. తియ్యగా ఉంటుంది. హృద్రోగములలో మంచిది, కడుపుబ్బరమును కలిగిస్తుంది.
బంగాళాదుంప : తియ్యగా ఉంటుంది. బలకరము, కడుపుబ్బరమును కలిగిస్తుంది. జీర్ణం ఆలస్యమవుతుంది.
ముల్లంగి : కారంగా ఉంటుంది. వేడి చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కామెర్లు, కాలేయ వ్యాధులందు బాగా పని చేస్తుంది. మూత్ర పిండములలో రాళ్ళను కరిగించును.
 

కారట్ : తియ్యగా ఉంటుంది. ఆకలిని, జీర్ణ శక్తిని పెంచుతుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. మూలవ్యాధిని తగ్గిస్తుంది, ముఖ్యంగా నేత్రములకు మంచింది.

అరటికాయ : తియ్యగాను, వగరుగాను ఉంటుంది. పైత్యమును తగ్గిస్తుంది. నులి పురుగులను నశింపచేస్తుంది.
గుమ్మడికాయ : చలువ చేస్తుంది, బలాన్ని కలిగిస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.

 

సొరకాయ : హృదయానికి మంచిది, మూత్రంను జారీ చేస్తుంది.
దోసకాయ : చలువ చేయును, మూత్రాన్ని జారీ చేయును, చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది.
పొట్లకాయ : అత్యంత పథ్యం. బలాన్ని ఇస్తుంది. రుచిని కలిగిస్తుంది. హృదయమునకు మంచిది, నులిపురుగులను నశింప చేస్తుంది. పైత్యమును, వాతాన్ని తగ్గిస్తుంది. శుక్రవ్రుద్ధిని కలిగిస్తుంది.
కాకరకాయ : చేదుగా ఉంటుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది.

బీరకాయ : చలువ చేయును. తియ్యగా ఉంటుంది. పైత్యమును తగ్గించును, జీర్ణం చేస్తుంది. జ్వరం, ఆయాసములలో పథ్యంగా పని చేస్తుంది. నులి పురుగులను పోగొడుతుంది.

దొండకాయ : చలువ చేయును, మందము చేస్తుంది, మలబద్ధాన్ని కలిగిస్తుంది. తేలికగా జీర్ణం కాదు, పైత్యాన్ని తగ్గిస్తుంది.


వంకాయ : లేత వంకాయాలనే వాడాలి. ఇవి అత్యంత పథ్యము, కఫం, వాతములను తగ్గిస్తుంది. తేలికగా జీర్ణమగును, మలమూత్రములను జారీ చేయును. బలకారి, చర్మ వ్యాధులందు వాడరాదు. ముదిరిన వంకాయ వాడరాదు, దురదలను పుట్టిస్తుంది. 

మునగకాయ : మధుర, కషాయ రసంలు కలిగి ఉంటుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కుష్టు, క్షయ, ఆయాసం వ్యాధులలో మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తె చర్మ వాపులు తగ్గుతాయి.

బెండకాయ : వేడి చేస్తుంది. మలబద్ధమును చేస్తుంది. రుచిని కలిగించును.
టమోటా : రక్త వృద్ధి చేస్తుంది. పులుపు గుణాన్ని కలిగిస్తుంది. పైత్యం చేస్తుంది. ఆకు కూరలతో కలిపి తింటే మూత్ర పిండములలో రాళ్ళు పడతాయి.

వచ్చే సంచికలో ఆకు కూరల గురించి...

దివికేగిన వాత్సల్యం - వాత్సల్యానంద భారతి అస్తమయం

వాత్సల్యానంద భారతి స్వామి

ప్రముఖ పరివ్రాజకుడు, భారతమాత సేవకుడు హిందూ ధర్మాభిమాని శ్రీ వాత్సల్యానంద భారతి స్వామి వారు మే 17 వ తేదీ నాడు నెల్లూరు జిల్లాలోని జయభారత్ ఆసుపత్రిలో సిద్ధి పొందారన్న వార్తను పాఠకులకు అందించవలసి వస్తున్నందుకు లోకహితం తీవ్రంగా వ్యధ చెందుతున్నది. స్వామి వారికి నివాళులర్పిస్తున్నది. 

స్వామి వారి పూర్వాశ్రమ నామధేయం వేదాంతం సంగమేశ్వర శాస్త్రి. 1960 దశకంలో వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రుడైన శ్రీ శాస్త్రిగారు కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకునిగా జీవితం ప్రారంభించారు. 1964 నుండి 1989 వరకు అంటే 25 సంవత్సరాలు సంఘ ప్రచారక్ గా పని చేశారు. సంఘ శాఖలలో స్వయంసేవకుల చేత చక్కని ఆటలు ఆడించటం, వ్యాయామ క్రీడలలో శిక్షణ ఇవ్వడం, కార్యకర్తలలో మంచి క్రమ శిక్షణను ప్రోది చేయడం వంటి ఎన్నో విద్యలలో శాస్త్రిగారు దిట్ట. శాస్త్రిగారు సంఘ పాటలు బాగా పాడేవారు. తెలుగు, హిందీ పాటలు నైపుణ్యంతో గానం చేసే వీరికి కొన్ని వందల పాటలు కంస్తంగా వచ్చు. తూర్పు  గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వీరు గణనీయంగా సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళారు. విశాఖలోని భారతీయ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల స్థాయికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర గణనీయం. విశాఖపట్నంలో భారతీయ జనసంఘానికి క్రొత్త ఊపిరులూది భారతీయ జనసంఘ్, తరువాత భారతీయ జనతా పార్టీలకు పటిష్టమైన బలం చేకూర్చడంలో వీరి పాత్ర అమోఘం. 

నెల్లూరులో ఉన్నప్పుడు వీరు మత్స్యకారుల గ్రామాలపై దృష్టి సారించి వారి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ విధంగా రూపుదిద్దుకున్నదే ఇసుకపల్లె పట్టపు పాలెం. ఈ గ్రామంలో వీధులు విశాలంగా ఉంటాయి. పిల్లలంతా బడికి వెళతారు. గ్రామస్తులు స్వచ్చందంగా మద్యపానం మానివేశారు. పొదుపు పాటిస్తారు. ఆ గ్రామ ప్రజలకు అప్పుల బాధ లేదు. ఎన్నో జిల్లాలలో పని చేసిన శాస్త్రిగారు 1985 లో ప్రాంత సేవా ప్రముఖ్ గా బాధ్యతలు తీసుకున్నారు.

1989 లో ప్రచారక్ గా మానుకున్న తరువాత వాత్సల్య సింధు (నిరాధార బాలికల సంక్షేమ గృహం), భారతీయ విద్యావికాస్ హైస్కూల్ (సార్వజనిక్ విద్య), వానప్రస్థ గృహం (నిరాధార వృద్ధుల సంక్షేమ గృహం) స్థాపించి 15 సంవత్సరాల పాటు నిరాఘాటంగా నడిపించారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంవత్సరానికి కోటి రూపాయలు ఖర్చు ఉండేది. చేతిలో పైసా లేని శాస్త్రిగారు ఇంత పెద్ద ప్రాజెక్టును ఎలా నడిపారో చూస్తే వారి ఘనత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. వీరి చొరవతో ఏర్పడిన సింహపురి (నెల్లూర్) జయభారత్ హాస్పిటల్ ఇప్పుడు 200 పడకలతో వర్దిల్లుతున్నది. 1989 లో పూజనీయ డాక్టర్జీ  శతజయంతి సందర్భంగా సముద్ర తీరంలో కేశవ నావ నడిపించి విజయవంతం చేశారు.

ఈ సమాజంలోని గుండె గుండెలో భారతమాతను నింపాలని శాస్త్రిగారు కలలు కంటూ ఉండేవారు. ఈ సమాజం కాషాయ వస్త్రధారి (సన్యాసి) మాటలు ఎక్కువగా గౌరవిస్తుంది. కాబట్టి తాను తలబెట్టిన ఈ 'గుండె గుండెలో భారతమాత తత్వ ప్రచారం' సన్యాసిగానే మొదలుపెట్టాలని శ్రీ శాస్త్రిగారు సంకల్పించారు. దానికి అనుగుణంగా 2010 లో తిరుపతిలో శ్రీ కుర్తాళం సిద్దేశ్వర పీఠాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ  సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వాముల చేతులమీదుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నిరంతరం పర్యటిస్తూ ఇంటింటా భారతమాత చిత్రపటం ఉండేలా కృషి చేశారు. దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి నిరర్ధకం, నిష్ఫలమని, దేశభక్తి గల దైవభక్తి పరమార్ధమని ప్రబోధించారు.

మన హిందూ జీవన విధానంలో చెప్పినట్లుగా నిజమైన సన్యాసి ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఏ విధంగా దేశ సేవ, సమాజ సేవ చేయాలో వీరు ఆచరణాత్మకంగా చేసి చూపించారు.

మే 7, 2012 నాడు ఏలూరు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ 17 వ తేదీన ఇహలోక యాత్ర చాలించారు. కొంత మంది మరణం తర్వాత కూడా జీవించే ఉంటారు. అటువంటి వారే వాత్సల్యానంద భారతి స్వామి వారు.

ప్రచారక్ గా, అయ్యగా, సన్యాసిగా తన కోసం గాక సమాజం కోసం జీవించి, తపించిన శ్రీ వాత్సల్యానంద భారతి చూపిన మార్గంలో నడిచి మన జీవితాలు ధన్యం చేసుకుందాం. 

- ధర్మపాలుడు

కుటుంబంలోని సభ్యులందరికీ స్వదేశీ నిష్ఠ కలిగించవలసిన బాధ్యత నేటి మహిళదే

వందనీయ ప్రమీలా తాయి మేడే

వేదికపై ప్రసంగిస్తున్న వందనీయ ప్రమీలా తాయి మేడే

రాష్ట్ర సేవికా సమితి పశ్చిమ ఆంధ్ర ప్రాంత "ప్రవేశ్ శిక్షావర్గ" ఈ నెల మే 5 వ తేది నుండి 20 వ తేదీ వరకు హన్మకొండలోని 'భారత విద్యా భవన్' పాఠశాలలో జరిగింది. 5 వ తేది సాయంకాలం 6 గంటలకు 'ఉద్ఘాటన' కార్యక్రమంతో ఈ శిక్షావర్గ ప్రారంభమైంది. ఈ వర్గలో ప్రాంతంలోని 54 స్థలాల నుండి వచ్చిన 125 మంది శిక్షార్ధులు శిక్షణ పొందారు. 

ఈ వర్గలో శిక్షార్దుల శారీరక, మానసిక, బౌద్ధిక వికాసానికి ప్రశిక్షణ ఇవ్వబడింది. రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ మా.మాధురీ, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారిక మా.సీతక్క, దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహిక మా.సావిత్రి శిక్షార్ధులకు వివిధ అంశాలలో మార్గదర్శనం చేశారు. మే 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు హన్మకొండ నగర వీధులలో శిక్షార్దులచే ఘోష్ సహిత 'పథ సంచలన్' జరిగింది. 20 వ తేదీ సాయంత్రం సార్వజనికోత్సవంలో డా.టి.సంధ్యారాణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డా.వి.సువర్ణ ఉపస్థితులైనారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీలాతాయి మేడే గారు మాట్లాడుతూ "రాజకన్య అయినా సావిత్రి తన భర్త సత్యవంతుని ప్రాణం కోసం యమధర్మరాజును ఎదిరించిన భూమి ఇది. అచేతన స్థితిలో ఉన్న సమాజాన్ని తిరిగి చైతన్యవంతం చేయగలిగిన సంకల్ప శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. ఈ ఆధునిక కాలంలో అనేక ఆకర్షణలు, వ్యామోహాలు మహిళలను తమ ధ్యేయమార్గం నుండి ప్రక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత జాగరూకత కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఇటువంటి పరిస్థితులలో తమతో పాటు సమాజాన్ని కూడా సచేతనంగా ఉంచగలుగుతారు.

ధ్యేయనిష్ఠ కలిగిన భర్త కోసం అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడిన సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలని ముంబయి హైకోర్టు ఒక విడాకుల కేసు విషయంలో ఈ మధ్య తీర్పు ఇచ్చింది. ఎందుకంటే నేడు అనేక ప్రలోభాలు మన కుటుంబ వ్యవస్థ ధృఢత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి.  మనం అత్యంత జాగరూకులమై, సంఘటితమై మన వ్యక్తిగత, నైతిక, సామాజిక విలువల పట్ల నిష్ఠ కలిగి ఉంటేనే ఈ సవాళ్ళను ఎదుర్కొన గలుగుతాము. స్వదేశీ నిష్ఠ మన కుటుంబంలోని సభ్యులందరికీ కలిగించ వలసిన బాధ్యత నేటి మహిళ పైన ఉన్నది. మన జీవనకార్యమైన 'సర్వే భవంతు సుఖినః' అని ధ్యేయనిష్ఠతో మనం సాధన చేయవలసి ఉంది" అని అంటూ ప్రసంగాన్ని ముగించారు ప్రమీలా తాయి మేడే జీ.

మైనారిటీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం


మైనారిటీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయం. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి రంగాలలో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీలకు నిర్ధారించిన 27 శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 4.5 శాతం ఉప కోటా కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. 

భారత రాజ్యాంగం మతపరమైన, భాషా పరమైన మైనారిటీలకు కొన్ని రంగాలలో ప్రత్యేక రక్షణ కల్పించింది. విద్యా సంస్థల ఏర్పాటుకు మైనారిటీలకు ప్రత్యేక రక్షణ ఉంది. మన రాష్ట్రంలో కూడా మతపరమైన, భాషా పరమైన మైనారిటీ సంస్థలు అనేక ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కళాశాలలను ఏర్పాటు చేశాయి. ఈ విద్యా సంస్థలలో ఆయా మైనారిటీ వర్గాలకు 50 శాతం సీట్లు, ఇతరులకు 50 శాతం సీట్లు కేటాయించాలి. మన రాష్ట్రంలో మెజారిటీ వర్గానికి చెందిన అనేకమంది మైనారిటీ కోటాలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు పొంది వాటిని నిర్వహిస్తున్నారు. 

అయితే సాధారణ విద్యా సంస్థలలో మతపరమైన రిజర్వేషన్లకు ఆస్కారం లేదు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, క్రీడా కారులు.. ఇలా సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే విద్య, ఉపాధి రంగాలలో మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వెసులుబాటు కల్పించలేదు. ముస్లింలు, క్రిస్తియన్లను ఓట్ బాంకులుగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా వారిని ఆకర్షించడానికి, మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

గత జనవరిలో యూపీ ఎన్నికల సందర్భంగా ఇదే జరిగింది. ముస్లింలకు ఏకంగా 9 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. తన భార్య పోటీ చేస్తున్న నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖుర్షీద్ చేసిన ప్రసంగాన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ కేంద్ర మంత్రిని అభిశంసించింది. ఎన్ని హామీలు ఇచ్చినా యూపీలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే లభించాయి. స్వయంగా ఖుర్షీద్ భార్య ఓటమి పాలయ్యారు. అంటే యూపీ ప్రజలు ముస్లింల పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్ని తిరస్కరించారన్న మాట. 

రాజ్యాంగ నిర్మాతలు దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించారు. అయితే అనేక శాతాభ్దాలుగా సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రం కొద్ది సంవత్సరాల పాటు రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది. 

నర్మదా పుష్కరాలు


నర్మదలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం మోక్షప్రదమైనవని పెద్దలు చెబుతారు. మనదేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే నదులలో నర్మద ముఖ్యమైనది. ఈ సంవత్సరం బృహస్పతి వైశాఖ బహుళ ద్వాదశి గురువారం ఉదయం 9.35 నిమిషాలకు వృషభ రాశిలో ప్రవేశించిన సందర్భంలో అనగా 17.5.2012 న నర్మదకు పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 

29.5.2012 వరకు జరిగిన ఈ పుష్కర పుణ్య కాలంలో అనేక వేల మంది హిందువులు పుష్కర స్నానమాచరించి పునీతులయ్యారు. లక్షల సంఖ్యలో నర్మద పుష్కరాలకు విచ్చేసిన భక్తులకు వందలాది మంది సాధుసంతులు ఆధ్యాత్మిక బోధనలు చేయడంతో వారు ఆనంద పరవశులయ్యారు. 

నక్సలైట్ల చేతిలో ఆరువేల రాకెట్ లాంచర్లు


"దేశం ఎటైనా పోనీ.. ఏమైనా కానీ... నా కడుపు చల్లగా ఉంటే చాలు, నా లక్షల కోట్ల అవినీతి సంపాదన క్షేమంగా ఉంటే చాలు" అనుకునే వారు పాలిస్తున్న దేశం మనది. నాయకులు, పాలకులూ రాజకీయపు కీచులాటలలో నిమగ్నం అయి ఉండగా కమ్యూనిస్టు దేశ ద్రోహులు వారి పన్నాగాలకు పదును పెడుతున్నారు. చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో సుమారు ఆరువేల (6000) రాకెట్ లాంచర్లు సమకూర్చుకున్నారు. నక్సలైట్లు తాత్కాలికంగా నిర్మించిన కర్మాగారాల్లో వీటి ఉత్పత్తి యధేచ్చగా సాగిపోతోంది. విడిభాగాలు కోల్ కత్తా  నుండి అందుతున్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రెండు వందల కోట్ల రూపాయల నిధిని ఆయుధాలు, లాంచర్లు, బాంబుల కోసం కేటాయించింది. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీ (యెన్.ఐ.ఏ.) వారు నిశితంగా గమనిస్తున్నారట. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి ఈ విషయాలు బయట పెట్టారు. 

- ధర్మపాలుడు

గంగమ్మ తల్లిని రక్షిస్తారట


మన గంగానది పావనగంగ. అన్ని పాపాలనూ కడిగి వేయగల నదీమతల్లి. భూ ప్రపంచంలోని అన్ని నదులలోనూ అతి పవిత్రం, హిందువులకు ప్రాణసమానం. అటువంటి గంగను కూడా అపవిత్రం చేస్తున్నారు మన సెక్యులర్ పాలకులు. ఇది ఇలా ఉండగా మొన్ననే ఒక వార్త వచ్చింది. యు.పి.ఏ. ప్రభుత్వం గంగానదిని శుద్ధీకరించడానికి ఒక బృహత్ పథకం చేపట్ట బోతున్నదట. పరిసర వాతావరణం అరణ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి జయంతి తన మంత్రిత్వ శాఖ అధికారులకు "గంగా నది శుద్ధీకరణ" ప్రణాళిక రచించమని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆమె క్రొత్త ధిల్లీలో ఒక ప్రకటన చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! 

ఐతే ఈ చర్యకు వెనుక ఉన్న కారణం వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. గంగానది పవిత్రీకరణ కోసం కొందరు హిందూ సాధువులు చేస్తున్న ఆందోళన శృతి మించుతున్నదట, వచ్చే జనవరి (2013) లో ప్రయాగలో కుంభమేళా ఉన్న కారణంగా హిందూ ఆందోళన యు.పి.ఏ.కి ఒక తలనొప్పిగా తయారైందని అభిజ్నవర్గాల  సమాచారం. అందుకోసమే ఈ కంటి తుడుపు చర్య.

- ధర్మపాలుడు

"ఆకాష్" క్షిపణి విజయవంతం


మొన్న మొన్ననే మనం అగ్ని-6 సుదూర లక్ష్యాన్ని చేదించే క్షిపణి విజయవంతంగా ప్రయోగించాం. ఏ క్షిపణిని చూసి చైనా కూడా ఝడుసుకున్నది. ఇది ఇలా ఉండగా భూమిమీద నుండి ప్రయోగించి ఆకాశంలో ఉండే లక్ష్యాలను చేదించే "ఆకాష్" క్షిపణిని ఒడిషాలోని  చాందిపురం ప్రయోగ క్షేత్రం నుండి మన శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అంతకు రెండు రోజుల ముందు కూడా ఇటువంటి ప్రయోగమే విజయవంతంగా జరిగింది. 'రక్షణ పరిశోధన సంస్థ' (డి.ఆర్.డి.ఓ.) వారు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ క్షిపణి మన వైమానిక దళం అమ్ముల పొదిలో క్రొత్త ఆయుధంగా చేరింది. దేశాన్నేలే వారు దోపిడీలు చేస్తున్నా కనీసం శాస్త్రవేత్తలు దేశ హితం కోసం శ్రమించడం ముదావహం. వారందరికీ లోకహితం జేజేలు పలుకుతున్నది.


- ధర్మపాలుడు

కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసి పోయిన రూపం హిందుత్వం


బంకించంద్రుడు మహా కవి. భగవద్గీతపై, హిందుత్వంపై ఎన్నో వ్యాఖ్యానాలు వ్రాశారు. హిందుత్వం గురించి బంకిం చంద్ర ఇలా అన్నారు.

"మతం అనేది లౌకికంగాను, ధార్మికంగాను ఉండి సంపూర్ణ జీవనానికి అన్వయింప బడి ఉండాలి. వేర్వేరు సంస్కృతులతో, ప్రాంతీయాచారాలతో చిక్కుముడి లాగ తయారయిన "హిందుత్వం" ను జాగ్రత్తగా ముడులు విప్పి చూసుకొంటే తప్ప అసలు మూల సిద్ధాంతాలు బయటపడవు. తాంత్రిక ప్రభావం హిందుత్వంపై ఉన్నా అదే హిందూ మతం కాదు. హిందూ మత సారం కాబోదు. హిందుత్వం - తంత్రం రెండూ వెలుగు చీకట్ల లాగ భిన్నమైనవి. అద్వైత, ద్వైత, బహు దైవత్వ, ప్రకృతి దైవత్వ, నాస్తిక, యాజ్ఞిక, అయాజ్ఞిక, శైవ, వైష్ణవ, శాక్తేయ, కబీర, చైతన్యాది వైవిధ్య భరితమైన సంప్రదాయాలు ఉన్నాయి. సాలగ్రామాలను, లింగాలను, తులసిని పంచ భూతాలను ఇంకా ఎన్నిటికో పూజలు చేస్తాము. ఆంజనేయుడిని వాయుపుత్రుడనీ, దేవుడనే పూజిస్తాం. కాని, కోతి అని అనుకోం. బహు దేవతారాధానం ఒక్క హిందువులకే లేదు, గ్రీకులకు కూడా ఉండేది. మనదే తప్పని ఎలా అంటారు? క్రైస్తవులు తప్పన్నంత మాత్రాన మనం కూడా తప్పనుకోవాలా? కించపడాలా?

హిందూమతం క్రైస్తవ, ఇస్లాంల వలె ఏకవ్యక్తి స్థాపితం కాదు. భిన్న భిన్న కాలాల్లో ప్రవేశించిన భిన్న భిన్న తాత్విక సిద్ధాంతాల సమాహారం. కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసిపోయిన రూపం".

వ్యక్తులు సంస్కారవంతులైతేనే వ్యవస్థ బాగుంటుంది

ద్వితీయవర్ష శిక్షావర్గ సమారోప్ లో శ్రీ వేణుగోపాల్ రెడ్డి

సార్వజనికోత్సవ వేదికపై ప్రసంగిస్తున్న శ్రీ వేణుగోపాల్ రెడ్డి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ భాగ్యనగర్, నారాయణ గూడలోని కేశవ స్మారక విద్యాలయ ప్రాంగణంలో మే 5 నుండి 26 వరకు జరిగింది. ఇందులో పశ్చిమాంధ్ర ప్రాంతం నుండి 116 మంది శిక్షార్ధులు, పూర్వాంధ్ర ప్రాంతం నుండి 42 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. వీరికి శిక్షణ ఇవ్వటానికి 20 మంది శిక్షకులు, శిబిర నిర్వహణకు 50 మంది ప్రబంధకులు కూడా పాల్గొన్నారు. 2012 మే 25 సాయంకాలం సార్వజనికోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సామాజిక కార్యకర్త డా.ఎం.అంజయ్య, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నత అధికారిగా పని చేసి రిటైరైన మనోహరరావు గారు పాల్గొన్నారు. కరీనగర్ విభాగ్ సంఘచాలక్ శ్రీ మల్లోజుల కిషన్ రావు వర్గ సర్వాధికారిగా వ్యవహరించారు. శిబిర నివేదిక తర్వాత శారీరక్, ఘోష్ ప్రదర్శనలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీ పి.వేణుగోపాల రెడ్డి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు ప్రధాన వక్తగా విచ్చేసి ప్రసంగించారు. 

శ్రీ వేణుగోపాల రెడ్డి ఉపన్యాసం 

"మన దేశం అనేక రంగాలలో అనేక రకాలుగా అభివృద్ధి సాధించింది. మన శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే సుదూర లక్ష్యాలను చేధించ గలిగిన క్షిపణిని ప్రయోగించి పరీక్షించడంలో విజయులయ్యారు. ఈ క్షిపణి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారయ్యింది.

దేశం ఇన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. అయినా ప్రజలు ఆనందంగా లేరు. నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఒకవైపు దేశం ఇంతగా ప్రగతి సాధిస్తున్నా, ప్రజలలో ఆనందం ఎందుకు కొరవడింది? ప్రజలకు సుఖంగా ఉండడానికి పంచాయితీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ వ్యవస్థలను ఏర్పరచుకున్నాం.  ఈ వ్యవస్థలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవ చేసేవారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే వారందరూ ప్రజలకు సేవకులు. పై వారందరి జీతాలు మనం చెల్లించే పన్నుల నుండి చెల్లించబడుతున్నాయి. సర్పంచ్ కాని, ఎం.ఎల్.ఏ. కాని, ఎం.పి. కాని వీరందరూ ప్రజలకు సేవకులే. అలాగే మంత్రులు కూడా ప్రజలకు సేవకులే.. కాని మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

ప్రభుత్వ కార్యాలయానికి వెళితే ఆ ఉద్యోగి మనను ఖాతరు చేయడు, సరిగా సమాధానం ఇవ్వడు. ఆ ఉద్యోగికి జీతమందేది మనలాంటి పౌరులు కట్టే పన్నుల నుండే అయినా వాడి ప్రవర్తనకు పౌరులే అణగి మణగి ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు సేవకులుగా ఉండవలసిన వారు యజమానులుగా మసలుకుంటున్నారు. ఈ విచిత్రమైన స్థితి మన దేశంలో నెలకొని ఉంది. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల వల్ల ప్రజలు కులాల వారిగా విడిపోతున్నారు. చట్టాలు చాలా ఉన్నాయి. కాని అవి పాటించే నిబద్ధత ఏది? చట్టం నుండి ఎలా తప్పించుకోవచ్చో అధికారులే బోధిస్తుంటే.. నైతిక విలువలు ఎలా రక్షింప బడతాయి? లోపం వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తిని సంస్కరించాలి. బాగుచేయాలి. ఈ దేశంలో నివసించే మేమందరం ఈ భారతమాత సంతానం, మేమందరం ఒకే కుటుంబం - ఈ భావన నిర్మాణం కావాలి.

శారీరిక ప్రదర్శన నిర్వహిస్తున్న స్వయంసేవకులు

ఈ భావన నిర్మాణం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కృషి చేస్తున్నది. నిత్య శాఖా కార్యక్రమాల ద్వారా అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఆటపాటల ద్వారా మనమంతా ఒకటే అనే భావన, ఆటల ద్వారా విజిగీషు ప్రవృత్తి... ఇలా ఒకటేమిటి ? రకరకాల శారీరిక, మానసిక కార్యక్రమాల ద్వారా ఆ వ్యక్తిలో సంస్కారాలను నింపే ప్రయత్నాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ శిక్షావర్గలు. ఈ ఇరవై రోజుల శిక్షావర్గలో స్వయంసేవకులు అన్ని ఖర్చులు తామే భరించి పాల్గొంటారు. శిక్షావర్గ సవ్యంగా జరగడానికి శిక్షకులు, ప్రబంధకులు వర్గలో పాల్గొంటారు. ప్రబంధకులుగా వచ్చిన వారు తమకు ఏ విభాగం పని అప్పజెప్పితే ఆ విభాగం పని చూసుకుంటారు. అంతే తప్ప నేను ఈ పనే చేస్తాను, ఆ పని చేయను, అని అనరు. ఈ మనస్తత్వం సంఘ శిక్షావర్గ ద్వారానే లభిస్తుంది. నిత్య శాఖ, శిక్షావర్గల ద్వారా బాధ్యతాయుతమైన వ్యక్తులు తయారు చేయబడతారు. ప్రతి క్రియాశీలమైన వ్యక్తి సమాజంపై ప్రభావం చూపాలి. అతడు ఎక్కడ పనిచేసినా అతని ప్రభావం ఆ చుట్టుప్రక్కల ప్రసరించాలి. మన లక్ష్యమైన ఈ దేశ పరమ వైభవ స్థితిని సాధించ గలుగుతాము. నిత్య శాఖ, శిక్షావర్గలో నిర్మాణమైన క్రియాశీలమైన కార్యకర్తల ద్వారానే ఇది సాధ్యమౌతుంది" అని చెపుతూ శ్రీ వేణుగోపాల రెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు.

"ఆపన్నులను ఆదుకోవాల్సిన బాధ్యత హిందువులదే"

ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్ లో శ్రీ అమరలింగన్న 

సార్వజనికోత్సవ వేదికపై హాజరైన శ్రీ బండారి రమేశ్, శ్రీ దేశ్ ముఖ్, శ్రీ నంగునూరి చంద్రశేఖర్, శ్రీ ప్యాట వెంకటేశ్వర్లు, శ్రీ అమర లింగన్న

"హిందూ సమాజ సంఘటన కోసం డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ నాగపూర్ లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నేడు మహా వటవృక్షం మాదిరిగా విస్తరించి అనేక సామాజిక రంగాలలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. హిందూ సమాజంలోని ఆపన్నులను ఆదుకోవడానికి సంఘం దేశంలో సుమారు లక్షకు పైగా సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్నది. సమాజంలోని ఆపన్నులను ఆదికోవాలన్న స్ఫూర్తి స్వయంసేవకులకు సంఘ శాఖ ద్వారా లభిస్తుంది" అని ఆర్.ఎస్.ఎస్. ప్రథమ వర్ష సంఘ శిక్షావర్గ సమారోప్ ఉత్సవంలో శ్రీ అమర లింగన్న పేర్కొన్నారు. 

భాగ్యనగర్ శివార్లలోని అన్నోజీగూడ గ్రామంలో గల రాష్ట్రీయ విద్యాకేంద్రం ప్రాంగణంలో మే 6వ తేదీ నుండి 20 రోజుల పాటు  ప్రథమవర్ష శిక్షావర్గ జరిగింది. మే 25వ తేదీ సాయంత్రం జరిగిన సార్వజనిక ఉత్సవంలో శ్రీ లింగన్న మాట్లాడుతూ హిందూ సమాజంలోని ఆపన్నులను, అనాథలను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత హిందువులదేనని ఈ దిశగా స్వయంసేవకులు కృషి చేస్తున్నారని చెప్పినారు.

ఇంకా మాట్లాడుతూ - "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 86 సంవత్సరాలుగా హిందూ సమాజ సంఘటన మాధ్యమంగా ఈ దేశ వైభవం కోసం పని చేస్తున్నది. వ్యక్తులలో శారీరిక, మానసిక వికాసం ద్వారా వ్యక్తి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నది.  

చిన్నప్పటి నుంచే దేశభక్తి గల డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ డాక్టర్ చదివినప్పటికీ, తమ ఆనందమయ జీవితాన్ని భారతమాత పాదాల వద్ద సమర్పణ చేశారు. వారు అనేక స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలలో పాల్గొన్నారు. పిడికెడు మంది ఆంగ్లేయులు ఇంత పెద్ద దేశాన్ని బానిసగా చేసుకోవడానికి కారణం కేవలం వారి శక్తి మాత్రమే గాక, ఇక్కడి ప్రజల అనైక్యత, దేశ ద్రోహుల సహకారం అని డాక్టర్ జీ గుర్తించారు. దీనికై హిందూ సంఘటనా కార్యాన్ని చేయాలని సంకల్పించి, 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని స్థాపించారు. 

భగవాధ్వజానికి ప్రదక్షిణ చేస్తూ సంచలనం చేస్తున్న స్వయంసేవకులు

35 సంవత్సరాల వయసు ఉన్న డాక్టర్ జీ పిల్లలతో ఆడుకోవడం చూసి అందరూ పిచ్చి వాడనుకున్నారు. కాని ఆ చిన్న పిల్లలే పెద్దవారై ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా అవతరించారు. వారిలో బాలాసాహెబ్ జీ, ఏకనాథ్ జీ, మాధవరావు మూలే - ఇలా ఎందరో మహానుభావులున్నారు.  

రాబోయే సంవత్సరం స్వామి వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నారు. స్వామీజీ హిందూ సమాజ పరివర్తన కోసం పరితపించారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు గల యువకులు కావాలన్నారు. ఇటువంటి వారిని సంఘంలో డాక్టర్ జీ తయారు చేశారు. పేదల అభివృద్ధి కోరారు స్వామి వివేకానంద. స్వామీజీ ఏదైతే కోరుకొన్నారో దానిని సంఘం చేస్తున్నది. 

సంఘంలో నిర్మాణమైన కార్యకర్తలు అనేక రంగాల్లోకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించారు. పేదల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామ భారతి పేర గ్రామ వికాసం, సేవా భారతి పేర అనేక సేవా కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయి. అటువంటివి లక్షకు పైగా ప్రకల్పాలు దేశవ్యాప్తంగా నిరంతరంగా జరుగుతున్నాయి. అప్పటి రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ కు వెళ్ళారు. అక్కడ కేవలం రెండు గంటలు మాత్రమే ఉండాలనుకొన్నవారు  రోజంతా ఉన్నారు. అక్కడి గ్రామ వికాసం చూసి ఆశర్యపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి ఈ విధంగా గ్రామ వికాసం కోసం కృషి చేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా గ్రామ వికాసం కోసం ఆర్.ఎస్.ఎస్. పని చేస్తోంది.   


శారీరిక ప్రదర్శనలు చేస్తున్న స్వయంసేవకులు

అలాగే కొండ కోనల్లో వనవాసీ కళ్యాణ ఆశ్రమం పని చేస్తున్నది. ఒక లక్షా ఇరవై అయిదు వేల మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నది. 

ఈశాన్య రాష్ట్రాల్లో సంఘం ప్రవేశించిన కారణంగా క్రైస్తవులుగా మారిన వారిని పునరాగమనం గావించి వారిలో స్వాభిమానం నిర్మాణం చేసింది. త్రిపురలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ద్వారా తయారయిన కిషన్ చంద్ అనే విద్యార్థి ఐ.ఏ.ఎస్.కు సెలెక్ట్ అయ్యాడు. అలాగే క్రీడలలో క్రీడా భారతి పని చేస్తున్నది. 

1963 లో ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజంలో ధార్మిక జాగరణ చేస్తున్నది. దేశ వ్యాప్తంగా నేడు హిందువులు ధార్మికంగా జాగృతమవుతున్నారు.  

ఈ విధంగా నేడు అన్ని రంగాలలో హిందూ సమాజం జాగరితమవుతున్నది. దీనికి కారణం డాక్టర్ హెడ్గేవార్, వారు ప్రారంభించిన సంఘం. అయితే ఇది చాలా తక్కువ. ఇది చాలదు. దీనిని పెద్దలు గ్రహించాలి. పూర్తి సమాజంలో స్పందన రావాలి. దానికోసం ఇంకా ఎక్కువగా పని చేయాలి.  

నేడు మనం ప్రమాదపు అంచుల్లో ఉన్నాం. మన గల్లీలోకి మత మార్పిడులు, లవ్ జీహాద్ వంటి సమస్యలు ప్రవేశిస్తున్నాయి.  

ఈ సమస్యలన్నీ తీరాలంటే సమాజంలోని సర్వ సాధారణ వ్యక్తి స్పందించాలి. అపుడే ఈ దేశంలో మార్పు వస్తుంది. మా పిల్లవాడు నిజాయితీ గల ఆఫీసర్ కావాలని ప్రతి తల్లిదండ్రి కోరుకోవాలి. సంఘానికి సానుభూతి కాదు, సహకారం కావాలి. ప్రతి వ్యక్తి తమవంతు శక్తిని అందించడానికి ముందుకు రావాలి. అప్పుడే "వ్యక్తి వ్యక్తిలో సంస్కార నిర్మాణం" అనే సంఘ లక్ష్యం నెరవేరుతుంది.

సుభాష్ చంద్ర బోస్, సావర్కర్, వివేకానంద వంటి వారు దేశభక్తులు. వారు కోరుకున్న లక్ష్యాన్ని మనం విస్మరించరాదు. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే నవ యువకులు ముందుకు రావాలి. తమ నవ యవ్వనాన్ని సమర్పించాలి.  

డాక్టర్ జీ విజయం వరించటం మాత్రమే నేర్పారు. విజయమంటే విజయమే. అది నష్టంతో కూడిన విజయం కాదు. గొప్ప విజయం మాత్రమే. దీనిని లక్ష్యంగా పెట్టుకొని మనం మన పనిలో ముందుకు సాగుదాం" అంటూ శ్రీ అమర లింగన్న ప్రసంగాన్ని ముగించారు.  

20 రోజుల పాటు మండు వేసవిలో జరిగిన ఈ శిక్షావర్గలో పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 627 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. శారీరిక, బౌద్ధిక అంశాల్లో శిక్షణ పొందారు. ఈ శిక్షణకు ఎవరి ఖర్చులు వారే భరించారు. 

సార్వజనికోత్సవంలో శ్రీ బండారి రమేష్, శ్రీ దేశ్ ముఖ్, శ్రీ నంగునూరి చంద్ర శేఖర్, శ్రీ ప్యాట వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.

చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య

రాగి పాత్ర

గత సంచిక తరువాయి భాగం

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని నిద్ర లేచిన వెంటనే త్రాగుట వలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.

ప్రాతఃకాలమున జలపానము : నిద్రించే ముందు రాత్రి రాగి పాత్రలో నీటిని సుమారు 800 మీ.లీ. వరకు నిల్వ ఉంచవలయును. ఆ నీటిని మరునాటి ఉదయం నిద్ర లేచిన వెంటనే త్రాగవలయును. ఇటుల చేయుటవలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు.

ముక్కు రంధ్రములను నీటిని పీల్చి శుభ్రము చేయుట

వ్యాయామము : ఆరోగ్య పరిరక్షణకై ప్రతిరోజూ తేలికగా బలము ననుసరించి వ్యాయామం చేయవలయును. శరీరమునకు ఆయాసం కలిగించు పనిని వ్యాయామమందురు. అన్ని ఋతువుల యందును అర్థ బలముగా వ్యాయామం చేయవలయును. అర్థ బలమనగా నోటి ద్వారా వాయువు బయటకు వెడలు అవస్థ. నుదురు, చంకలు, కాళ్ళు, చేతుల యందు చెమట పుట్టిన అర్థబలమని తెలుసుకుని వ్యాయామం ఆపివేయాలి. అంతకంటే ఎక్కువగా వ్యాయామం చేయరాదు. వ్యాయామం నిమిత్తం ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ననుసరించి సూర్యనమస్కారములు, యోగాసనములు, వేగముగా నడచుట లేక ఆటలు ఆడుట మొదలైనవి చేయవచ్చును.

సూర్యనమస్కారములు

అభ్యంగము : అభ్యంగమనగా శరీరమంతటా తైల మర్దన చేయుట. తైల మర్దన వలన శరీరమునందలి అన్ని అవయవములు చైతన్యవంతమగును. కండరములకు బలము కలుగును. నాడీ మండలము ఉత్తేజితమగును. రక్త ప్రసరణ బాగుగా జరుగును. చర్మకాంతి, సౌందర్యము పెరుగును. శరీరము తేలికగానగును. వాత వ్యాధులను రానివ్వదు. శరీర పటుత్వము పెరిగి పుష్టి, ఆయుష్షు పెరుగును. చక్కటి నిదుర కలిగించును.

ఆరోగ్యమును కోరువారు ప్రతిరోజూ ఉదయం కాలకృత్యముల తరువాత తైలమర్దన చేసుకొనుట మంచిది. చేతుల చివరి నుండి భుజముల వరకు, అటులే కాళ్ళు చివరి నుండి తొడల భాగము వరకు, కీళ్లలో గుండ్రముగా, ఛాతీపై ఎక్కువ వత్తిడి లేక మృదువుగా, వెన్నెముక పైనుండి క్రిందకు మరల క్రింది నుండి పైకి మర్దన క్రియ చేయవలయును. ప్రతిరోజూ కుదరక పోయినచో కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.

- దినచర్య మిగిలిన భాగం వచ్చే సంచికలో.. 

డా.పి.బి.ఏ.వేంకటాచార్య

కాశ్మీర్ లో వేర్పాటువాదం అనేది ఉన్నదా?

కలియుగాబ్ది 5113 , శ్రీ ఖర నామ సంవత్సరం, మాఘ మాసం

జనవరి 29వ తేదీనాడు "జమ్మూ కాశ్మీర్ నిజాలు - సమస్యలు - పరిష్కారాలు" అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించబడింది. ఆ సదస్సులో జమ్మూ-కాశ్మీర్ అధ్యయన కేంద్ర ప్రముఖులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సభ్యులు శ్రీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ సమస్యపై ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. 

జమ్మూ కాశ్మీర్ మూడు భాగాలు. అవి 1) జమ్మూ, 2) కాశ్మీర్, 3) లద్దాక్. ఈ మూడు భాగాలలోని కాశ్మీర్ లో, అందులోనూ కాశ్మీర్ లోయలో జరుగుతున్న విషయాలు మాత్రమే దేశానికి, ప్రపంచానికి పత్రికా రంగం ద్వారా తెలుస్తున్నాయి. మిగిలిన భాగాలలోని ప్రజలు ఏమి మాట్లాడుతున్నారనే విషయం అసలు ప్రాధాన్యత లేనట్లుగా అక్కడి వ్యవహారాలు సాగుతున్నాయి. కాశ్మీర్ లోయలో కూడా 200 సున్నీ కుటుంబాలు చేస్తున్న అలజడి మాత్రమే వేర్పాటువాదం. జమ్మూ కాశ్మీర్ లోని 84% మంది ప్రజలు వేర్పాటువాదులు కాదు. ప్రత్యేక వాదులూ కాదు, వారు పూర్తిగా జాతీయవాదులు.

జమ్మూ కాశ్మీర్ లో 370 వ ప్రత్యేక అధికరణాన్ని కూడా చాలా వివాదాస్పదం చేసి దానిని దుర్వినియోగ పరుస్తున్నారు. కాశ్మీర్ లోని అసలు సమస్యకు మూల కారణం డిల్లీలోని రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగము, మానవ హక్కుల సంఘాల వాళ్ళు. అక్కడి తీవ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని అక్కడ ఉన్న సామాన్య ప్రజలు, జాతీయ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాశ్మీర్ అసలు సమస్య పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తం చేయడం. దీనికి మన పార్లమెంటు 1994 ఫిబ్రవరి 22 న ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. పాక్ ఆక్రమణలోని కాశ్మీర్ ను విముక్తం చేయటమే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం. దాని గురించి ఏమి చేస్తున్నారో చెప్పరు. పైగా బయట మాత్రం మరోరకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలు సరిగా ప్రజలకు అర్థం కావాలి.

పాకిస్తాన్ తో జరిగిన అన్ని యుద్ధాల సమయంలోనూ, అందులోనూ ముఖ్యంగా కార్గిల్ యుద్ధం సమయంలో అక్కడి సామాన్య ప్రజలు పాకిస్తాన్ పట్ల ఎలా స్పందించారో గమనించవలసిన అవసరం ఉంది. వారు అన్ని సమయాల్లో పాకిస్తాన్ ఆక్రమణను పూర్తిగా వ్యతిరేకించి, మన సైన్యానికి పరిపూర్ణంగా సహకరించారు.

మన ప్రభుత్వాలు మరో విషయాన్ని 1947 నుండి ఇప్పటి వరకు తేల్చటం లేదు. పాకిస్తాన్ నుండి, పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ నుండి దేశ విభజన సమయంలో తమ రక్షణ కోసం కాశ్మీర్ చేరిన 10 లక్షల మంది శరణార్థులకు రక్షణ లేదు. కనీసం వారికి మానవహక్కులు కూడా కల్పించటం లేదు. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగాల నుండి వచ్చినవారిని తిరిగి వారి స్థానాలకు సురక్షితంగా పంపేందుకు ఏమి చేస్తున్నారో చెప్పరు.

కాశ్మీర్ లో ఓ.బి.సి. కి రిజర్వేషన్లు లేవు. ఎస్.సి., ఎస్.టి. లకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఇవి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పరు. కాని వేర్పాటువాదులతో చర్చలు జరుపుతామంటున్నారు. ఈ విషయాలు దేశమంతటా తెలియవలసిన అవసరం ఉంది. కాశ్మీర్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాము. 

విదేశంలో స్వదేశీ !


వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే కాదు, మన ఆలోచనలు ప్రణాలికలూ కూడా స్వదేశీ అనే సిద్ధాంతం మీద ఆధారపడినప్పుడే మనం నిజమైన అభివృద్ధి వైపు పయనించగలం. ఒక్కమాట! జ్ఞాపకం ఉందా? నిన్నగాక మొన్న మన లోక్ సభలో 'వాల్ మార్ట్' (విదేశీ పెట్టుబడులు) మీద రగడ జరిగిన సందర్భంగా కపిల్ సిబాల్ గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. వాల్ మార్ట్ కి మన వాణిజ్యాన్ని తాకట్టు పెట్టాలని యూపియే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి సర్వత్రా వ్యతిరేకత వచ్చేసరికి, తట్టుకోలేక కపిల్ సిబాల్ గారు ఇలా అన్నారు -

"సరే! ఇక మనం కార్లలో తిరగడం మానేసి రిక్షాల్లో తిరుగుదాం!".
ఇదండీ ! మేధావి అయిన సిబాల్ గారి మనసులో మాట. ఇందులో తప్పేముంది అంటారా? ఇక్కడ సమస్య కార్లు, రిక్షాలు కాదు. మన నాయకులలోని బానిస స్వభావం, భావదాస్యం, బౌతిక దారిద్ర్యం. వీరి అభిప్రాయంలో భారతదేశం ఒక పాత చింతకాయ పచ్చడి. భారతీయులు వెనుకపడినవారు, ముందుకు వెళ్లలేనివారు. మన ఆలోచనలు వెయ్యి సంవత్సరాలు వెనుకకు ఉంటాయి. కాబట్టి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన పాశ్చాత్యుల విధానాలు మనకి కావాలి. అంధ అనుకరణ మాత్రమే మనను "ఉద్ధరిస్తుంది". సరే! ఒప్పుకుందాం. స్వదేశీ కావాలంటున్న భారతీయులు అజ్ఞానులే. ఐతే మనకి స్ఫూర్తినిస్తున్న, మార్గదర్శనం చేస్తున్నారనుకొంటున్న పాశ్చాత్యుల పరిస్థితి చూద్దాం.

ప్రపంచ దేశాల నెత్తిమీద "ఆర్ధిక సరళీకరణ" విధానాలు రుద్దిన అమెరికా సంగతి చూడండి. ఇదే విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.


ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయానికి పది లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. అది ఇప్పుడు పదిహేను కోట్ల డాలర్లకి పెరిగింది. పేదరికంలో జీవించేవారి సంఖ్య 48 శాతానికి పెరిగింది. అమెరికా ఉద్యోగాలు అన్నీ భారతీయులూ, చైనీయులూ ఎగరేసుకుపోతున్నారనీ, ఆ ఉద్యోగాలు అమెరికా వారికే ఇవ్వాలని ఒబామా అంటున్నాడు. అమెరికా వారు అమెరికా వస్తువులనే ఉపయోగించాలని అయన పిలుపునిచ్చాడు. అమెరికా కూడా స్వదేశీ జపం మొదలుపెట్టింది. దీనికి మన నాయకులేమంటారో? ఒబామా కూడా సంఘ పరివార్ వాడేనంటారేమో ! అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా తేలేదేమంటే భారతీయ సిద్ధాంతమే సరైనదని మరోమారు నిరూపితమైంది. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా..!  

- ధర్మపాలుడు

హిందూ దేశంలో గుడిగంటకు నిషేధం


భారతదేశం హిందూదేశం. ఇక్కడ ఏ మతాన్నయినా ఆచరించవచ్చును. అభ్యంతరం లేదు. కానీ వింత ఏమిటంటే భాగ్యనగరంలో ఒక దేవాలయం గంట మ్రోగటం అనేది పెద్ద వార్త అయింది. ఎందుకంటారా! గంట కొట్టాలంటే మహమ్మదీయుల అనుమతి కావాలని పోలీసులు అంటున్నారు. జనవరి 27 శుక్రవారం నాడు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ దేవాలయంలో గంట మ్రోగగా విని 300 మంది భక్తులు గుడికి వచ్చారు. గంట మ్రోగుతుందని ముందుగా పసిగట్టిన రాపిడ్ ఏక్షన్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మొహరించారు. ఇదీ వార్త. హిందువులకు స్వదేశంలోనే గంట కొట్టే స్వేచ్ఛ లేకపోయింది. 

సాక్షి 28/1/2012 వార్తా ఆధారంగా..

-ధర్మపాలుడు

ఆహా మోడీ.. ఓహో మోడీ.. - ఇట్లు కాంగీ


"నరేంద్ర మోడీ కార్యదక్షత గల నాయకుడు. తెలివైన వ్యూహకర్త. మోడీ తన పాలనలో ఎన్నో విజయాలు సాధించారు" అని వివరిస్తూ అయన సాధించిన విజయాల వివరాలు కూడా ప్రకటించారు. నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కూడా ముద్రించారు. ఇదంతా ఎవరు చేశారో తెలుసా?

గణతంత్ర దినోత్సవం  సందర్భంగా గుజరాత్ కాంగీయులు రెండు పుటల ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. (పత్రికలలో ముద్రించబడింది) ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించినా కూడా వాస్తవమే. గుజరాత్ లో ఆది నుండి జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ కాంగీ వారు పొరపాటున నిజాలు ఒప్పుకున్నారు. తరువాత నాలుక కరచుకున్నారు. క్రొత్త డిల్లీ నుండి వీరికి చీవాట్ల కానుక లభించినట్లుగా అభిజ్ఞుల సమాచారం.

సాక్షి 28/1/2012 వార్తా ఆధారంగా..

-ధర్మపాలుడు
 

విద్య నీలోని అంతఃచేతన

వివేక సూర్యోదయం - ధారావాహికం - 2

 

విత్+య=విద్య అన్నారు. అంటే అంధకారమును పోగొట్టునది అని అర్థం. నరేంద్రుడు తన మనో వికాసాన్ని, అంధకారాన్ని వదిలించుకుని వివేకానందుడయ్యాడు. పశ్చిమగడ్డమీద  భారతీయ శంఖారావం పూరించాడు. భారత భాగ్యోదయ భానుడయ్యాడు. పశ్చిమ దేశాలలో అయన కొన్ని విషయాలు గమనించాడు.

బాగా చదువుకున్న వాళ్ళు కూడా, మన మతం గురించి మాట్లాడినప్పుడు ముక్కుపుటాలు 45 డిగ్రీల కోణంలో ఉంచి "అది కేవలం విగ్రహారాధన" అన్నారు. అది వారి సంకుచిత దృక్పథం. వారు డాలర్లను ఆరాధిస్తారు. ఆస్తులు కలిగి ఉంటారు. మట్టి ముద్ద అయినా, కనుగొన్న యంత్రమైనా, అవి కేవలం భౌతికమైన అధీనతకు అతీతంగా ఆలోచించాల్సినవే. విద్య నాగరికతను ఇనుమడింప చేయాలి. విజ్ఞతను పెంచాలి. 'మత సహనం' గురించి పుస్తకాల్లో చదవడము నాకు ఎక్కడా కనబడలేదు. మతసహనం, మతాన్ని గురించి సహకార భావన, సానుభూతి ఏమైనా ఉన్నాయి అంటే అది మనదేశంలోనే. అది భారతీయుల సొత్తు. అందుకే మహమ్మదీయులకు, క్రైస్తవులకు ప్రార్థనామందిరాలు ఇక్కడ కట్టించారు. ఇతర దేశాలకు వెళ్లి మహమ్మదీయులెవరైనా హిందువులకు ఆలయాలు కట్టించారేమో చూడండి. నిన్ను, నీ ఆలయాన్ని నిర్మూలించాలనే వీరు చూస్తారు. భారత్ నుంచి అందరూ నేర్చుకోవాల్సింది ఇదే. అంతటా ఉన్న పరమాత్మ ఒకరే అని. ఆంగ్లేయుల వలస పాలనలో ప్రతిరోజూ భారతీయులపై జరిగే అత్యాచారాల గురించి దినపత్రికల్లో చదువుతూనే ఉన్నాం. నేను బాధపడని రోజు లేదు. కాని తరువాత ఆలోచిస్తే దీనికి కారణం ఆంగ్లేయులు కాదు, మనమే అని అర్థమవుతుంది. హిందువులు ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి. మన బాధలకు మనమే కారణమని బోధపడుతున్నది. సామాన్య ప్రజలు అహంకారపూరితులైన మన పూర్వుల పదఘట్టనల క్రింద నలిగి నిస్సహాయులై ఉన్నారు. పుట్టు బానిసలుగా, వారిని నమ్మించారు. గొప్పలు చెప్పుకునే మన ఆధునిక విద్యావిధానం వీరిని ఉద్ధరించలేక పోయింది. చదువుకున్న, చదువుకుంటున్న వారికి వీరి గురించి చెబితే తమ బాధ్యత నుంచి పారిపోయే విధంగా వణకడం నాకాశ్చర్యం కల్గిస్తోంది. దాన్ని వారి 'ఖర్మ'గా అభివర్ణించే అర్థం లేని వాదనలు కూడా వినబడుతుంటాయి. చదువుకున్నవారు ఈ నిస్సహాయుల్ని ఆదుకునేందుకు ముందుకు రాకపోతే వారు మోసగాళ్ళే అవుతారు. దీన్ని పరమోత్కృష్ట 'కర్మ'గా భావించి విద్యావంతులు ముందుకు రావాలి. అయినా ఈ దీనుల్ని ఉద్ధరించడానికి మనం ఎవరం? ఎవరికైనా సహాయం చేయాల్సివస్తే అందులో మన గొప్పదనం ఏదీ లేదు. మనకు మనం ఎక్కువగా ఊహించుకోనక్కరలేదు. వారిలో భగవంతుణ్ణి చూసి సేవ చేయాలి. అది మనకొక వరం. అదే చదువరులుగా మన సంస్కారం.

మన విద్య, విజ్ఞానం, పుస్తకాలు, ఉద్గ్రంధాలు ఇవన్నీ 'ఆత్మను తెలుసుకోవడం' గురించే నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆత్మలోని చైతన్యాన్ని తెలుసుకోమంటున్నాయి. బెంగాలీ కవులు వ్రాసిన అనేక పాటలు, బెంగాలీ ప్రజల్లో వీథివీథినా, గ్రామ, గ్రామంలో పాడుకుంటారు. ఆ పాటల పరమార్థం 'ఆత్మశక్తి'ని గ్రహించడమే. భగవంతుణ్ణి తెలుసుకోవాలి, అనుభూతి చెందాలి, చూడాలి. ఆయనతో మాట్లాడాలి. ఇదే ఇక్కడ 'మత' భావనకు ముగింపు. దీన్ని అనుష్టించిన వేలాది భారతీయ సంతుల పరమోత్కృష్ట జీవనమే 'మత' భావనకు భూమిక నేర్పరిచింది. అందుకే విద్య మనిషిలోని 'ఉత్క్రుష్టత'కు ప్రకటీకృత రూపమైతే, మతం మనిషిలోని దైవత్వాన్ని ప్రకటిస్తుంది. అందుకే ఈ రెండు విషయాలలో దారిలోని ప్రతిబంధకాలు తొలగించడమే గురువు పని. దారిని శుభ్రం చేయడమే మనపని, మిగిలినవి భగవంతుడు చూసుకొంటాడు. అందుకే 'విద్య' అంటే కేవలం పుస్తకాలు నమిలేయడం కాదు. మనిషిని యంత్రంలా చేసేది విద్య కాదు. కేవలం మేధో వికాసమే కాదు, ఆత్మవికాసం కూడా సాధించాలి. ఆత్మవికాసం పొందిన వ్యక్తులతో ఏర్పడిన సమాజమే చైతన్యవంతమైన సమాజం అవుతుంది.

- హనుమత్ ప్రసాద్  

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం భారతదేశంలో మాత్రమే ఉన్నది


ఇటీవల కంచ ఐలయ్య "హిందూ మతానంతర భారతదేశం" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ డా.ఎం.ఎఫ్.గోపీనాద్ ఆంధ్రజ్యోతి పత్రికలో హిందూమతంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేదని నిరాధారమైన, అభ్యంతరకరమైన విమర్శలు చేశారు. 

భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేకపోయినట్లయితే ఈ దేశంలో అనేక మతాలూ, సాంప్రదాయాలు వికసించేవే కావు. ఈ దేశంలో జన్మించిన బౌద్ధం, జైనం ఈ దేశంలోనే కాక, ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాపించింది. పంజాబ్ లో సిఖ్ సాంప్రదాయం వికసించింది. ఈ దేశంలో క్రైస్తవం, ఇస్లాం మతాలూ ఎట్లా వ్యాపించాయో మనందరికీ తెలుసు. ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు సహజీవనం చేస్తున్న దేశం ఒక్క భారతదేశమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో మహమ్మదీయుల జనాభా 1947 నాటికి 7 శాతం ఉంటే నేడు అది 14 శాతానికి చేరింది. అదే పాకిస్తాన్ లో విభజన నాటికి హిందువులు 28 శాతం ఉంటే నేడు అది 2 శాతానికి పడిపోయింది. మరి, ఏ దేశంలో మతసహిష్ణుత, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఉన్నట్లు?

వాస్తవానికి హిందూమతం అనేది ఈ దేశంలో లేదు. హిందుత్వం అంటే ఈ జాతి ప్రజల జీవనవిధానం, సంస్కృతీ. ఈ దేశంలో షణ్మతాలు అయిన శైవం, వైష్ణవం, శాక్తేయం, గానపత్యం, సౌరసిద్ధాంతం, షణ్ముఖ తత్త్వం - ఈ ఆరు ఆదిశంకరుల కంటే ముందు నుండే ఈ దేశంలో ఉన్నాయి. ఆ తదుపరి కాలంలో ఆవిర్భవించిన బౌద్ధం, జైనం, అకాలీ వంటి మతాలూ కూడా ఈ దేశంలో వికసించి పరిదవిల్లుతున్నాయి. జీవిస్తున్న జీవన విధానమే హిందూ జీవన విధానం. హిందూ సమాజం అత్యంత ఉదారమైనది కాబట్టే కంచ ఐలయ్య లాంటి వారు "నేను హిందువునెట్లైత", "హిందూ మతానంతర భారతదేశం" వంటి హిందుత్వ వ్యతిరేక పుస్తకాలు, వ్యాసాలూ వ్రాసికూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. ఒకవేళ ఈ ఉదారవాదం లేకపోయినట్లయితే సాల్మన్ రష్డీ, తస్లీమా నస్రీన్ ల వలె స్వదేశాన్ని వదలి ప్రవాస జీవితం గడపవలసి వచ్చేదేమో! 

ఈ దేశంలో  ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉండటం వల్లనే రాజకీయ పక్షాలు, సెక్యులరిస్టులు మైనార్టీలను సమర్థిస్తూ మైనారిటీయిజాన్ని అభివృద్ధి చేయగలిగారు. వారి మెప్పు కోసం హిందూ సమాజంలో భేదభావాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వారి వ్యక్తిగత ప్రచారం కోసమో, విదేశీ పర్యటనల కోసమో, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలో ఉండే ప్రాయోజిత సంస్థల మెప్పు కోసమో వ్రాస్తున్నారు. ఇక్కడి పత్రికా రంగం కూడా ఇటువంటి కుహనా సెక్యులరిస్టులను   ప్రోత్సహిస్తున్నట్లుగా కనబడుతున్నది. హిందూ సమాజంలోని సామాన్య ప్రజలలో కుల, మతపరమైన  భేదభావాలను సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్న కంచ ఐలయ్య వంటి వారి విషయంలో హిందూ సమాజం అప్రమత్తంగా, జాగృతంగా ఉండాలి.

- పతికి

పాక్-బంగ్లాలలో అనిశ్చిత స్థితిలో ప్రజాస్వామ్యం


అఖండ భారతదేశం నుండి విడిపోయిన రెండు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో జరుగుతున్న పరిణామాలు మనకు ఆందోళన కలిగిస్తునాయి. ఈ దేశాల్లో తరచూ తలెత్తుతోన్న అంతర్గత సంక్షోభాలు మనదేశంపై కూడా ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మనకు సంబంధం లేకున్నా భవిష్యత్ పరిణామాల దృష్ట్యా వాటి గురించి చర్చించుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.  

అటు పాకిస్తాన్ లోనూ, ఇటు బంగ్లాదేశ్ లోనూ ప్రజాస్వామ్యం అంతగా పరిడవిల్లిన  దాఖలాలు చాలా తక్కువ. ఈ రెండు దేశాల్లోనూ పౌరపాలన కన్నా సైన్యందే పైచేయి. ఆ సైన్యంలోనూ జీహాదీ వంటి మతోన్మాద శక్తులదే పైచేయిగా ఉంటోంది. బంగ్లాదేశ్ లో పౌర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడింది ఓ ప్రముఖ మతోన్మాద సంస్థతో సంబంధం ఉన్న సైనికాధికారులే. ఆ సైనికాధికారుల్లోని విభేదాలతో అదే సైన్యం ఈ కుట్రను బట్టబయలు చేసింది.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకులు సైనిక పాలకులే. అంతకుముందు పౌర ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కిన సైన్యం కార్గిల్ చొరబాట్లకు పాల్పడింది. వీటన్నింటి వెనుకా ఇస్లామిక్ తీవ్రవాదుల కుయుక్తులున్నాయనడం బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఐ.ఎస్.ఐ. అనేది పాకిస్తాన్ సైన్యంలోని ఒక విభాగం. 

పాక్ సైన్యం జిహాదీ ఉగ్రవాదులతో చేయి కలిపిందన్నది బహిరంగ రహస్యమే. గతేడాది అమెరికా సైన్యం తుదముట్టించిన లాడెన్ స్థావరం పాక్ సైనిక స్థావరానికి అతి సమీపంలో ఉండడమే దీన్ని బలపరుస్తోంది. ఈ పరిణామంతో పాక్ సైన్యం పరిస్థితి కాలుగాలిన పిల్లిలా తయారైంది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కన్నా మతోన్మాదమే బలంగా పని చేస్తోందన్న దానికి ఉదాహరణలు కోకొల్లలు. దేశ పాలకులనే ఆదేశించే స్థాయిలో పాక్ సైన్యం ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ పౌర ప్రభుత్వాలను దెబ్బతీసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

పాకిస్తాన్ సైనిక పాలనలో మ్రగ్గిన కాలఖండం : 

1958లో మొదటిసారి పాకిస్తాన్ లో సైన్యం తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకుంది.
  • 1958-71 - మొదట అయూబ్ ఖాన్, ఆ తదుపరి ఆయాఖాన్ పాలన కొనసాగించారు.
  • 1978-88 - జియా-ఉల్-హక్ పాలించాడు.
  • 1999-2002 - పర్వేజ్ ముషారఫ్ అధికారం చెలాయించాడు.
  • 2012లో మరోసారి సైనిక పాలన దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తున్నది. 
తాజాగా ఆపరేషన్ లాడెన్ కు ప్రస్తుత పౌర ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని పాక్ సైన్యం దానిపై ఆగ్రహంతో ఉంది. అందుకే తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకొనేందుకు మరోసారి సైనిక పాలన కోసం ప్రయత్నిస్తోంది.
ఈ పరిస్థితులు మనదేశంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదుల టార్గెట్ భారత్. ఆ శక్తులకు అండదండలు అందిస్తున్నవారు పాక్, బంగ్లాదేశ్ సైన్యాధికారులు. వారి వల్లనే అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ లో పాలకుల, సైనికాధికారుల బలం భారత్ ను వ్యతిరేకించడంలో ఉంది. భారత్ లోని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావాలంటే మైనార్టీ వర్గాలను సంతృప్తి పరచటం, వారిని తమ వైపు ఉంచుకోవాలనే భ్రమలో ఉన్నారు. అటు పాక్ పాలకులు, ఇతి భారత్ పాలకుల వ్యవహారంతో భారత్ భద్రతకు ఎప్పుడూ సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. 
- హంసిని      

బిజెపి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చగలదా?

 
తెలంగాణలో సకల జనుల సమ్మె విరమణ తరువాత ఒక నిస్తేజ వాతావరణం కనిపిస్తున్నది. తెలంగాణా పొలిటికల్ జాక్ ఇచ్చిన పిలుపుతో అన్ని ఆందోళనలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో 42 రోజులపాటు సామాన్య పౌరుడు పాల్గొన్నాడు. ఈ సమ్మె సరియైన ఫలితాలు ఇవ్వకపోవడంతో అంతటా నిరాశా, నిస్పృహలు కనబడుతున్నాయి. తెలంగాణా విషయంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట నిలబెట్టుకోక తెలంగాణ ప్రజలను మోసం చేశారు. దేశంలో రెండవ జాతీయ పార్టీ అయిన బిజెపి "ఒక్క ఓటుకు రెండు రాష్ట్రాలు" అన్న కాకినాడ తీర్మానం, ఇటీవల తెలంగాణ పేరుతో ఆవిర్భవించిన పార్టీ కంటే ముందే చేశారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి "తెలంగాణ పోరు యాత్ర" పేరుతో రాష్ట్రమంతటా రథయాత్ర చేశాడు. పరిస్థితుల ప్రాబల్యంతో తాము కేంద్రంలో ఉన్న సమయంలో తెలంగాణ సమస్యను పరిష్కరించలేకపోయాము. అయినా ఆ ఉద్యమాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నామనే విషయాన్ని ఈ ఉద్యమంతో బిజెపి తేటతెల్లం చేసినట్లైంది. ఈ సమయంలో జరుగుతున్న సభలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సభలు, సభలలో పాల్గొన్న ప్రజానీకాన్ని చూసినప్పుడు తెలంగాణలోని సామాన్య ప్రజలలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నదో స్పష్టమవుతున్నది. తెలంగాణ రావాలంటే ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ సరియైన సమర్ధన ఇవ్వగల పార్టీ అధికారంలో ఉండాలి. ఆ బాధ్యత తమదని ప్రజలలో నిరూపించుకోవలసిన బాధ్యత బిజెపి పార్టీదే.

ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం వంటి ఉద్యమం ఈ మధ్య కాలంలో ఇంత దీర్ఘకాలం ఏదీ జరగలేదు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం కావలసిన ఈ అంశం కోసం వందలమంది ఆత్మార్పణ చేసుకోవటం, దశాబ్దాలపాటు ఉద్యమించటం ఆంద్రప్రదేశ్ చరిత్ర తెలియచేస్తున్నది. ప్రజలను పాలించవలసిన పాలకులే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించటం, తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీల చరిత్ర కూడా మనకు కనబడుతున్నది. తెలంగాణ పోరుయాత్ర విజయవంతం కావటమనేది సామాన్య ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒక జాతీయ పార్టీగా బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని తేటతెల్లమవుతున్నది. బిజెపి తెలంగాణ ప్రజలను కదిలించగలిగినప్పటికి వారి ఆకాంక్షను తీర్చగలదా  లేదా అనేది రాబోయే రోజులలో తేలవలసిన అంశం.

- విక్రమ్

చక్కని ఆరోగ్యానికి చక్కని దినచర్య


ఆరోగ్యముగా నుండగోరు మానవుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తమున నిదుర మేల్కొనవలెను. ఇచట బ్రాహ్మీముహూర్త మనగా సూర్యోదయమునకు 45 నిముషముల ముందు. నిదుర లేచిన వెంటనే మలమూత్రాదులను విసర్జించవలయును. ఈ రోజున మనం పండ్లను శుభ్రం చేయడానికి అనేక విదేశీ కంపినీల టూత్ పేస్టులను అధిక ధనముతో కొని, విదేశీ కంపెనీలను పోషించటమే గాక దంత సంరక్షణ కూడా సరిగా చేసుకొనలేక పోవుచున్నాము.

దినచర్య : ఆరోగ్యముగా నుండగోరు మానవుడు ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తమున నిదుర మేల్కొనవలెను. ఇచట బ్రాహ్మీముహూర్తమనగా సూర్యోదయమునకు 45 నిముషముల ముందు. నిదుర లేచిన వెంటనే మలమూత్రాదులను విసర్జించవలయును. తదుపరి దంతధావనము చేయవలయును. పండ్లు తోముకొను నిమిత్తము వగరుగా గాని, కారముగా గాని, చేదుగా గాని ఉండు చెట్ల పుల్లలను తీసుకొనవలయును. పండ్ల పుల్లల నిమిత్తము కానుగ, వేప, ఉత్తరేణి, తుమ్మ, మద్ది, ఇప్ప, చండ్ర, మర్రి, పొగడ మొదలగు చెట్ల పుల్లలను చిటికెనవేలు మందము, 6 నుండి 8 అంగుళముల పొడవు గల వానిని తీసుకొని చివర నలగగొట్టి గాని, నమిలి గాని మెత్తగా కుంచెగా చేసి ప్రతి పంటిని జాగ్రత్తగా చిగుళ్ళకు బాధ కలుగనీయకుండా పైన చెప్పబడిన చెట్ల బెరడుల మెత్తడి పొడితో శుభ్రము చేయవలెను. ప్రతి దంతాన్ని జాగ్రత్తగా మెత్తటి కూర్చంతో చిగుళ్ళకు బాధ కలుగనీయకుండా జాగ్రత్తగా శుభ్రము చేయవలెను. ఆయుర్వేదంలో కొన్నివేల సంవత్సరాల క్రితం చెప్పిన దంతధావన విధి, అందుకు వాడే చెట్ల పుల్లలను ఇప్పటికీ శాస్త్రీయంగా దంత సంరక్షకాలుగా పరిగణిస్తున్నారు. 


ఈ రోజున మనం పండ్లను శుభ్రం చేయడానికి అనేక విదేశీ కంపినీల టూత్ పేస్టులను అధిక ధనముతో కొని, విదేశీ కంపెనీలను పోషించటమే గాక దంత సంరక్షణ కూడా సరిగా చేసుకొనలేక పోవుచున్నాము. మనదేశంలో మనకు అందుబాటులో వేప మొక్క, ఇంకా అనేక మూలికలు కలవు. తాజాగా లభించు ఆ మూలికల పుల్లలతో గాని, లేక బెరడును మెత్తగా మృదువుగా పొడిచేసి అందులో కొద్దిగా కర్పూరం, లవంగములు, జాజికాయల మెత్తటి చూర్ణము కలిపి ఆ పొడితో పండ్లను తోముకొనవలయును. దంత ధావన తరువాత 10 అంగుళాల పొడవు గల వంపు కలిగిన పదను లేని ఏదేని లోహపు బద్దతో నాలుక శుభ్రం చేసుకోనవలయునని చెప్పబడినది. ఈ నాలుక శుభ్రము చేయు విధానము ప్రాచీన కాలమందే ఆయుర్వేదములో చెప్పబడింది. తదుపరి సుగంధ ద్రవ్యములతో తయారు చేయబడిన నీటితో నోటిని పలుమార్లు పుక్కిలించి నోటిని శుభ్రం చేయాలి. దీనిని గండూష విధి అంటారు. దీనివలన నోటి శుద్ధి జరిగి దుర్వాసన లేకయుండును.  

- దినచర్య తరువాయి భాగం వచ్చే సంచికలో..

 డా.పి.బి.ఏ.వేంకటాచార్య

సంస్కృత భాష 15 వ విశ్వమహాసభ

సంస్కృత మహాసభను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్
జనవరి 5న డిల్లీలో జరిగిన  సంస్కృత భాష విశ్వమహాసభలో మన ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ "సంస్కృత భాష భారతీయుల ఆత్మ. అది భాష కంటే ఉన్నతమైనది. అది ఒక విజ్ఞాన ఖని, ఒక విశ్వ సంస్కృతి, అది సంకుచితమైనది కాదు, సహనం కలిగినటువంటిది" అని చెప్పారు. 5  రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకాక్ లోని శిల్పకోర్నీ విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సహాయ ప్రాధ్యాపకుడిని "వాచస్పతి" బిరుదుతో  సత్కరించారు.   

15 వ సంస్కృత విశ్వ మహాసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మన్మోహన్ సింగ్

స్వయంసేవకులలో ఉత్సాహాన్ని నింపిన తరుణ శిబిరాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా వారీ తరుణ స్వయంసేవకుల శిబిరాలు జరిగాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శిబిరాలలో సంఘ, వివిధ క్షేత్రాల 

నవభారత పుత్రులారా! నిర్మోహితులు కండు

"ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత!" 'లెండు, మేల్కొనుడు, పరమార్ధము చేరువరకు ఆగకుడు' అని ప్రతి జీవికిని చాటి చెప్పుదుము గాక!" "లెండు, మేల్కొనుడు! దుర్బలత నుండి,