ముజఫర్ నగర్ అల్లర్లలో 10 మంది ముస్లిం నాయకులపై నేరారోపణ

 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ అల్లర్లలో ముస్లిం పంచాయత్ లలో మతహింసను రెచ్చగొట్టినందుకు విచారణ బృందం పదిమంది ముస్లిం నాయకులపై నేరారోపణ చేసింది. దీన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. ఇందులో బి.ఎస్.పి.పార్లమెంట్ సభ్యుడు ఖాదిర్ రాణా, శాసనసభ్యుడు నూర్ సలీమ్ రాణా, మౌలానా జమీల్, కాంగ్రెస్ నాయకుడు, పూర్వమంత్రి సయ్యద్ ఉప్ జమన్, ఆయన కుమారుడు సులేమాన్ సయ్యద్, నగర కాంగ్రెస్ నాయకుడు అన్సారీ తదితరులున్నారు. 
 
జనవరి 2014లో వీరిపై నేరారోపణలను ఉపసంహరించుకోవాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ జిల్లా యంత్రాంగం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై మార్చిలో అభియోగ ప్రతాలు దాఖలు చేసింది. 
 
- హనుమత్ ప్రసాద్