శృంగేరి శారదాపీఠం 37వ పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి

శ్రీ విదుశేఖర భారతి స్వామి (ఫోటో sringeri.net సౌజన్యంతో)

ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో ప్రతిష్ఠించిన చతురామ్నాయ పీఠాలలో ముఖ్యమైనది, యజుర్వేద ప్రతీక అయినది శ్రీ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఈ పీఠానికి అధిపతిని నియమించే సాంప్రదాయం, పరంపర ఆదిశంకరాచార్యుల వారి నుండి నేటివరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు 37మంది పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులయినారు. ప్రస్తుత పీఠాధిపతిగా ఉన్న శ్రీ భారతీ తీర్థస్వామి పీఠానికి 36వ పీఠాధిపది. కాగా శ్రీ భారతీ తీర్థస్వామి తన తదనంతరం 37వ పీఠాధిపతిగా శ్రీ విదుశేఖర భారతికి పట్టాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమం జయనామ సంవత్సరం మాఘశుద్ధ తదియ, 23 జనవరి 2015 నాడు శృంగేరి శారదాపీఠంలో కన్నులపండుగగా జరిగింది. 

36వ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామిచే 37వ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులవుతున్న శ్రీ విదుశేఖర భారతి స్వామి

శ్రీ విదుశేఖర భారతి స్వామి పూర్వనామం కుప్పా వేంకటేశ్వర ప్రసాద్ శర్మ. ఈయన తండ్రిగారు శ్రీ కుప్పా రామాంజనేయ శాస్త్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపండితులు. అనంతరం కీసరగుట్ట దేవస్థానం వేదపాఠశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. రామాంజనేయ శాస్త్రిగారి స్వగ్రామము గుంటూరు జిల్లాలోని అనంతవరం గ్రామం. 

శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి మార్పు అనేది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక మహత్తర సంఘటన. పీఠానికి ఒక యువకుడిని పీఠాధిపతిగా ఎంచుకొని సన్యాసదీక్ష ఇచ్చే ప్రక్రియ ఇది. 

- పతికి