370 అధికరణాన్ని కొనసాగించవలసిన అవసరం ఏముంది?

 
జమ్మూకాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన 370 అధికరణాన్ని సమీక్ష చేయవలసిన సమయం ఆసన్నమైంది. జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. తాత్కాలిక ఏర్పాటుతో 370 అధికరణమును రాజ్యాంగములో పొందుపరిచారు. 'ఇది తాత్కాలికము' అని వ్రాయబడింది. కాబట్టి మారిన పరిస్థితుల నేపథ్యంలో దీని చెల్లుబాటును సమీక్షించడం ఎంతైనా అవసరమే. చట్టమనేది తాత్కాలికంగా ఏర్పాటు అయినప్పుడు ఆరున్నర దశాబ్దాలుగా దానిని కొనసాగించవలసిన అవసరం ఏమిటి?
 
శ్రీ ఇంద్రేష్ కుమార్
ప్రముఖ ఆర్.ఎస్.ఎస్. అఖిల భారత కార్యకర్త