ఆక్రమణ - అసహనం ముస్లిం, కమ్యూనిస్టుల సహజ లక్షణాలా?

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం,
  శ్రావణ మాసం

 
భారతదేశంలో ముస్లిం, కమ్యూనిస్టులలో ఆక్రమణ, ఆసహనం వారి సహజ లక్షణాలుగా కనబడతాయి. దానితో సమస్యలు, సంఘర్షణలు తలెత్తుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ లోని షహరన్ పూర్ లో సిక్కులతో ముస్లింలు గొడవపడ్డారు. ఇంతకీ గొడవలకు కారణం ఒక భూమి వివాదం. సిక్కులకు సంబంధించిన భూమిని ముస్లింలు ఆక్రమించి గోడ నిర్మాణ పని మొదలుపెట్టారు. దానికి సిక్కుల నుండి అభ్యంతరం వచ్చింది. దానితో వారి మధ్య ఘర్షణ జరిగింది. 
 
స్థల వివాదం చట్టపరంగా పరిష్కరించుకోవచ్చు, కాని ఘర్షణలకు దిగేందుకు పూర్తి సన్నద్ధతతో వచ్చి నిర్మాణ పని మొదలుపెట్టారు ముస్లింలు.  దేశంలో ఎక్కడ ఏ చిన్న గలాటా జరిగినా దానిలో రాజకీయ చిక్కుముడులు ఉంటున్నాయి. శాంతిభద్రతలు కాపాడవలసిన అఖిలేశ్ ప్రభుత్వం తప్పంతా సిక్కులదే అన్నట్లు వ్యవహరించింది. ఇంకోవైపు బిజిపి పై మాటల యుద్ధం మొదలుపెట్టింది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఇటువంటి చిచ్చు రేపటం, దానిని ఇంకెవరిమీదో తోసివేయడం సహజం. విషయం ముస్లిములదైతే పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి గలాటాకు దిగటం వారి నైజంగా కనబడుతున్నది. అసమర్ధమైన అఖిలేశ్ ప్రభుత్వ వ్యవహారమే వీటన్నింటికి కారణం. 
 
ఇంకోప్రక్క కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలు ఈమధ్యకాలంలో పత్రికలలో ఎక్కువగా కనబడుతున్నారు. ICHR ఛైర్మన్ గా శ్రీ ఎల్లాప్రగడ సుదర్శనరావుగారికి నియమించటం వారికి కంటగింపుగా ఉన్నది. దానిపై రొమిల్లా థాపర్ నుండి రామచంద్ర గుహ వరకు అందరూ పత్రికలలో వ్యాసాలు వ్రాస్తూనే ఉన్నారు. జూలై 31న హిందూ పత్రికలో "CRST" పేరులో ఒక కమిటీ ఏర్పడిందనే వార్త వచ్చింది. (వామ పక్ష మేధావులు ఏర్పాటు చేసినది?) 'పాఠ్యపుస్తకాల కాషాయీకరణ వ్యతిరేక కమిటీ' అది. ఆ కమిటీ కర్నాటక రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్య పుస్తకాలను పరిశీలించింది. ఆ పుస్తకాలు సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఇస్లాం, క్రైస్తవానికి వ్యతిరేకంగా ఆ పుస్తకాలలో ఉన్నట్లు చెప్పారు. వాస్తవాలను వాస్తవాలుగా పిల్లలకు బోధించకూడదట. అలా బోధించటం సెక్యులరిజానికి వ్యతిరేకమట. 
 
అలాగే జూలై 27 ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో గతానుగతం శీర్షికన 'భావజాలాలకు ఆవల' శీర్షికలో రామచంద్ర గుమ ఒక వ్యాసం వ్రాసారు. దానిలో ఆయన ఏమి వ్రాసారంటే "ఒకప్రక్క చరిత్ర పరిశోధన సంస్థలపై మార్క్సిస్టుల ప్రభావం ప్రముఖంగా ఉండేది. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు వాటి చరిత్ర కాకుండా రైతులు, కార్మికుల కోణం నుండి చరిత్రను వ్రాయటం మొదలుపెట్టారు. 1960, 1970లలో ప్రపంచంలో కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావం ఉంది. ఆ ప్రభావం చరిత్రపై పడింది. అనేకమంది చరిత్రకారులు అప్పట్లో పనిచేశారు. కాని ప్రస్తుతం నియమితులైన శ్రీ సుదర్శనరావు గారు అంతగా అందరికీ తెలియని వ్యక్తి. వారు ఏవైనా పుస్తకాలు వ్రాసారో లేదు తెలియదు. కాని వారు సమర్పించిన పరిశోధన పత్రంలో 'కుల వ్యవస్థ ప్రశస్తమైన సామాజిక వ్యవస్థ అని, రామాయణ మహాభారతాలు చారిత్రక వాస్తవాలని' పేర్కొన్నారు. బహుశ ఈ కారణంగా వారి ఎంపిక జరిగి ఉంటుంది" అంటూ వ్రాసుకొంటూ పోయారు. 
 
రామాయణం, భారతాల గురించి మాట్లాడటం అంటే హిందుత్వానికి సంబంధం కాబట్టి 'విద్య కాషాయీకరణ' అని గొడవ చేస్తున్నారు. ఇది వారి అసహనం. ఇటువంటివి రాబోవు రోజులలో ఇంకా ఎక్కువ కావచ్చు. వాస్తవాలు తమ సిద్ధాంత కళ్ళద్దాలతో చూసినప్పుడు అవి అభూత కల్పనలుగానే కనబడతాయి. ఇటువంటి సిద్ధాంతకర్తల భావజాలం నుండి జాతిని కాపాడటం నేటి ఆవశ్యకత.