గాంధీజీ సర్వోదయం

హితవచనం
 
మహాత్మా గాంధీజీ
 
"నేను కలలుగన్న స్వతంత్రము కేవలం రాజకీయమైనది కాదు, క్రొత్త భావాలతో సరిక్రొత్త సమసమాజాన్ని, క్రొత్త సంస్కృతిని సృష్టించాలని అనుకొన్నాను. భూమ్మీద దేవతల పరిపాలనను రామరాజ్యం అనేవారు. రామరాజ్యంలో ప్రేమ మాత్రమే రాజ్యమేలుతుంది. అందరు కర్తవ్యదక్షులవుతారు. అస్పృశ్యతకు అతీతంగా సర్వధర్మ సమభావన అందరిలో కన్పిస్తుంది. ధర్మం దృష్టిలో అందరూ సమానులే. అందరూ చెమటోడ్చి బతుకుతారు. బౌద్ధిక, శారీరిక శ్రమజీవులంతా సమానులవుతారు. మత్తు పదార్థాల వాసన ఉండదు. స్త్రీలు గౌరవాభిమానాలందుకుంటారు. ప్రతివాడు మాతృభూమి రక్షణ కోసం బలిదానం అయ్యేందుకు తయారవుతాడు. ఇలాంటి సామాజిక స్థితిని సాధించాలని నేను కలలు కన్నా"నని గాంధీజీ చెప్పారు. దానికి ఆయన "సర్వోదయం" అని పేరు పెట్టారు.