బ్రహ్మపుత్ర నదిపై మహావారధి


ఎన్నో పుణ్యనదులకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని నదులూ స్త్రీ నామధేయంతో ఉంటే ఒక్క బ్రహ్మపుత్ర మాత్రమే పురుషనామంతో ఉన్నది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లు ఈ నదికి ఇరువైపులా ఉన్నాయి. ప్రస్తుతం పడవ మీద నది దాటడానికి గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది. ఈ నది మీద రైల్వే మరియు కేంద్రప్రభుత్వాలు సంయుక్తంగా ఒక మహా వారధి నిర్మిస్తున్నారు. 2016వ సంవత్సరంలో ఈ వంతెన అందుబాటులోకి వస్తుంది. ఇది రైలు-రోడ్డు మార్గం కూడా కలిగి ఉంటుంది. ఈ వంతెన వల్ల ఇరు ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని చీఫ్ ఇంజనీరు అజిత్ పండిత్ చెప్పారు. ఈ వంతెన మీద ప్రయాణంతో చైనా సరిహద్దు చేరడానికి 10 గంటలు మాత్రమే పడుతుంది. ఇదొక కొసమెరుపు.

- ధర్మపాలుడు