మోడీ మంత్రం జపిస్తున్న పత్రికలు


'డెవిల్స్ రీడింగ్ స్క్రిప్చర్స్' అని ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. దేశాన్ని, ధర్మాన్నీ, హిందుత్వాన్నీ దూషించడమే పనిగా పెట్టుకొన్న కొంతమంది ఈ మధ్య ఇష్టం లేకపోయినా మోడీ మంత్రాన్ని అదే పనిగా జపిస్తున్నారు. మే మాసం 28వ తేదీ 2013వ సంవత్సరం దినపత్రికల ప్రకారం "ప్రధాని పదవికి మోడీయే ఉత్తమ అభ్యర్థి" అని, "భాజపాకు అగ్రతాంబూలం" అని, "సోదిలోకి రాని రాహుల్" అని అంటూ వార్తలు వచ్చాయి. అందులో మరిన్ని వివరాలున్నాయి. "ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే భాజపా గెలుపు నిశ్చయం, మూడో స్థానానికి కాంగీ, 38శాతం ప్రజలు మోడీ ప్రధాని కావాలని కోరుతున్నారు, మన్మోహన్ సింగ్ కావాలనుకొనేవారు కేవలం 14శాతం". గత రెండు మూడు నెలలలో వివిధ సంస్థలు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన సర్వేక్షణలు సహితం ఇదే అంటున్నాయి. నరేంద్రమోడీకి ఆసేతు హిమాచలం బ్రహ్మరథం పడుతున్నారు. 

- ఈనాడు 28/5/2013 

- ధర్మపాలుడు