కర్మయోగం ప్రకారమే విధి నిర్వహణ

 
శ్రీమద్భగవద్గీతలో కర్మయోగం ప్రకారమే తాను భావోద్వేగాలకు అతీతంగా పని చేశానని, మొన్న మొన్నటి వరకు సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ విలేకరులతోమాట్లాడుతూ అన్నారు.  ఎటువంటి వత్తిడులకు లొంగకుండా డి.ఐ.జి. హోదాలో 2006 జూన్ నుండి పనిచేస్తూ ఇచ్చిన బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించే వాడినని, తన విధియుక్త ధర్మం నిర్వహించడంలో కర్మయోగ జ్ఞానం ఎంతో ఉపకరించిందని ఆయన స్పష్టం చేశారు. 
 
లక్ష్మీనారాయణ
 
భాగ్యనగరంలో పదవీకాం ముగించుకుని తిరిగి తన మాతృవిభాగం అయిన ముంబై సి.బి.ఐ.కి పయనమయ్యే తరుణంలోవిలేకరుల సమావేశంలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగాన్ని అనుసరించారు కాబట్టే విజయవంతంగా పనిచేసి మంచిపేరు సాధించి తిరిగి వెళ్లారు. జై భగవద్గీత !!
 
- ధర్మపాలుడు