పున:ప్రారంభమైన విశ్వవిఖ్యాత నలందా విశ్వవిద్యాలయం

శిథిలావస్థలో ఉన్న ప్రఖ్యాత నలందా విశ్వవిద్యాలయం, బిహార్

నలందా విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 800 సంవత్సరాలకు పూర్వం విలసిల్లిన విద్యాలయం. క్రీ.శ.473 నుండి 1193 వరకు వేలాదిమంది విద్యార్థులకు విద్యాబుద్ధులందించిన విశ్వవిద్యాలయమది. 1193లో భక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసాడు. అక్కడ ఉన్న వేలాది విలువైన గ్రంథాలు గల అతిపెద్దదైన గ్రంథాలయాన్ని తగులబెట్టాడు. బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆ విశ్వవిద్యాలయం 821 సంవత్సరాల తరువాత తిరిగి ఈ సంవత్సరం (2014) సెప్టెంబర్ 1, 2014 నాడు ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం తిరిగి భారతదేశ ఘనమైన చరిత్రను అక్షరీకరించేలా తీర్చిదిద్దబడాలి. ఈ నిర్మాణం భారతదేశానికి ఎంతో గర్వకారణం.

2014 సెప్టెంబర్ 1 న తాత్కాలిక భవనంలో పున:ప్రారంభమైన నలంద విశ్వవిద్యాయలం