కాంగీయులను చూచి జాలి పడవలసినదే!

 
"ఊపర్ షర్వానీ - అందర్ పరేషాణీ" అనే ఒక తురక సామెత ఉన్నది. నేడు కాంగీపార్టీ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లున్నది. "మోడీ ప్రభావం ఏమీ లేదు, మే నెలలో యుపిఎ-3 ప్రభుత్వం ఏర్పాటవుతున్నది" అని ప్రకటించిన కాంగీయుల మేకపోతు గాంభీర్యం దినదినానికి కృష్ణపక్షం చంద్రుడిలా క్షీణిస్తున్నది. 
 
తాను వివాహితుడినేనని మోడి ప్రకటించిన తరువాత కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన, కాంగీయులు మోడీ వివాహం విషయంలో పెద్ద రచ్చ చేశారు. ఎప్పుడో చాలాకాలం క్రితం ఉమాభారతి చేసిన ఉపన్యాసం సి.డి.ని ఇప్పుడు బయటికి లాగి ఎన్నికల ముందు మోడీని ఇరుకున పెట్టాలని చూశారు.  
 
గుజరాత్ పోలీసులు వారి విధులలో భాగంగా ఒక మహిళ ఫోను విషయంలో చేసిన గూఢచర్యాన్ని "స్నూప్ గేటు" పేరుతో నానా యాగీ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ అటల్ బిహారీ వాజ్ పేయిని పొగుడుతూ మోడీని దూషిస్తూ వచ్చిన కాంగీయులు అకస్మాత్తుగా రాగం మార్చారు. అటల్జీ బలహీనమైన ప్రధాని అన్నారు. మోడీ ప్రభావం ఏమాత్రం లేనప్పుడు, యుపిఎ-3 ప్రభుత్వం ఏర్పాటు నిశ్చయమని కాంగీ చెపుతున్నప్పుడు మోడీపై ఈ విపరీతమైన దాడి ఎందుకు? వారణాసిలో నామినేషన్ వేసిన సందర్భంగా జరిగిన శోభాయాత్రలో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 
 
కాంగీ పాలనలో ఉన్న ఏడు రాష్ట్రాలలో మహిళల స్థితి దయనీయంగా ఉన్నది. అక్కడి స్థితిగతులను చక్కదిద్దుకోకుండా, కాంగీయులు మోడీ పాలనలో స్త్రీలకు రక్షణ లేదని గగ్గోలు పెడుతున్నారు. 'మేమే గెలవబోతున్నాం' అని బీరాలు పలుకుతున్న కాంగీ పరిస్థితి ఎలా ఉందో వారి ఈ క్రింది ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది.

  • మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం
  • ప్రాంతీయ పార్టీల సమర్ధన మాకే
  • మూడవ ఫ్రంటు సహాయంతో మేమే అధికారం చేపడతాం
  • మూడవ ఫ్రంటు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మా సమర్ధన ఉంటుంది

ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో అని లోపల భయం. పైకి మాత్రం "ప్రభుత్వం మాదే" అని ప్రేలాపనలు.

కాంగీయులను చూచి జాలి పడవలసినదే!

- ధర్మపాలుడు