రామాయణం - శ్లోకాలు

కోన్వస్మిన్ సామ్ర్పతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ - సత్యవాక్యో దృఢవ్రత:
 


భావం : వాల్మీకి మహర్షి నారదుడిని అడుగుతాడు - "నారదా! నేడీ జగమునందు గుణవంతుడు, ప్రతాపము గలవాడు, ధర్మము లెఱింగినవాడు, మేలు మరవనివాడు, సత్యవాది, దృఢమైన నియమం గలవాడు ఎవ్వడు?''