"యోగ కూడ మతమేనట..." అనే వార్త ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది

పాఠకుల స్పందన 


ఆర్యా ! 

"యోగ కూడ మతమేనట..." అంటూ 'ఈ వార్తలు చదివారా !' శీర్షిక క్రింద ఇచ్చిన వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ఇలాంటి వార్తలు ఇతర దైనందిన పత్రికలలో రావడం లేదు. లోకహితంలో ప్రచురితమవుతున్న ఇలాంటి వార్తల ద్వారా హిందూ సమాజం చైతన్యమయ్యే అవకాశం ఎంతగానో ఉన్నది. కావున ఈ శీర్షికను తప్పనిసరిగా ప్రతిమాసం కొనసాగించాలి.

అదేవిధంగా నవంబరు మాసం పత్రికలోని "సంపాదకుని మాట" ఆలోచింపచేసేదిగా ఉన్నది. 'వివేక సూర్యోదయం' ధారావాహికలో స్వామి వివేకానంద జీవితంలోని వివిధ ఘట్టాలను ప్రచురిస్తున్నారు. వాటి ద్వారా మేమెంతో ప్రేరణ పొందుతున్నాము. ఈ 'లోకహితం' పత్రిక పుటలను పెంచి మరిన్ని మంచి విషయాలు మాకందిస్తారని ఆశిస్తున్నాము.
 

ఎల్లంకి హనుమంతరావు 
గ్రా.పెద్దపల్లి, జి.కరీంనగర్