ఎఫ్.డి.ఐ.లను వ్యతిరేకించాలి


దేశంలో మరో క్రొత్త సమస్యను సృష్టించేందుకు కేంద్రప్రభుత్వం పావులు కదుపుతున్నది. బయటి దేశాల నుండి నేరుగా మన దేశంలో వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మనదేశంలో ఇప్పటికే శీతల పానీయాల రంగంలో బయటి దేశాలు పని చేస్తున్నాయి. చిల్లర వ్యాపార రంగంలోకి బయటి దేశాల వాల్లను దింపాలని, దానితో మనదేశ వ్యాపార రంగంలో పోటీని నిర్మాణం చేయాలని, తద్వారా నాణ్యమైన వస్తువులను కొనుగోలుదారులకు అందించాలని ప్రభుత్వం ఒక కలను కంటున్నది.

వేళకాని వేళ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకొంది? నేరుగా విదేశీ పెట్టుబడులు వస్తే ఆ ముసుగులో బడాబడా కంపెనీలు దేశంలోకి చొరబడే అవకాశం ఉంది. ఆ వరుసలో ఇప్పటికే వాల్ మార్ట్ ఆధిక్యతలో కనబడుతోంది. 


దీనివల్ల దేశంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారతదేశం మధ్యతరగతి కుటుంబీకుల దేశం. మధ్యతరగతి ప్రజలు ఎవరితో సంబంధం లేకుండా వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటూ తమ కుటుంబాన్ని పోషించుకొంటూ ఉంటారు. మనదేశంలో వ్యవసాయం, వృత్తులు సామాజిక వ్యవస్థలో భాగంగా పరంపరాగతంగా వస్తున్నాయి. చిల్లర దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బీడీల వ్యపారం. ఇలా అనేక చిన్న వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయి. వ్యవసాయం తరువాత అత్యధికులకు ఉపాధిగా ఉన్నది రిటైల్ రంగం. 120 మిలియన్ల ప్రజలు ఈ రంగంపై నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం విదేశీయులకు కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై స్వదేశీ జాగరణమంచ్ ప్రభుత్వానికి తీవ్రమైన అభ్యంతరాన్ని తెలియజేసింది. ఎఫ్.డి.ఐ. చట్టాన్ని ఉపసంహరించుకోకపోతే రోడ్డెక్కి ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించింది.

- రాము