దేశానికి ఎవరు దిక్కు...?

ఇదీ వాస్తవం !
ప్రధానమంత్రి...

భారత ఔన్నత్యాన్ని చాటే పదవి
దేశ ప్రజలందరికి ప్రతినిధి
పాలనా పరంగా ఉండాలి
ప్రజలందరికి జవాబుదారి

పెద్ద దిక్కు...

అవినీతి ఆరోపణలు వస్తే
ఆర్థిక వ్యవస్థ పతనమైతే
సమస్యలతో సందిగ్ధం నెలకొంటే
దారిలో పెట్టడం ఆయన విధి

కోల్ గేట్...

దేశాన్ని కుదిపిన కోల్ కుంభకోణం
ప్రత్యక్ష సంబంధం లేదన్న మన్మోహన్
తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నం
ఒడిశా సిఎం పైకి నెపం నెట్టే యత్నం

తగ్గారు...

నేర చరితులపై వేటుకు సుప్రీంకోర్టు ఆదేశం
వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నం
రాహుల్ అసహనంతో స్పందించిన పిఎం
ఆలోచన విరమించుకుని వెనక్కు తగ్గిన వైనం

కాలింది...

మాజీ కోల్ సెక్రటరీపై సిబిఐ కేసు
ప్రధానినీ ప్రశ్నించాలన్న పరేఖ్
ఉలిక్కిపడ్డ మన్మోహన్
ప్రశ్నలకు సిద్ధమంటూ మాటమార్చిన ప్రధాని

విమర్శలు...

'పార్టీ చేతిలో కీలుబొమ్మ' అనే నిందలు
'సోనియాకు జవాబుదారీ' అని ఆరోపణలు
వ్యక్తిగత గౌరవం గంగపాలు
అసమర్థుడంటూ విమర్శలు

- హంసినీ సహస్ర