కాదేదీ 'మతమార్పిడి' కనర్హం

 
By Hook or By Crook or By Both అని ఆంగ్ల సామెత ఉంది. అనగా 'మోసం చేత గాని, ద్రోహం చేత గాని లేదా మోసం-ద్రోహం రెండూ కూడా చేసి పని సాధించాలి' అని ఆ సామెత అర్థం. క్రైస్తవ మతమార్పిడి సంస్థలు ఈ పాఠాన్ని బాగా వంట పట్టించుకున్నట్లు ఉన్నది. అమాయకమైన హిందువులను మోసం చేయడానికి వీరు క్రొత్త పద్ధతులను కనుగొంటూ ఉంటారు. 
 
 
ఈ మధ్య క్రొత్తగా కనుగొన్న మరో పద్ధతి ఏమిటంటే సుప్రభాతం. ఏసు సుప్రభాతం, వేలాంకణిమాత సుప్రభాతం, ఏసు భక్తిగీతాలు వంటివి కొన్ని రచించి ప్రముఖ గాయకులచే పాడించి మతమార్పిడుల కోసం ఉపయోగిస్తున్నారు. కొన్ని గీతాలు ఏ.ఆర్.రహమాన్ పాడారు. ఈ సుప్రభాతాలు, భక్తిగీతాలు విన్నప్పుడు అవి వేంకటేశ్వర సుప్రభాతం వింటున్నట్లే మన దేవతల భక్తి గీతాలు విన్నట్లే ఉంటాయి. చాలామంది హిందువులకు అవి క్రైస్తవ గీతాలనే విషయం కూడా తెలియదు. కొన్ని ఏసు శ్లోకాలు సంస్కృతంలో కూడా వ్రాయించారు. 
 
కాబట్టి హిందువులారా తస్మాత్ జాగ్రత్త. ఏవైన క్రొత్త సుప్రభాతాలు, గీతాలు విన్నప్పుడు అవి మనవే అని భ్రమించి మోసపోకండి. అవి సంస్కృతంలో ఉన్నా సరే..!
 
- ధర్మపాలుడు