నైతిక విలువలు గల నాయకత్వానికై ఎదురుచూపులు...

హితవచనం
భారతదేశ చరిత్రలో ఒక మౌలిక పాఠం ఉంది. ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడు తమ నైతిక ప్రమాణాలను తమ పాలకుల నుంచి ఇక్కడి మహాపురుషుల నుంచి స్వీకరిస్తారు. ఉదాత్తమైన రాజులు, నాయకుల కాంతిపుంజాలలో మసలుకొంటూ మన ప్రజలు ఉన్నత శిఖరాలనధిష్టిస్తూ వచ్చారు. అటువంటి విశిష్ట స్వభావం కలిగిన జాతి మనది. అటువంటి జాతి ఈ రోజున ఒక విచిత్ర పరిస్థితులలో చిక్కుకొంది. ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద మౌలిక సమస్య ఏమిటంటే కడు సమర్థులు, జ్ఞానసంపన్నులు, సచ్చీలురు నేడు దేశంలో ఉన్న కుళ్లు రాజకీయాలంటే గిట్టక దూరంగా ఉంటున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ధోరణులతో భారత్ నైతిక పతనావస్థలో ఉన్నది. ఇందులో అవినీతి, క్రమశిక్షణా రాహిత్యం రెండు అంశాలు మాత్రమే. ఈ పరిస్థితులలో మార్పు వచ్చినప్పుడే దేశం నిలబడుతుంది. నైతిక విలువలను నిలబెట్టే నాయకత్వం కోసం నేటితరం వేచి చూస్తున్నది.

- నానీ పాల్కీవాలా (ప్రముఖ విశ్లేషకులు)