ఉత్తరాఖండ్ లో ఆపన్నులను ఆదుకొంటున్న ఆర్.ఎస్.ఎస్.

 
ఉత్తరాఖండ్ లో గడిచిన 15 రోజుల నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘము, సేవాభారతి వంటి సేవాసంస్థల ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది కార్యకర్తలు వరద బాధితుల సహాయంలో నిమగ్నమై పనిచేస్తున్నారు. ఇందుకోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆహారం, వైద్యం, దూర ప్రదేశాల నుండి వచ్చి ఇరుక్కుపోయిన యాత్రికులకు వారి తిరుగు ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయడం వంటివి చేస్తున్నారు. రోడ్లు పూర్తిగా ధ్వంసమైన కారణంగా స్వయంసేవకులు కాలినడకనే ఆయా ప్రదేశాలకు చేరి సేవలందిస్తున్నారు. 
 
జూన్ 22 నాడు చంబా ప్రదేశంలోని శిబిరంలో పదివేల మందికి ఆహారం, వైద్యం అందించారు. భువనేశ్వరి ఆశ్రమం నుండి కూడ అనేకమంది మహిళలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మొత్తం మీద భారత సైన్యం, స్వయంసేవకులు గడచిన 15 రోజుల నుండి నిర్విరామంగా పని చేస్తున్నారు. సుమారుగా 200 గ్రామాలు పూర్తిగా ధ్వంసమైనాయి. పరిస్థితులు మెరుగైన తరువాత పూర్తిగా దెబ్బతిన్న గ్రామాల పునర్నిర్మాణం గురించి ఆలోచిస్తామని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు.