వెంట్రుకలు వత్తుగా పెరుగుటకు...

గృహ వైద్యము - 20
 
 
వెంట్రుకలు వత్తుగా పెరుగుటకు...
  • సన్నటి మర్రి ఊడలు మరియు గుంటగలగర ఆకు సమభాగములుగా కలపి మెత్తగా నూరి దానికి మూడు రెట్లు నువ్వుల నూనెలో వేసి కాచి వడగట్టి ప్రతిరోజూ తలకు రాసుకొనుచుండిన వెంట్రుకలు వత్తుగా పెరుగును.
  • మెంతికూర తగినంత నీళ్లలో కల్కము వలె నూరి ప్రతినిత్యము తలకు రాసుకొని, ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానము చేయుచున్న వెంట్రుకలు అందముగా పెరుగును.
  • మామిడి జీడి, ఉసిరిక వలుపు (పొట్టు) రెండూ సమభాగములుగా కలిపి నీటిలో నూరి తలకు పట్టించుకొని, ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలస్నానము చేయుచున్న ఎడల త్వరలోనే వెంట్రుకలు పెరుగును.

మెంతికూర


రక్తము తక్కువగా నుండుట
 
చెఱకు రసము

  • కరక్కాయ చూర్ణము 2 గ్రాములు, దానికి సమానంగా బెల్లము కలిపి ఉదయం, సాయంత్రం వేళ్లల్లో సేవించిన రక్తహీనత తగ్గిపోవును.
  • చెఱకు రసమును ప్రతిరోజు మూడు పూటలా 100 నుండి 250 మి.లీ. సేవించుచుండిన రక్తహీనత హరించును.

రక్త విరేచనాలు
కేవలము మజ్జిగ త్రాగుచున్న ఎడల రక్త విరేచనాలు ఆగిపోవును.

వరిబీజము
  • మునగ జిగురు నీటిలో అరగదీసి బీజములపై లేపనము చేసినచో వరిబీజము తగ్గిపోవును.
  • ఒక జాజికాయ, తగినంత ఆముదము కలిపి మెత్తగా నూరి బీజములపై లేపనము చేసిన వాపు తగ్గిపోవును.

వ్రణములు మాన్పుట
నల్లతుమ్మ చెక్కను మెత్తని చూర్ణము చేసి నువ్వుల నూనెలో కలిపి వ్రణముపై పూయుచుండిన ఎంతటి వ్రణమైనను మానిపోవును.
 
- శ్రీ బాలరాజు మహర్షి గారు రచించిన
'గృహవైద్యం' అనే గ్రంథం ఆధారంగా..