పాలు త్రాగి రొమ్ము గుద్దే దేశద్రోహి

 
ఇస్లామిక్ తీవ్రవాదులు అంటే గడ్డం పెంచుకుని ముఖం కనపడకుండా గుడ్డలు చుట్టుకుని ఎ.కె.47 రైఫిళ్లు ధరించి ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. మన సహోద్యోగి, మన పొరుగున ఉండే వ్యక్తి, మనకు తెలిసిన ఒక విద్యార్థి కూడా ఒక తీవ్రవాది కావచ్చు అని చెప్పినా మనం నమ్మం. ఎందుకంటే వెయ్యి సంవత్సరాల అనుభవం తరువాత కూడా ఇంగితం అలవరచుకోని కళ్ళున్న కబోదులు హిందువులు. 
 
భాగ్యనగరం హైటెక్ సిటీలో ఉన్న డెలాయింట్ కంపెనీలో "కాబ్ డ్రైవర్"గా పనిచేసిన మహమ్మద్ జియా-ఉల్-హఖ్ అనే ముస్లిం మతోన్మాది తనను పోషిస్తున్న డెలాయిట్ కంపెనీనే ప్రేల్చివేయాలని కుట్ర పన్నాడు. కంపెనీ అవరణను క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళిక రచించుకున్నాడు. ఇతడు 2006వ సంవత్సరంలో నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఒడియన్ టాకీసులో ఒక బాంబు ప్రేల్చిన దుండగుడు. పాకిస్తాన్ లో తీవ్రవాద శిక్షణ తీసుకుని కాశ్మీరు పూంచ్ విభాగం ద్వారా భారత్ లో ప్రవేశించి, తన కార్యక్రమాలు నిరాఘాటంగా నిర్వహించుకుంటున్నాడు. 
 
నగరంలోని ఒక న్యాయస్థానం ఇతడికి జనవరి 29నాడు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దురదృష్టకరమైన విషయం ఏమంటే ఇతడికి శిక్ష పడింది దేశద్రోహ నేరం క్రింద కాదు, కేవలం మారణాయుధాలు, బాంబులు కలిగి ఉన్నందుకు. ఇటువంటి నేరస్తుడికి అమెరికాలో అయితే మరణశిక్ష విధిస్తారు. ఈ శిక్షను ఆచరణలో పెడతారు కూడా.
 
- ధర్మపాలుడు