ఇ-బాంబులు వచ్చేస్తున్నాయి


మన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ.) వారు ఒక క్రొత్త ఆయుధం కనిపెట్టి, రూపొందించే పని చేపట్టారు. దానికి 'ఇ-బాంబు' అని నామకరణం చేశారు. 

రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రధాన విజ్ఞనశాస్త్ర అధికారి అవినాశ్ చంద్ర భాగ్యనగరంలోని క్షిపణి భవనంలో పత్రికల వారితో మాట్లాడుతూ కొన్ని వివరాలు అందించారు. ముందుకాలంలో జరగబోయే యుద్ధాలు ఎక్కువగా సాంకేతిక వ్యూహాత్మక ఎలక్ట్రానిక్ యుద్ధ పద్ధతులలో ఉండబోతున్నాయి. అందుకు సిద్ధంగా ఉండడానికి "విద్యుత్ అయస్కాంత కిరణ ఘాతాలు" వెలువరించగల ఇ-బాంబును డి.ఆర్.డి.ఓ. రూపొందించింది. 100 కి.మీ. వేగంతో ప్రయాణం చేయగల ఈ 'ఇ-బాంబు' భూ, గగన, సముద్రాలలోని లక్ష్యాలను ఛేదించగలదు. శత్రువు యొక్క సాంకేతిక సమాచార వ్యవస్థను ధ్వంసం చేయగలదు. ఇ-బాంబు త్వరలోనే మన అమ్ములపొదిలోకి చేరనున్నది.
- ధర్మపాలుడు