లోకహితం బాగుంటున్నది

పాఠకుల స్పందన


లోకహితం పత్రికను నేను గత నాలుగేళ్లుగా చదువుతున్నాను. చిన్న పత్రిక అయినా మంచి విషయాలు, ఉపయోగపడే విషయాలు నిండుగా ఉంటున్నాయి. 'ఏదో 8 పేజీల పత్రిక' అనేలా కాక చక్కటి సమకాలీన అంశాల విశ్లేషణతో పెద్దపత్రికలను తలపిస్తున్నది. ప్రతి అంశమూ చదువదగినదిగానే ఉంటున్నది. ఇది నేను అతిశయోక్తి కోసం వ్రాస్తున్నది కాదు. మన:పూర్వకంగా చెబుతున్నది. 

- సువీర్, మెదక్.