పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థ మోసంతో అమ్మకాలను పెంపుదల చేస్తున్నది

హితవచనం
 
పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ
 
అవసరాన్ని బట్టి ఉత్పత్తి కాకుండా ఉత్పత్తిని బట్టి మానవుడి అవసరాలను పెంచుకొనే ధోరణి సమాజంలో ఏర్పడటంతో వ్యాపారస్తుడు మానవుడి కొనుగోలు శక్తినిగాని, అవసరాలను గాని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం తన ఉత్పత్తి పంపిణీ చేయబడి అమ్ముడుపోతే చాలునని భావిస్తున్నారు. ఉత్పత్తి, ఎక్కువై ఆ వస్తువు యొక్క అవసరం సమాజంలో తక్కువగా ఉన్నప్పుడు వ్యపారస్తుడు రెండు మార్గాలను అనుసరిస్తున్నాడు. 1) వస్తువుపై సమాజానికి మోజు కలిగించటం, 2) దానివాడకం పెరగాలంటే వస్తువు త్వరగా నశించేటట్లు చూడటం. 
 
పూర్వం ఒక కుర్చీ లేదా ఒక బల్ల కొంటే అది మొత్తం తన తరానికి అంటే వ్యక్తి 80 ఏండ్ల జీవితానికి కూడా సరిపోయేది. ఇప్పుడలా గాక కొద్దిరోజులలోనే విరిగిపోవడం, పాడవడం జరగడంతో కొత్త వస్తువులను వాడటం అనాగరికమనీ, ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కొనడంలోనే ఫ్యాషన్, గౌరవం, ఆర్థిక ప్రగతి దాగి ఉన్నాయని పనిగట్టుకు ప్రచారం చేస్తున్నారు.