లోకహితం పత్రిక పుటలు పెంచగలరు...

పాఠకుల స్పందన


ఆర్యా !

లోకహితం మాసపత్రిక లోకానికి హితం చేకూర్చేటందుకే ప్రారంభించబడిందా..! అన్నట్లుగా ఉంటున్నది. ఇందులో వస్తున్న సమాచారం అన్ని రకాల వాళ్లను స్పృశించేలా ఉంటున్నది. 'ఇదీ వాస్తవం' పేరున వ్రాస్తున్న వ్యంగ్య వ్యాసాలు బాగుంటున్నాయి. 'గృహవైద్యం' శీర్షికలో ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న చిన్న చిన్న చిట్కాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య 'ప్రముఖుల మాట' అనేది ప్రవేశ పెట్టారు. దీనిద్వారా అనేకమంది పెద్దలు దేశహితం గురించి ఆలోచిస్తున్నారనే విషయం బోధపడుతున్నది. ఇది ఎంతో స్ఫూర్తిదాయకం. 'ఈ వార్తలు చదివారా' అంటూ అనేక విషయాలను చిన్న చిన్న వాక్యాలలో చెపుతున్న ధర్మపాలుడుగారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. అయితే పత్రికలో ఇంకా ఎక్కువ సమాచారం వస్తే చాలా బాగుంటుంది. దాని కోసం పుటలు పెంచగలరని నా మనవి. అవసరమైతే వెల కూడా పెంచగలరు.

- కాపర్ల వెంకటేశ్వరరావు, సికింద్రాబాద్.