ఒకే ధర్మాన్ననుసరించే హిందువులు తమలో ఈర్ష్యాద్వేషాలు పెంచుకోరాదు

ఛత్రపతి శివాజీ


శత్రువులను ఓడించి, రాజ్యస్థాపన చేయడంతోనే శివాజీ పొంగిపోలేదు. ప్రజల సుఖసంతోషాల కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ప్రజలను భగవంతుని రూపంగా భావించాడు. ప్రజలకేదైనా కష్టం వస్తే భరించలేకపోయేవాడు. ప్రజల శ్రేయస్సుకై తన సైన్యాన్ని ఎంతదూరం పంపడానికైనా సిద్ధపడేవాడు. "మార్గమధ్యంలో ప్రజలకు ఎటువంటి కష్టం కలగరాదు. పంటపొలాల్లోని ఆకులు సైతం సైనిక గమనం వలన బాధతో చలించరాదు" అని ఆజ్ఞాపించేవాడు. రైతుల పాలిట శివాజీ ప్రేమస్వరూపుడు. ధనికులైన జమిందారులు పేద రైతులను కష్టాలపాలు చేస్తే, వారి భూములను స్వాధీనం చేసుకొని పేద రైతులకు పంచేవాడు.   

ఆనాటి సమాజంలో అస్కృశ్యతా, దురాచారం నేటికన్నా చాలా ఎక్కువగా ఉండేది. ఆనాటి సమాజం తమ తోటి సోదరులను అస్పృశ్యులు అనే నెపంతో దూరంగా ఉంచేది. శివాజీ వారినందరినీ ప్రేమతో చూడడమే కాకుండా తన సైన్యంలో స్థానమిచ్చి, వారి వారి అర్హతను బట్టి ఉన్నత పదవులను కూడా ఇచ్చేవాడు. వారంతా శివాజీ యెడల భక్తి శ్రద్ధలతో మెలిగేవారు.   

స్వరాజ్య స్థాపనలోఎదురైన అనేక క్లిష్ట పరిస్థిలులను శివాజీ ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఈ మహత్కార్యంలో అనేకమంది బలిదానం కూడా చేశారు. ఒకే ధర్మాన్ననుసరించే హిందువులు తమలో ఈర్ష్యాద్వేషాలు పెంచుకోరాదనే ఆదర్శాన్ని శివాజీ మన ముందుంచాడు.