సాంస్కృతిక జాతీయవాదానికి దూరంగా పోరాదు

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్


డా.అంబేడ్కర్ ఆలోచనలను మనం అనుసరించి తీరవలసిన ముఖ్యమైన అంశం సాంస్కృతిక జాతీయవాదం. 

జాతీయతకు ఆధారం కేవలం నిర్వచించుకొన్న సరిహద్దుల మధ్య పుట్టటమో, నివసించటమో, పన్నులు చెల్లిస్తూ ఉండటమో, పౌరసత్వపు సర్టిఫికెట్ సంపాదించుకోవటమో కాజాలవని, ఆ జాతి ప్రజానీకంతో అభిన్నంగా, అవిభాజ్యంగా తనను తాను భావించుకొనే సాంస్కృతిక సూత్రం ఒకటి ఉండి తీరాలని ఆయన ప్రగాఢంగా విశ్వసించాడు. తాను పెట్టిన పత్రికలకు, సంస్థలకు, బహిష్కృత భారత్ వంటి పేర్లను ఉంచడమూ, మతం మార్చుకొనే సందర్భంలో కూడా సాంస్కృతిక ధారకు దూరంగా పోకుండా ఉండే విధంగా బౌద్ధధర్మాన్ని స్వీకరించటమూ, జాతీయ పతాకంగా కాషాయ వర్ణ పతాకాన్ని బలపరచటమూ, జాతీయ అనుసంధాన భాషగా సంస్కృతాన్ని ప్రతిపాదించే యత్నం చేయటమూ, రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంలో దీనిని ప్రాచీనమైన, సుదీర్ఘమైన చరిత్రగల జాతిగా గుర్తించి, మన జాతి  స్వాతంత్ర్యం కాపాడుకోవాలని, గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయరాదని హితవు పలకటం మొదలైనవన్నీ డా.అంబేడ్కర్ సాంస్కృతిక జాతీయ వాదానికి నిదర్శనాలు.