మహాభారత పద్యాలు (విదుర నీతి)

పాపంబులు కర్జములని
యేపునన్ జేయంగ నవియు నింపగు; ధర్మ

వ్యాపారంబు లకార్యము
లై పరిణతిన్ బొందె నేని నట్టుల చెల్లున్
 

భావం : పాపాలు చేయవచ్చు అని పొగరెక్కి చేస్తూ ఉంటే అవే రుచిగా ఉంటాయి. ధర్మ కార్యాలు చేయరానివిగా మనస్సులో నిర్ణయం కలిగితే అవీ అలాంటివే అనిపిస్తాయి.