భారత్ నుండి ఎంతో నేర్చుకోవాలి

ప్రొ.యువాన్ టి.లి.
 
'ఎంతో అభివృద్ధి చెందిన దేశాలుగా పేరుబడ్డ దేశాలు నిజానికి భారతదేశం నుండి ఎంతో నేర్చుకోవలసి ఉంది' అన్నారు తైవాన్ కు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత ప్రొ.యువాన్ టి.లి.

 
"ట్రాన్స్ ఫర్మేషన్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్" అనే కార్యక్రమం భాగ్యనగరంలోని జూబ్లీహాలులో జరిగింది. ప్రొ.లి. కార్యక్రమంలో మాట్లాడుతూ "ఏ వస్తువునైనా కొంతకాలం వినియోగించి మూలన పడేయడం అమెరికా వంటి దేశాలలో పోకడ, కాని భారత్ లో వాటిని బాగుచేసుకుని తిరిగి వినియోగంలోకి తీసుకువస్తారు. ఆ పరిజ్ఞానం, ఉపాయం అభివృద్ధి చెందిన దేశాలలో కనపడదు" అన్నారు. భారతీయుల జీవనశైలి ఎంతో ఉన్నతంగా ఉన్నదని, దాని నుండి విదేశీయులు స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు.
 
- ధర్మపాలుడు