హైందవేతర మత సంస్థలు మా గ్రామాలలో అడుగు పెట్టరాదు

మా గ్రామాలలోకి హైందవేతరులు రాకూడదంటూ నిషేధించిన బస్తర్ జిల్లాలోని సిరిస్ గూడ గ్రామ పంచాయితీ ప్రజలు
 
కొన్ని ప్రాంతాలను వెనుకబడిన ప్రాంతాలుగా మనం చూస్తూ ఉంటాం. 'నవ్విన నాపచేలే పండుతాయి' అన్నట్లు చిన్నచూపుకు గురైన వారే ఆదర్శంగా నిలుస్తారు కొన్నిసార్లు. సిర్సీగుడా అనేది ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లలోని ఒక గ్రామం. ఈ గ్రామం చుట్టుప్రక్కల గల 50 గ్రామాల వారు 'మహా పంచాయత్' నిర్వహించి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. 
 
'క్రైస్తవ మిషనరీలు గాని ఇతర హైందవేతర మత సంస్థలు గాని మా గ్రామాలలో అడుగు పెట్టరాదు, మత ప్రచారం చేయరాదు. హిందూ దేవతలను, సంస్కారాలను దూషించరాదు' అని తీర్మానించారు. ఛత్తీస్ ఘడ్ పంచాయితీరాజ్ చట్టం సెక్షన్ 129 (జి) అనుసరించి హైందవేతర మిషనరీలను నిషేధించారు. ఇంతటి చైతన్యం రావడానికి స్థానిక విశ్వహిందూ పరిషత్ చేసిన విశేషమైన కృషే కారణం. 
 
ఐతే ఛత్తీస్ ఘడ్ క్రైస్తవ సంఘం (CCF) ఈ చర్యను తీవ్రంగా నిరసించింది. భళా బస్తర్. యావత్ భారతదేశం నీ నుండి స్ఫూర్తిని పొందుగాక. శుభం భూయాత్.
 
- ధర్మపాలుడు