కష్టాల సుడిగుండంలో దేవాదిదేవుడు

 
"ఏడుకొండలు కాదు, రెండే కొండలు" అని ప్రభుత్వం అంటుంది. ఎన్నో కష్టాలు పడి ఏడు కొండల్ని రక్షించుకుంటే తరువాత ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అన్నారు. ఆపసోపాలు పడి అయిదు అంతస్తులు పడగొట్టమని చెప్పిస్తే, ఇదిగో మళ్లీ ఇప్పడు క్రికెట్ క్రీడాస్థలం అంటున్నారు. దీన్ని విజయవంతంగా ఎదుర్కొంటే మళ్ళీ ఏం ముంచుకొస్తుందోనని మన తిరుపతి వేంకటేశ్వరస్వామి భయపడుతూ న్నట్లుంది. దేశంలో స్థలమే లేనట్లు ప్రతి అడ్డమైన కట్టడాన్నీ తిరుపతికే తెస్తున్నారు.
 
 
తిరుమల కొండలను ఆనుకుని ఉన్న రక్షిత అటవీ స్థలంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం 20.11.2013నాడు ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనివల్ల అటవీవృక్షసంపద, జీవన సంపద, పరిసర వాతావరణం క్షీణించడమే కాక భ్రదతాపరమైన సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయని నిపుణులు అంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, విశ్వహిందూపరిషత్ లకు మళ్లీ పని తగిలింది. ఇంకేం, నడుం బిగించండి.
 
- ధర్మపాలుడు