ముగింపు దశలో కాంగ్రెస్

ప్రముఖుల మాట

ముగింపు దశలో కాంగ్రెస్ :


కుటుంబ పాలనలో ఉన్న పెద్ద లోపం ఏమంటే ఆ కుటుంబం నుండి తెలివైనవారు ఉద్భవిస్తేనే పార్టీకి మనుగడ. అటువంటి వారు కొరవడితే పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అదే. నెహ్రూ కుటుంబంలో రాహుల్ చరిష్మా కలిగిన రాజకీయ నాయకుడు కాదు. సరియైన వ్యూహరచనా సామర్ధ్యం ఆయన వద్ద కనిపించడం లేదు. ఫలితంగా కాంగ్రెస్ దశ కూడా ముగింపుకొచ్చేసింది. అంటే రాహుల్ గాంధీతో కాంగ్రెస్ ప్రస్థానం ముగిసిపోతుంది. అందువల్ల 2014 నుండి భారత్ కొత్తరూపంలో ఉన్న దేశంగా తన ప్రస్థానాన్ని కొనసాగించ బోతున్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

- లార్డ్ మేఘనాథ్ దేశాయ్
(బ్రిటిష్ లేబర్ పార్టీ రాజకీయ నాయకుడు, ఆర్థిక వేత్త, 
భారత రాజకీయాల నిశిత పరిశీలకుడు) 

- ఆంధ్రభూమి సౌజన్యంతో...