బాలలను వేధించిన మతగురువులను వెంటనే తొలగించాలి

పాఠకుల స్పందన  
ఆర్యా ! 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ చర్చిలలో బాలలపై వేధింపులకు పాల్పడిన మత గురువులను వెంటనే చర్చి నుండి తొలగించాలని ఐక్యరాజ్యసమితి వాటికన్ లో గల పోప్ ను కోరింది. బాలలపై నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయా ప్రభుత్వాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. బాలలపై వేధింపులకు సంబంధించి చర్చిలో ఉన్న వేలాది కేసుల వివరాలను బయట పెట్టాలని ఐక్యరాజ్యసమితిలోని బాలల హక్కుల సంస్థ కోరింది. 
ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కోరిన విధంగా చర్చి చేయగలదా? వేధింపులకు గురైన బాలలకు, వారి తల్లిదండ్రులకు చర్చి న్యాయం చేయగలదా? ఈ విధమైన న్యాయం చేయలేకపోయినట్లైతే 'తమ చర్చిలో ఇటువంటివి సర్వసాధారణమే' అని క్రైస్తవ మతాధిపతి పోప్ అంగీకరించినట్లుగా ప్రపంచంలోని మిగతా సమాజం అర్థం చేసుకోవలసి ఉంటుంది. దీనికి చర్చి ఒప్పుకొంటుందా? లేక ఆరోపణలెదుర్కొంటున్న వారిని బయటికి పంపి చర్చి తన పవిత్రతను నిరూపించుకుంటుందా? 
- ముప్పిడి మహేష్ కుమార్, కరీంనగర్ జిల్లా