తెలుగుకు మంచి రోజులొచ్చాయి...!

 
నిర్లక్ష్యానికి గురై కునారిల్లుతున్న తెలుగు భాషకు ప్రాణవాయువునందించి ప్రాణం నిలుపుతున్న మంచివారు ఇంకా ఉన్నారు. కాబట్టే తెలుగు భాష ఇంకా బ్రతికి ఉన్నది. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్రాతకోతల వ్యవహారాలు తెలుగులోనే జరుగుతున్నాయి. ఫైళ్లు ఆంగ్లంలో ఉంటే కలెక్టరు గారు వాటిని చూడరు. లేఖలు అన్నీ తెలుగులో ఉండాలని పట్టుపడతారాయన. ఇది ఒకప్పటి విషయం.  
 
ఇప్పటి కలెక్టర్ చిరంజీవులు క్రొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని ఆదేశాలిచ్చారు. పుష్పగుచ్చాలు, మిఠాయిలు ఎవ్వరూ తీసుకుని రాకూడదనీ, వాటికి మారుగా పలకలూ బలపాలూ తీసుకురావాలన్నారు. ఆ విధంగా వచ్చిన పలక-బలపాలను నిరక్షరాస్యులకు పంచి, వారు చదువు నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యం కోసం "మన కోసం మనం" అనే ప్రణాళిక చేపట్టారు. చదువు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న నిరక్షరాస్యులు పలకలు బలపాలు ఇంకా కావాలని అడుగుతూ ఉండడం శుభపరిణామం.
 
- ధర్మపాలుడు