సుమతీ శతకము

ఏరిన ముత్యాలు
 
 
కూరిమి గల దినములలో
నేరములెన్నడును కలుగనేరవు, మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !


భావం : ఓ సుబుద్ధీ ! మనుషులు ప్రేమతో కలిసి మెలసి ఉంటున్న రోజులలో ఎన్ని తప్పులు చేసినను అవి దోషములుగా పరిగణింపబడవు. కాని ఆ ప్రేమ వికటించినప్పుడు ఎంత మంచి పని చేసినప్పటికి దానిలో దోషములే కనబడుతుంటాయి సుమా!