గూగుల్ సైన్స్ ప్రదర్శనలో భారత బాలిక ఘనత


గూగుల్, లెగో, సీ.ఈ.ఆర్.ఎన్., నేషనల్ జాగ్రఫిక్, సైంటిఫిక్ అమెరికన్ సంస్థలు ఆన్ లైన్ లో 2013 జనవరిలో ఏర్పాటు చేసిన గూగుల్ సైన్స్ ప్రదర్శనలో ఎంపిక చేసిన 15 మంది ఫైనలిస్టుల జాబితాలో సృష్టి ఆస్థానా (15) అనే భారతీయ బాలిక చోటు దక్కించుకుంది. 120 దేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మొహాలీకి చెందిన ఆమె ఈ ఘనత సాధించింది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే డిటర్జెంట్ నీటి శుద్ధి విధానాన్ని ఆమె రూపొందించింది. అమెరికాలో సెప్టెంబర్ 23న ఈ ప్రాజెక్టులను ప్రదర్శించే అవకాశమిస్తారు.