అంతర్గత కలహాల్లో ఇస్లాం

ISIS తీవ్రవాదులు
 
ప్రపంచంలో 66 ముస్లిం దేశాలున్నాయి. ఇస్లాం గొడుగు కింద మేమంతా ఒకటే అని చాటి చెప్పేందుకు ముస్లిం మత ప్రవక్తలు ప్రయత్నిస్తుంటారు. కాని ముస్లింల మధ్య అనేక వర్గాలున్నాయి. షియాలు, సున్నీలుగా వారు విడిపోయారు. ఎప్పటికప్పుడు వీరిమధ్య ప్రపంచవ్యాప్తంగా గొడవలు జరుగుతుంటాయి. లక్నోలో చాలాసార్లు షియా, సున్నీల మధ్య గొడవలు జరిగాయి. ఈ తగాదా తారాస్థాయికి చేరి తీవ్రవాదంగా రూపుదిద్దుకొంది. అదే తాలిబాన్. జిహాదీ తీవ్రవాదులుగా తాలిబాన్లు ఇరాక్, సిరియా, పాకిస్తాన్ లలో సృష్టిస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. పాకిస్తాన్ లో ఐ.యస్.ఐ.తో మొదలై నేడు సిరియాకు చెందిన సున్నీ జిహాదీలు ఇరాక్ లో తాజాగా సృష్టించిన హింసోన్మాదంతో వారి మధ్య అంతర్గత కలహాలు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. జూన్ 2వ వారంలో 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా' (ISIS) పేరున గల జిహాదీ తీవ్రవాద సంస్థ ఇరాక్ లో అనేక భూభాగాలను ఆక్రమిస్తూ బాగ్దాద్ వరకు చొచ్చుకెళ్ళారు. 40మంది భారతీయులను బందీలుగా పట్టుకున్నారు. సిరియా నుండి ఇరాక్ వరకు ఖలీపా రాజ్యాన్ని స్థాపిస్తామంటున్నారు. వీరు సున్నీ తెగకు చెందినవారు. వీరు సద్దాం హుస్సేన్ ను తమ నాయకుడిగా భావిస్తారు. ఇరాక్ లో షియాలను మట్టుపెట్టడమే వీరి ధ్యేయం. వీరికి ముందే తాలిబాన్ మూకలు బలూచిస్తాన్ లో ఇరాన్ యాత్రకు వెళ్ళివస్తున్న 210 మంది షియా ముస్లింలను ఆత్మాహుతి దాడి చేసి మట్టుపెట్టారు. తాజాగా కరాచీ విమానాశ్రయంపై దాడి జరిపారు. పాకిస్తాన్ కు చెందిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ ఇందుకు తాము బాధ్యులమని ప్రకటించింది. పాక్ షియాలపై కూడా సున్నీల దాడులు జరుగుతున్నాయి. 
 
మరోప్రక్క భారత్ లో క్రొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నది. మోదీ ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించడంతోనే ఇది మొదలయింది. ఇది హిందువుల సత్సంప్రదాయం. అందరికీ ప్రేమను, శాంతిని ఇవ్వాలన్న ఆరాటం. ఎన్నో రకాల భిన్నత్వం ఉన్న భారత్ లో అంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇదీ హిందుత్వంలో ఉన్న విశేషత. ఇవాళ ఇస్లాం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ లలో నిరంతరం జరుగుతున్న రక్తపాతాన్ని ఆపలేకపోతోంది. పాకిస్తాన్ ప్రారంభించిన తీవ్రవాదం చివరకు అన్ని ముస్లిం దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో సేవలందిస్తున్న భారత్ ఎయిడ్స్ వర్కర్లను తాలిబాన్లు చుట్టుముట్టారు. ఆఫ్ఘనిస్తాన్ (ఒకప్పటి గాంధారదేశం) తో భారత్ కు గల చారిత్రక సంబంధం ముస్లింలకు అర్థం కాదు. ఇరాక్ లో 18000 మంది భారతీయులు వివిధ రకాల వృత్తుల్లో అక్కడ సేవలందిస్తున్నారు. భారతీయులు ప్రపంచమంతా విస్తరించి ఉన్నారు. సేవ, ప్రేమల ద్వారా ఆయా దేశాల అభిమానం చూరగొన్నారు. కాని తమవైన ముస్లిం దేశాలలోనే ఆధిపత్యం కోసం ముస్లిం తీవ్రవాదులు సృష్టిస్తున్న హింస, వర్గ పోరాటాలు చూసినప్పుడు 'ఇస్లాం' కలిపే వాదం కాదని, కలహాల సిద్ధాంతమని తెలుస్తుంది. భారత్ లో కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలున్నారు. వారు ISIS తరహా తీవ్రవాదంతో కాక భారత్ లో శాంతిసామరస్యం ఊపిరిగా వేళ్ళూనుకున్న హిందుత్వంతో ప్రేరణ పొందాలి. భారత్ ఎవరి మీద ఆధిపత్యం చెలాయించాలనుకోవడం లేదు. కాని తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించదు. ఇది జిహాదీలు గుర్తించాలి. 
 
- హనుమత్ ప్రసాద్