నితిష్ నోట 'నమో మోడీ..'

 
'నేను చెపుతున్నానను వినండి, నరేంద్రభాయ్ మోడీ గుజరాత్ కే పరిమితం కాడు, నరేంద్ర మోడీ తప్పకుండా జాతీయ నాయకుడు అవుతాడు. దేశానికి మోడీ సేవలు తప్పకుండా అందుతాయి'. ఈ మాటలు అన్నదెవరో తెలుసా?! సాక్షాత్తూ నితీష్ కుమార్, జనతాదళ్(యు) నాయకుడు. ఒక రైల్వే ప్రాజెక్టు ఆవిష్కారం సందర్భంగా 2003వ సంవత్సరంలో నితిష్ మనసారా పలికిన పలుకులివి. ఇప్పుడేమో మోడీని వ్యతిరేకిస్తూ ఎన్.డి.ఎ. నుండి బయటికొచ్చారు. ఎందుకు? అందుకు ఆయన చెబుతున్న సెక్యులర్ వాదం కారణం కాదేమో?! 'ప్రధాని కావాలని తాను కంటున్న కలలకు మోడీ అడ్డం' అని నితిష్ భావిస్తున్నాడేమో?! ఏమో చెప్పలేం.
 
- ధర్మపాలుడు