లోకహితం పత్రిక ఆలోచింపచేస్తోంది..

పాఠకుల స్పందన


ఆర్యా!  

లోకహితం మాసపత్రిక విభిన్న దృక్కోణాలతో, ఏది ఎంతవరకు అందించాలో అంతవరకు, చాలా క్లుప్తంగా, స్పష్టంగా అందించబడుతున్నది. 'ప్రముఖుల మాట' ప్రధాన ప్రేరణదాయకంగా ఉంటున్నది. జూలై మాసంలో ప్రచురింపబడిన 'ముందే అమాయక సోదరుడు - పైగా బాలుడు' ఘట్టం ఆలోచించటానికి టానిక్కు అందించింది. 'హితవచనం'లో శ్యాంప్రసాద్ ముఖర్జీగారి '370' ఆర్టికల్ విషయంలో తపన-వేదన, నెహ్రూగారి వంతవాదన స్పష్టం చేశారు.

'ఈ వార్తలు చదివారా' శీర్షికలో చదివిన వార్తలనే మరోసారి సరికొత్త కూర్పులతో చక్కగా అందిస్తున్నందుకు ధన్యవాదములు. 

మధ్యపుటలో ప్రచురించిన కథనం పత్రికకే ఒక అందం, ఒక చందం. 'మనం అనే భావన నేడు చాలా అవసరం, సోదరీ-సోదర భావం పటిష్టంగా ఉన్నప్పుడే స్త్రీలు గౌరవింపబడతారు. సంరక్షించబడతారు. ఇది నిజం. ఇది జాతీయ ఆవశ్యకత' అని వ్రాశారు. అది కూడా నిజం.  వ్యాసకర్త రాము గారికి అభినందనలు. మీకు ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు.  

- జగం, జియాగూడ, హైదరాబాద్