విజ్ఞానమూ, మతమూ పరస్పర పూరకాలు

వివేక సూర్యోదయం - ధారావాహికం - 20 


విజ్ఞానమూ, మతమూ పరస్పర విరుద్ధమైన పని పాశ్చాత్యులు ఆదినుండి భావిస్తూ వచ్చారు. రెండింటికీ వైరుధ్యం లేదు. అవి పరస్పర అనుబంధం గలవని స్వామి వివేకానంద ఈ క్రిందివిధంగా ఉద్ఘాటించారు.

"ఏకత్వ స్థితిని ఆవిష్కరించడమే విజ్ఞానం. పరిపూర్ణ ఏకత్వ స్థితిని సంతరించుకోగానే విజ్ఞానం ఇక ముందుకుపోక ఆగిపోతుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడమే అందుకు కారణం. అదేవిధంగా ఏ ముడిసరుకు నుండి సమస్త పదార్థాలు సృజింపబడుతున్నవో, దానిని కనుగొన్న తరువాత రసాయ శాస్త్రం పరోగమించదు. ఏ మూల శక్తి నుండి శక్తులన్నీ ఆవిర్భవిస్తున్నవో, దానిని కనుగొన్న తరువాత భౌతికశాస్త్రం ఆగిపోతుంది. మరణంతో కూడుకొన్న ఈ ప్రపంచంలో మరణానికి అతీతమైన ఒక జీవిని కనుగొనగానే మారుతూ ఉన్నప్రపంచంలో పరిణమించని ఒకే ఆధారమైన అతణ్ని కనుగొనగానే, ఏ ఒకే ఆత్మనుండి ఇతర ఆత్మలు వెలువడుతున్నట్లు మాయ వలన కానవస్తుందో ఆ ఆత్మను కనిపెట్టగానే మతవిజ్ఞానం పరిపూర్ణమవుతుంది".