నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు..

 
సమాజంలో కొంతమేరకు అలసత్వం, నిర్లక్ష్యం ఉంటే ఉండవచ్చును గాక, కానీ దేశ భద్రత, గౌరవాల విషయంలో కూడా అలసత్వం వహించడం దారుణం మరియు దేశద్రోహం. మన భాగ్యనగరం తీవ్రవాదులకు మెట్టినిల్లు. కొండొకచో పుట్టినిల్లు కూడా. ఈ విషయం బహిరంగ రహస్యమే. కారణమేమో గాని, వివిధ ముస్లిం దేశాల నుండి యువతీయువకులు 'చదువు' పేరుతో భాగ్యనగరానికి ఎక్కువగా వస్తున్నారు. క్రిందటి సంవత్సరం 1400 మంది విదేశీయ విద్యార్థులు రాగా ఈ సంవత్సరం 1745  మంది వచ్చి చేరారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంగ్లమూ తదితర విదేశీయ భాషల విద్యాకేంద్రం (సి.ఐ.ఇ.ఎఫ్.ఎల్.), ఇతర కళాశాలలలో చేరుతూ ఉంటారు. ఇప్పటికి 4 వేల మందికి మించి విదేశీ విద్యార్థులు (ఎక్కువగా ముస్లింలు) భాగ్యనగరంలో ఉన్నారు. వీరిలో చాలామంది దొంగనోట్ల మార్పిడి, మాదకద్రవ్యాల విక్రయం, నిషేధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం అనే నేరాలకు పాల్పడుతూ ఉంటారు. వీరిలో చాలామందికి అతి ముఖ్యమైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఒక ముస్లిం విద్యార్థి తన అనుభవాన్ని వివరిస్తూ 'ఒకసారి లైసెన్సు లేనందుకు పోలీసు ఆపాడు, రూ.90 పడేస్తే వదిలేసాడు' అని చెప్పాడు. ఈ విదేశీయ యువకులు వాహనాలు కొనడం, అమ్మడం చేస్తూ ఉంటారు. రిజిస్ట్రేషన్ గాని లైసెన్స్ గాని వీరికి అవసరం లేదు. 
 
'ఎంతోమంది విదేశీయ విద్యార్థులు లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు' అన్న సమాచారం మా వద్ద లేదు అని జాయింటు ట్రాన్స్ పోర్టు కమిషనర్ టి.రఘురాం చెప్పారు. మన అధికారులు ముందుగా దేశహితం గురించి ఆలోచించాలి.
 
- ధర్మపాలుడు