ముస్లింలకు మాత్రమేనా..? సుప్రీంకోర్టు ఆగ్రహం

 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముజాఫర్ నగర్ లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన ముస్లిం సోదరులకు 5 లక్షల పరిహారం (రూ.5,00,000) ప్రకటించింది. ఈ పరిహారం ముస్లింలకు మాత్రమేనని పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి సదాశివం, జస్టిస్ రంజన్ దేశాయి, జస్టిస్ రంజన్ గొగోయిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ "ముస్లింలకు మాత్రమే పరిహారం ఎలా ఇస్తారు? కలహాలలో నష్టపోయిన అందరినీ సమానంగానే చూడాలి. ఇటువంటి చర్యలు సమాజాన్ని విడదీస్తాయి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వును ఉపసంహరిస్తామని యు.పి.ఎ. న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 
 
- ధర్మపాలుడు