సార్.... టెలిగ్రాం

 
మీకు జ్ఞాపకం ఉందా? 2011వ సంవత్సరంలో 'కనుమరుగవుతున్న పావలా...!' అని ఒక వార్త వెలువడింది. ఇప్పుడు ఇంకొక వార్త. ఇప్పటి యువతకు తెలియదేమో కాని, ఒకప్పుడు టెలిగ్రాం అనేది మన సమాజంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరి ఇటి ముందైనా 'సార్ టిలిగ్రాం' అని కేక వినిపించగానే ఇంట్లో అందరూ కంగారు పడేవారు. ఆ టెలిగ్రాంలో ఒకే ఒక వాక్యంలో సందేశం ఉండేది. ఆ సందేశం శుభవార్త కావచ్చు, విషాదకర సందేశం కావచ్చు. ఏది ఏమైనా ఆఘమేఘాల మీద వార్తను చేరవేసే సాధనం టెలిగ్రాం. జూన్ 15వ తేదీ 2013నాడు ఈ సాధనం అంతర్ధానమై చరిత్ర పుటలలోకి వెళ్లిపోయింది. 1850లో మొదలైన ఈ టెలిగ్రాం సేవ 163 సంవత్సరాల పాటు భారతీయులకు నిరంతర సేవలందించింది.
 
 
- ధర్మపాలుడు